E-Paper
Advertisement

20% – 80% రూల్ నిజంగానే ల్యాప్‌టాప్ బ్యాటరీని కాపాడుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..

20% – 80% రూల్ నిజంగానే ల్యాప్‌టాప్ బ్యాటరీని కాపాడుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..
Advertisement

Laptop Charging Tips: కొత్త ల్యాప్‌టాప్ బాక్స్ ఓపెన్ చేయగానే చాలామందికి వచ్చే మొదటి సందేహం.. దీనిని వాడేముందు ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి? గంటల తరబడి ఛార్జర్‌కు కనెక్ట్ చేసి ఉంచాలా లేక బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయ్యే వరకు వాడాలా? అని చాలా ఆలోచనలు వస్తుంటాయి. అయితే పాతకాలపు ఫోన్లు, కంప్యూటర్లలో వాడిన బ్యాటరీలకు ‘మెమరీ ఎఫెక్ట్’ ఉండేది. దానివల్ల వాటిని మొదట్లోనే ఎక్కువసేపు ఛార్జ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పటి ఆధునిక ల్యాప్‌టాప్‌లలో వాడే లిథియం-అయాన్, లిథియం-పాలిమర్ బ్యాటరీలకు అలాంటి పాత నిబంధనలేవీ వర్తించవు. కాబట్టి.. కొత్త ల్యాప్‌టాప్ కొన్న వెంటనే గంటల తరబడి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు.

మొదటి ఛార్జింగ్ అవసరమా?

కొత్త ల్యాప్‌టాప్‌ను అన్‌బాక్స్ చేశాక నేరుగా వాడుకోవచ్చు. అయితే మొదటిసారి సెటప్ చేసుకునే సమయంలో ఛార్జర్‌ను కనెక్ట్ చేసి ఉంచడం మంచి పద్ధతి. ఎందుకంటే.. దుకాణాల్లో లేదా గోడౌన్లలో ల్యాప్‌టాప్ చాలా రోజులు స్టాక్ ఉండిపోవడం వల్ల బ్యాటరీ ఛార్జ్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. సెటప్ జరుగుతున్న సమయంలో డివైజ్ ఆకస్మికంగా ఆఫ్ కాకుండా ఉండటానికి ఛార్జింగ్ పెట్టి వాడటం సురక్షితం.

Advertisement

Also Read: బ్యాటరీ కింగ్ Vivo Y21 5Gపై ఏకంగా 25,500 తగ్గింపు.. కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి!

ల్యాప్‌టాప్ సెటప్ సమయం..

ల్యాప్‌టాప్ ఆన్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రాథమికంగా సెటప్ చేయడానికి అరగంట కంటే తక్కువ సమయమే పడుతుంది. అయితే పాత కంప్యూటర్ నుంచి మీ డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం, కావాల్సిన కొత్త సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేయడం, సిస్టమ్ అప్‌డేట్స్ పూర్తి చేయడం లాంటివి ఉంటే.. మరికొంత సమయం పడుతుంది. ఇవన్నీ పూర్తి చేసుకుని ల్యాప్‌టాప్‌ను పూర్తిగా సిద్ధం చేసుకోవడానికి మొత్తంమీద రెండు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.

ప్లగ్ ఆన్‌లోనే ఉంచాలా?

Advertisement

ఇప్పటి ల్యాప్‌టాప్‌లలో ‘బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ అనే ప్రత్యేక టెక్నాలజీ ఉంటుంది. బ్యాటరీ 100 శాతానికి చేరగానే ఇది ఛార్జింగ్‌ను ఆటోమేటిక్‌గా నిలిపివేసి, ల్యాప్‌టాప్‌ను నేరుగా పవర్ అడాప్టర్ విద్యుత్‌తో నడిపిస్తుంది. కాబట్టి.. ఛార్జర్ ఎప్పుడూ ప్లగ్ చేసి ఉంచినా బ్యాటరీ ఓవర్‌చార్జ్ అవ్వడం కానీ, ఓవర్‌హీట్ అయి పాడైపోవడం కానీ జరగదు.

బ్యాటరీ లైఫ్ పెంచే చిట్కా..

ఛార్జింగ్ ఆటోమేటిక్‌గా ఆగిపోయినప్పటికీ.. ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ 100 శాతం ఛార్జింగ్‌తోనే ఉంచడం బ్యాటరీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇది బ్యాటరీపై అనవసర ఒత్తిడిని పెంచి దాని జీవితకాలాన్ని తగ్గిస్తుంది. అలాగే బ్యాటరీని ఎప్పుడూ 0 శాతానికి పడిపోనివ్వకూడదు. ల్యాప్‌టాప్ బ్యాటరీ ఎల్లప్పుడూ 20 నుంచి 80 శాతాల మధ్య ఉండేలా చూసుకోవడమే అత్యుత్తమమైన పద్ధతి.

Also Read: సేల్ మొదలవకముందే అమెజాన్ బంపర్ ఆఫర్లు.. ఇంత తక్కువ ధరకు ఇలాంటి ఫోన్లు, టీవీలా?

Tags

Related News

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

వాషింగ్ మెషీన్ వాడుతున్నారా? మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే!

ఫోన్ వేడిగా ఉన్నప్పుడు పొరపాటున కూడా..ఈ పనులు చేయొద్దు!

ఒక ఇయర్‌బడ్‌లో సౌండ్ తక్కువగా వస్తోందా? కొత్తవి కొనే ముందు ఈ ట్రిక్ ట్రై చేయండి!

కొత్త మిడ్-రేంజ్ ఫోన్ బెస్ట్ ఆ? పాత ఫ్లాగ్‌షిప్ మొబైలా? ఏది కొనాలి?

అమెజాన్ సేల్ షాకింగ్ ఆఫర్..రూ.9 వేలకే బ్రాండెడ్ ట్రెడ్‌మిల్స్,మిస్ అయితే అంతే!

స్నాప్‌డ్రాగన్ X2 ప్లస్‌తో Microsoft Surface.. 22.5 గంటల బ్యాటరీ, ధరెంతో తెలిస్తే?

Big Stories

Advertisement
×