E-Paper
Advertisement

ఐఫోన్ వాడుతున్నారా? ఫోన్ లుక్‌ను పూర్తిగా మార్చేసే iOS 27 వచ్చేసింది.. ఇలా ఇన్‌స్టాల్ చేసుకోండి!

ఐఫోన్ వాడుతున్నారా? ఫోన్ లుక్‌ను పూర్తిగా మార్చేసే iOS 27 వచ్చేసింది.. ఇలా ఇన్‌స్టాల్ చేసుకోండి!
Advertisement

iOS 27 Public Beta: యాపిల్ ప్రియులకు సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది. డెవలపర్లకే పరిమితమైన iOS 27 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇప్పుడు సాధారణ వినియోగదారుల కోసం ‘పబ్లిక్ బీటా’ రూపంలో కంపెనీ విడుదల చేసింది. కొత్త ఫీచర్లను అందరికంటే ముందే వాడి చూడాలనుకునే ఐఫోన్ యూజర్లకు ఇదొక మంచి అవకాశం. పూర్తి వివరాల్లోకి వెళితే..

కొత్త సిరి.. సరికొత్త హంగులు:

ఈ అప్‌డేట్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సిరి గురించి. దీనికి సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాలను జోడించారు. ఇప్పుడు సిరి కేవలం వాయిస్ అసిస్టెంట్‌లా కాకుండా.. మనతో ఒక ఫ్రెండ్‌లా మాట్లాడగలదు. పాత విషయాలను గుర్తుంచుకుని మరీ సమాధానాలు ఇస్తుంది. నోట్స్, మెయిల్స్ వంటి యాప్స్‌లో మనకు నచ్చినట్లుగా రాయడానికి కూడా ఇది సాయపడుతుంది.

లిక్విడ్ గ్లాస్, డిజైన్ మార్పులు:

Advertisement

గత ఐఓఎస్ వెర్షన్‌లో పరిచయమైన ‘లిక్విడ్ గ్లాస్’ డిజైన్‌ను మరింత మెరుగుపరిచారు. ఈసారి యూజర్లు తమ ఫోన్ స్క్రీన్ ట్రాన్స్‌పరెన్సీ (పారదర్శకత) స్థాయిలను తమకు నచ్చినట్లుగా సర్దుబాటు చేసుకునే సరికొత్త స్లైడర్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. దీంతో ఫోన్ డిస్‌ప్లే చూడటానికి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Also Read: టైటానియం ఫ్రేమ్, అదిరిపోయే లుక్.. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై ఊహించని రేంజ్‌లో భారీ డిస్కౌంట్!

అద్భుతమైన ఫొటో ఎడిటింగ్ టూల్స్:

Advertisement

ఇక ఫొటోల విషయానికి వస్తే.. సరికొత్త ఎడిటింగ్ ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌లో వద్దనుకున్న వస్తువులను సులభంగా తొలగించవచ్చు. అలాగే ఫొటోను రీఫ్రేమ్ చేయడం, సీన్‌ను విస్తరించడం వంటి పనులను క్షణాల్లో చేసేయవచ్చు. యాప్స్ ఓపెన్ అయ్యే వేగం కూడా మునుపటి కంటే చాలా పెరిగింది.

ఏయే ఐఫోన్లలో పనిచేస్తుంది?

ఐఫోన్ 11 సిరీస్ నుంచి మొదలుకొని ఆ తర్వాత వచ్చిన అన్ని మోడల్స్ ఈ అప్‌డేట్‌కు సపోర్ట్ చేస్తాయి. అయితే.. స్మార్ట్ ఏఐ ఫీచర్లు కేవలం ఐఫోన్ 15 ప్రో మోడల్స్, ఐఫోన్ 16 సిరీస్, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తాయని ఆయాపిల్ స్పష్టం చేసింది.

ఇన్‌స్టాల్ చేసుకునే విధానం:

మొదటగా మీ ఐఫోన్ బ్రౌజర్‌లో beta.apple.com వెబ్‌సైట్‌కు వెళ్లి మీ యాపిల్ ఐడీతో సైన్ అప్ అవ్వాలి. నిబంధనలను అంగీకరించిన తర్వాత.. మీ ఫోన్‌లో Settings ఓపెన్ చేయాలి. అందులో General లోకి వెళ్లి Software Update క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే Beta Updates ఆప్షన్‌పై నొక్కి iOS 27 Public Betaను సెలెక్ట్ చేసుకోవాలి. చివరగా Download and install నొక్కితే సరిపోతుంది. ఇది బీటా వెర్షన్ కాబట్టి ఫోన్ బ్యాకప్ తీసుకున్న తర్వాతే ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది.

Also Read: Redmi Turbo 6 Series లీక్.. ఏకంగా 10,000mAh బ్యాటరీ, పవర్‌ఫుల్ చిప్‌సెట్‌తో రాబోతున్న కొత్త ఫోన్లు!

Related News

Whatsappలో కొత్త ఫీచర్.. ఇక మీ భార్య చేతిలో తన్నులు తినక్కర్లేదు!

తక్కువ బడ్జెట్‌లో ఇయర్ బడ్స్..ఆఫర్ ఉన్నప్పుడే కొనేయండి

ఈ ఇయర్‌బడ్స్.. చూస్తే ఫిదా అయిపోతారంతే !

కరెంట్, నీళ్లు ఆదా..పర్ఫార్మెన్స్ అద్భుతం

ఇంటి కోసం బెస్ట్..ఇన్వర్టర్ కొనాలనుకుంటున్నారా ?

ఫోన్లు, టీవీల వెనుక ఉండే.. ‘CE’ గుర్తు అర్థమేంటి? దాని రహస్యం ఇదే!

టైటానియం ఫ్రేమ్, అదిరిపోయే లుక్.. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై ఊహించని రేంజ్‌లో భారీ డిస్కౌంట్!

Big Stories

Advertisement
×