E-Paper
Advertisement

వాషింగ్ మెషీన్ వాడుతున్నారా? మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే!

వాషింగ్ మెషీన్ వాడుతున్నారా? మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే!
Advertisement

Washing machine mistakes: ప్రస్తుతం ప్రతి ఇళ్లలోనూ వాషింగ్ మెషీన్ అనేది సర్వ సాధారణమైపోయింది. చేతులతో ఉతికే పని లేకుండా క్షణాల్లో బట్టలు శుభ్రం చేసుకోవడానికి ఇది ఎంతో సహాయ పడుతుంది. అయితే.. మెషీన్‌లో ఉతికిన తర్వాత కూడా కొన్నిసార్లు బట్టలపై తెల్లటి డిటర్జెంట్ మరకలు లేదా సబ్బు పౌడర్ అలాగే అతుక్కు పోయి కనిపిస్తుంటుంది. ఇది బట్టల రూపాన్ని చెడొగొట్టడమే కాకుండా.. చర్మంపై దురద వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. మార్కెట్‌లో లభించే మంచి లిక్విడ్ డిటర్జెంట్లు లేదా పౌడర్‌లను వాడినప్పటికీ ఈ సమస్య వస్తుందంటే.. మనం మెషీన్ ఆపరేట్ చేసే విధానంలోనే లోపం ఉందని అర్థం. ఈ సమస్యకు శాశ్వత చెక్ పెట్టడానికి.. మనం సాధారణంగా చేసే ఆ 4 పెద్ద పొరపాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. మెషీన్‌ను ఓవర్‌లోడ్ చేయడం :

చాలా మంది ఒకేసారి.. ఎక్కువ బట్టలు ఉతికేయాలనే ఉద్దేశంతో ..వాషింగ్ మెషీన్ సామర్థ్యానికి మించి బట్టలను కుక్కుతుంటారు. దీని వల్ల డ్రమ్ తిరిగేటప్పుడు నీరు , డిటర్జెంట్ అన్ని బట్టలకు సమానంగా అందవు. నీటి ప్రవాహం తక్కువగా ఉండటం వల్ల పౌడర్ పూర్తిగా కరిగిపోకుండా.. బట్టలపైనే అలాగే ఉండిపోతుంది. మెషీన్ కెపాసిటీని బట్టి ఎప్పుడూ 70 నుంచి 80 శాతం మాత్రమే బట్టలు వేయడం మంచిది.

2. తప్పు రకం డిటర్జెంట్ వాడటం:

Advertisement

మీరు సెమీ-ఆటోమేటిక్ లేదా టాప్-లోడ్ మెషీన్ వాడే పౌడర్‌ను ఫ్రంట్-లోడ్ మెషీన్‌లో వేసినా.. లేదా చేతులతో ఉతికే సబ్బు పొడిని మెషీన్‌లో వాడినా ఈ సమస్య కచ్చితంగా వస్తుంది. ఫ్రంట్-లోడ్ మెషీన్ల కోసం ప్రత్యేకంగా.. తక్కువ నురగ వచ్చే ‘ఫ్రంట్ లోడ్ లిక్విడ్ లేదా పౌడర్’ మాత్రమే వాడాలి. మార్కెట్లో లభించే మంచి బ్రాండెడ్ వాషింగ్ మెషీన్ లిక్విడ్ ధర సుమారు రూ. 250 నుంచి రూ.500 వరకు ఉంటుంది. ఇది బట్టల్లో ఈజీగా కరిగిపోయి ఎలాంటి మరకలను మిగల్చదు.

3. డిటర్జెంట్ నేరుగా బట్టలపై వేయడం:

కొంతమంది బట్టలను మెషీన్‌లో.. వేసిన వెంటనే, నేరుగా వాటిపైనే డిటర్జెంట్ పౌడర్ లేదా లిక్విడ్‌ను పోస్తుంటారు. ఇది చాలా పెద్ద పొరపాట్లు. ఇలా చేయడం వల్ల పౌడర్ ఒకే చోట ఉండి బట్టలకు మొండి మరకలుగా అతుక్కుపోతుంది. ఎప్పుడూ కూడా మెషీన్‌లో ఉండే ప్రత్యేకమైన డిటర్జెంట్ ట్రే లోనే పౌడర్ లేదా లిక్విడ్‌ను వేయాలి. దీని వల్ల నీటితో పాటు డిటర్జెంట్ కలిసి డ్రమ్‌లోకి సమానంగా వెళ్తుంది.

Advertisement

Also Read: సిలిండర్ మోయాల్సిన పనే లేదు..తడి క్లాత్‌తోనే ఎంత ఖాళీ ఉందో కనిపెట్టేయెచ్చు

4. వాషింగ్ మెషీన్‌ క్లీనింగ్:

మనం బట్టలు ఉతికే మెషీన్‌ను ఎప్పుడూ శుభ్రం చేయకపోతే.. అందులో మురికి, సబ్బు అవశేషాలు పేరుకుపోతాయి. తర్వాత సారి బట్టలు ఉతికేటప్పుడు ఆ పాత మురికి బట్టలపైకి చేరుకుంటుంది. నెలకొక్కసారైనా మెషీన్ డ్రమ్‌ను వేడి నీరు , వెనిగర్ లేదా ప్రత్యేకమైన వాషింగ్ మెషీన్ క్లీనర్ పౌడర్‌తో రన్ చేయాలి.

ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ వాషింగ్ మెషీన్ లైఫ్ పెరుగుతుంది. అంతే కాకుండా బట్టలపై ఎలాంటి డిటర్జెంట్ మరకలు పడకుండా సరి కొత్తగా మెరుస్తాయి. మీ బట్టలపై కూడా ఇలాంటి మరకలు వస్తున్నాయా? అయితే ఈరోజే ఈ టిప్స్ ట్రై చేయండి!

Related News

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

ఫోన్ వేడిగా ఉన్నప్పుడు పొరపాటున కూడా..ఈ పనులు చేయొద్దు!

20% – 80% రూల్ నిజంగానే ల్యాప్‌టాప్ బ్యాటరీని కాపాడుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..

ఒక ఇయర్‌బడ్‌లో సౌండ్ తక్కువగా వస్తోందా? కొత్తవి కొనే ముందు ఈ ట్రిక్ ట్రై చేయండి!

కొత్త మిడ్-రేంజ్ ఫోన్ బెస్ట్ ఆ? పాత ఫ్లాగ్‌షిప్ మొబైలా? ఏది కొనాలి?

అమెజాన్ సేల్ షాకింగ్ ఆఫర్..రూ.9 వేలకే బ్రాండెడ్ ట్రెడ్‌మిల్స్,మిస్ అయితే అంతే!

Big Stories

Advertisement
×