E-Paper
Advertisement

ఫోన్ స్టోరేజ్ ప్రాబ్లమా? ఒక్క ఫోటో కూడా డిలీట్ చేయకుండా స్పేస్ పెంచుకోండిలా!

ఫోన్ స్టోరేజ్ ప్రాబ్లమా? ఒక్క ఫోటో కూడా డిలీట్ చేయకుండా స్పేస్ పెంచుకోండిలా!
Advertisement

Phone Storage Tips: స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో Storage Full అనే మెసేజ్ చూసే ఉంటారు. ముఖ్యంగా జ్ఞాపకాలుగా దాచుకున్న ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయడం ఎవరికీ ఇష్టం ఉండదు. అయితే, మీకు ఇష్టమైన ఒక్క ఫొటోను కూడా డిలీట్ చేయకుండానే ఫోన్‌లో బోలెడంత స్పేస్ పెంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు సింపుల్‌గా తెలుసుకుందాం.

యాప్స్ క్యాచీ డేటా క్లియర్:

మనం రోజూ వాడే వాట్సప్.. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో కొంత డేటాను Cache రూపంలో సేవ్ చేసుకుంటాయి. ఇది కాలక్రమేణా జీబీల్లోకి చేరి స్టోరేజ్‌ను మింగేస్తుంది. దీని కోసం ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. యాప్స్ మేనేజర్‌ని ఓపెన్ చేసి, ఎక్కువగా వాడే యాప్స్ క్యాచీ డేటాను క్లియర్ చేయడం ద్వారా ఫొటోలు పోకుండానే చాలా స్పేస్ కలిసి వస్తుంది.

Advertisement

Also Read: మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే.. వెంటనే మార్చాల్సిన 5 సెట్టింగ్స్ ఇవే!

క్లౌడ్ స్టోరేజ్‌ చెక్ చేసుకోండి:

ఫోన్ మెమొరీని ఖాళీ చేయడానికి గూగుల్ డ్రైవ్ లేదా గూగుల్ ఫొటోస్ అద్భుతంగా పనిచేస్తాయి. మీ ఫోన్‌లోని ఫొటోలను గూగుల్ ఫొటోస్‌లో బ్యాకప్ పెట్టుకుని, ఆ తర్వాత ‘ఫ్రీ అప్ స్పేస్’ ఆప్షన్ నొక్కితే.. బ్యాకప్ అయిన ఫొటోలు ఫోన్ మెమొరీ నుండి మాత్రమే డిలీట్ అవుతాయి. కానీ అవి క్లౌడ్‌లో సురక్షితంగా ఉంటాయి. దీంతో ఎప్పుడు కావాలన్నా ఇంటర్నెట్ ద్వారా చూసుకోవచ్చు.

వాట్సప్ మీడియాపై ఓ కన్నేయండి:

Advertisement

మనకు వచ్చే గుడ్ మార్నింగ్ మెసేజ్‌లు, అవసరం లేని ఫార్వర్డ్ వీడియోలు వాట్సప్ ద్వారా వచ్చి ఫోన్‌ను నింపేస్తుంటాయి. వాట్సప్ సెట్టింగ్స్‌లో ‘మేనేజ్ స్టోరేజ్’ లోకి వెళ్తే.. ఏయే ఫైల్స్ ఎక్కువ స్పేస్ తీసుకుంటున్నాయో స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ పనికిరాని డూప్లికేట్ వీడియోలు, పెద్ద ఫైల్స్‌ను గుర్తించి డిలీట్ చేస్తే మీ పర్సనల్ ఫొటోలు డిలీట్ చేయాల్సిన అవసరమే రాదు.

వాడని యాప్స్‌ తొలగింపు:

చాలా కాలంగా వాడకుండా ఫోన్ మూలలో పడి ఉన్న యాప్స్, గేమ్స్ ఎంతో కొంత స్టోరేజ్‌ను ఆక్రమిస్తాయి. అలాగే ఇన్-బిల్ట్ ఫైల్ మేనేజర్‌ని ఓపెన్ చేసి ‘డౌన్‌లోడ్స్’ ఫోల్డర్‌ను చెక్ చేయండి. గతంలో ఎప్పుడో డౌన్‌లోడ్ చేసిన పాత పీడీఎఫ్ ఫైల్స్, జిప్ ఫైల్స్ అక్కడే ఉండిపోతాయి. వాటిని తొలగించడం ద్వారా ఫోన్ స్టోరేజ్ సమస్య నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు.

Also Read: అమెజాన్ సేల్ మిస్ అయ్యారా? డోంట్ వర్రీ.. ఇంకా తక్కువ ధరకే దొరుకుతున్న బెస్ట్ గ్యాడ్జెట్స్ ఇవే!

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×