Earbud sound issue: ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కనిపిస్తున్నాయి. పాటలు విన్నా, కాల్స్ మాట్లాడినా ఇయర్‌బడ్స్ మన దైనందిన జీవితంలో భాగమైపోయాయి. అయితే.. కొన్ని రోజులు వాడిన తర్వాత, అకస్మాత్తుగా ఒక ఇయర్ బడ్‌లో సౌండ్ చాలా తక్కువగా రావడం లేదా పూర్తిగా సౌండ్ తగ్గిపోవడం జరుగుతుంది. ఇది చాలా చిరాకు తెప్పిస్తుంది. వెంటనే కొత్త ఇయర్ బడ్స్ కొనేయాలని ఆలోచిస్తుంటారు. కానీ మీ విలువైన డబ్బును (సుమారు రూ. 1,500 నుంచి రూ.5,000 వరకు) కొత్త వాటి కోసం ఖర్చు పెట్టే ముందు.. ఈ సింపుల్ ట్రూబుల్‌షూటింగ్ టిప్స్ ప్రయత్నిస్తే మీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది.
సౌండ్ తగ్గిపోవడానికి 90% ప్రధాన కారణం చెవిలోని గుజ్జు లేదా ధూళి ఇయర్ బడ్ మెష్‌లో ఇరుక్కుపోవడమే. ఇయర్‌బడ్ పైన ఉండే సిలికాన్ టిప్‌ను తొలగించండి. తర్వాత ఒక సాఫ్ట్ టూత్‌బ్రెస్ట్ లేదా కాటన్ బడ్ తీసుకుని మెష్‌ను మెల్లగా శుభ్రం చేయండి. కొద్దిగా ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ ఉపయోగించి శుభ్రం చేస్తే మురికి పూర్తిగా తొలగిపోతుంది. ఇందుకుయ్యే.. ఖర్చు సుమారు రూ. 50 నుంచి రూ. 100 మాత్రమే. దీని వల్ల అసలు సౌండ్ మళ్లీ వస్తుంది.
2. బ్లూటూత్ రీసెట్ , పేరింగ్ :
కొన్నిసార్లు హార్డ్ వేర్ సమస్య కాకుండా.. సాఫ్ట్ వేర్ గ్లిచ్ వల్ల వాల్యూమ్ తగ్గి పోతుంది. మీ ఫోన్ బ్లూ టూత్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆ ఇయర్‌బడ్‌ను ‘Unpair’ లేదా ‘Forget This Device’ చేయండి. ఆ తర్వాత ఇయర్ బడ్స్‌ను ఛార్జింగ్ కేస్‌లో పెట్టి రీసెట్ బటన్‌ను కొన్ని సెకన్ల పాటు హోల్డ్ చేయండి. మళ్లీ ఫోన్‌తో పేరింగ్ చేస్తే ఆటోమేటిక్‌గా వాల్యూమ్ సమస్య పరిష్కారమవుతుంది.
కొన్నిసార్లు మన ఫోన్ సెట్టింగ్స్ వల్ల కూడా ఒక వైపే సౌండ్ తక్కువగా రావచ్చు. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ సెట్టింగ్స్‌లో ‘Accessibility’ లేదా ‘Audio Balance’ సెక్షన్‌కు వెళ్లండి. లెఫ్ట్, రైట్ ఆడియో స్లైడర్ మధ్యలో.. ఉందో లేదో చెక్ చేయండి.ఒక వైపుకు జరిగి ఉంటే దానిని సరిచేయండి.
Also Read: అమెజాన్ సేల్ షాకింగ్ ఆఫర్..రూ.9 వేలకే బ్రాండెడ్ ట్రెడ్‌మిల్స్,మిస్ అయితే అంతే!
కొన్ని ఇయర్ బడ్స్‌కు ప్రత్యేకమైన టచ్ కంట్రోల్స్ ఉంటాయి. తెలియకుండానే.. ఒక ఇయర్ బడ్స్ పై వేలు పడి వాల్యూమ్ తగ్గిపోయి ఉండొచ్చు. ఇయర్ బడ్ టచ్ ప్యానెల్ ద్వారా వాల్యూమ్ పెంచడానికి ప్రయత్నించండి. అలాగే స్పాటిఫై, యూట్యూబ్ లేదా మ్యూజిక్ యాప్స్‌లో వాల్యూమ్ లెవల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి.
పైన పేర్కొన్న అన్ని పద్ధతులను ప్రయత్నించినప్పటికీ సౌండ్ పెరగకపోతే.. ఇయర్ బడ్ స్పీకర్ డ్రైవర్ పాడైపోయిందని లేదా లోపల వైరింగ్ దెబ్బతిందని అర్థం. అప్పుడు మాత్రమే మీరు కొత్త ఇయర్ బడ్స్ కొనడానికి ప్లాన్ చేయెచ్చు. మార్కెట్లో బ్రాండెడ్ ఇయర్‌బడ్స్ ధరలు రూ.1,200 నుంచి ప్రారంభమవుతాయి.