E-Paper
Advertisement

కొత్త మిడ్-రేంజ్ ఫోన్ బెస్ట్ ఆ? పాత ఫ్లాగ్‌షిప్ మొబైలా? ఏది కొనాలి?

కొత్త మిడ్-రేంజ్ ఫోన్ బెస్ట్ ఆ? పాత ఫ్లాగ్‌షిప్ మొబైలా? ఏది కొనాలి?
Advertisement

New phone vs old flagship: ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజురోజుకూ పరుగులు పెడుతోంది. ప్రతి నెలా కొత్త మోడల్స్ క్యూ కడుతుంటాయి. ఈ క్రమంలో ఫోన్ మార్చాలని.. ఆలోచించినప్పుడు చాలా మంది ముందుకొచ్చే సందిగ్ధం..”కొత్త మిడ్-రేంజ్ ఫోన్ కొనాలా? లేక ఒకట్రెండు సంవత్సరాల క్రితం వచ్చిన పాత ఫ్లాగ్‌షిప్ ఫోన్ తీసుకోవాలా?” అనేది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు, వాటి ధరలు, ఏది కొంటే బెటర్ అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఏ ఫోన్ కొంటే బెటర్ ?

1. పెర్ఫార్మెన్స్, ప్రాసెసర్:

పాత ఫ్లాగ్‌షిప్ ఫోన్లు (ఉదాహరణకు శామ్‌సంగ్ ఎస్ సిరీస్ లేదా ఐఫోన్ ప్రీవియస్ మోడల్స్) ఆ కాలంలోని బెస్ట్ చిప్‌సెట్లతో వస్తాయి. అవి కేవలం హై-ఎండ్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసమే డిజైన్ చేయబడి ఉంటాయి. వీటితో.. పోలిస్తే కొత్త మిడ్-రేంజ్ ఫోన్లు (ధర రూ. 25,000 నుంచి రూ. 40,000 మధ్య) బాగున్నప్పటికీ, ఫ్లాగ్‌షిప్ స్థాయి పవర్ ఇవ్వలేవు. అయితే.. రోజువారీ అవసరాలకు కొత్త మిడ్-రేంజ్ ఫోన్లు కూడా అద్భుతంగా పని చేస్తాయి.

2. కెమెరా క్వాలిటీ :

Advertisement

కెమెరా విషయంలో.. పాత ఫ్లాగ్‌ షిప్ ఫోన్లదే పైచేయి అని చెప్పొచ్చు. వీటిలో ఉండే హై-ఎండ్ సెన్సర్లు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ , అడ్వాన్స్డ్ టెలిఫోటో లెన్స్‌లు కొత్త మిడ్-రేంజ్ ఫోన్ల కంటే బెస్ట్ ఫోటోలను అందిస్తాయి. మీరు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ లేదా వీడియోలు ఇష్టపడేవారైతే పాత ఫ్లాగ్‌షిప్ బెస్ట్ ఛాయిస్.

3. ధర, వ్యాల్యూ ఫర్ మనీ:

ధరల పరంగా చూస్తే.. రెండింటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. కొత్త మిడ్-రేంజ్ ఫోన్లు: సాధారణంగా రూ. 20,000 నుంచి రూ.35,000 ధరల శ్రేణిలో లభిస్తాయి.ఉదాహరణకు, బ్రాండ్ కొత్త ఫీచర్లతో.. వచ్చే లేటెస్ట్ మిడ్-రేంజ్ ఫోన్ ధర సుమారు రూ.27,999 వరకు ఉంటుంది.

Advertisement

పాత ఫ్లాగ్‌షిప్ ఫోన్లు: మార్కెట్లోకి కొత్త మోడల్స్ రాగానే.. పాత ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ధరలు భారీగా తగ్గుతాయి లేదా డిస్కౌంట్లు లభిస్తాయి. గతంలో రూ.80,000 పైగా ఉన్న ప్రీమియం ఫోన్,ఇప్పుడు సేల్స్‌లో లేదా రెండేళ్ల తర్వాత సుమారు రూ. 39,999 నుంచి రూ 49,999 మధ్య లభించే అవకాశం ఉంది.

4. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, బ్యాటరీ :

మీరు కొత్త ఫోన్ కొంటే.. కంపెనీలు కనీసం 3 నుంచి 5 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్‌లు అందిస్తాయి. కానీ.. పాత ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయితే ఆల్రెడీ ఒకటి లేదా రెండు సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి కాబట్టి, భవిష్యత్తులో అందే అప్‌డేట్స్ తగ్గిపోతాయి. అలాగే.. పాత ఫోన్లలో బ్యాటరీ లైఫ్ కొంత మేర తగ్గిపోయే ప్రమాం ఉంటుంది.కొత్త ఫోన్‌లో మాత్రం సరికొత్త బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.

Also Read: అమెజాన్ సేల్ షాకింగ్ ఆఫర్..రూ.9 వేలకే బ్రాండెడ్ ట్రెడ్‌మిల్స్,మిస్ అయితే అంతే!

ఏది  కొనాలి ?

కొత్త ఫోన్ ఎప్పుడు కొనాలి?: మీకు లాంగ్ లాస్టింగ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కావాలన్నా.. లేటెస్ట్ డిజైన్, మెరుగైన బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్ కావాలన్నా బ్రాండ్.. న్యూ మిడ్-రేంజ్ ఫోన్ కొనడం బెస్ట్.

పాత ఫ్లాగ్‌షిప్ ఎప్పుడు కొనాలి?: మీకు బడ్జెట్‌లో.. బెస్ట్ కెమెరా, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ (మెటల్, గ్లాస్ ఫినిషింగ్), టాప్-నాచ్ ప్రాసెసింగ్ స్పీడ్ కావాలనుకుంటే.. కాస్త తగ్గిన ధరలో లభించే పాత ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను ఎంచుకోవచ్చు.

Related News

ఒక ఇయర్‌బడ్‌లో సౌండ్ తక్కువగా వస్తోందా? కొత్తవి కొనే ముందు ఈ ట్రిక్ ట్రై చేయండి!

అమెజాన్ సేల్ షాకింగ్ ఆఫర్..రూ.9 వేలకే బ్రాండెడ్ ట్రెడ్‌మిల్స్,మిస్ అయితే అంతే!

స్నాప్‌డ్రాగన్ X2 ప్లస్‌తో Microsoft Surface.. 22.5 గంటల బ్యాటరీ, ధరెంతో తెలిస్తే?

రిలయన్స్ డిజిటల్ సంచలనం.. iPhone 17 Proపై ఏకంగా రూ.77,000 తగ్గింపు!

బ్యాటరీ కింగ్ Vivo Y21 5Gపై ఏకంగా 25,500 తగ్గింపు.. కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి!

సేవింగ్స్ పెంచుకోవడంలో..ఫిక్స్‌డ్ డిపాజిట్,మ్యూచువల్ ఫండ్స్‌లో ఏది బెస్ట్?

సిలిండర్ మోయాల్సిన పనే లేదు..తడి క్లాత్‌తోనే ఎంత ఖాళీ ఉందో కనిపెట్టేయెచ్చు

Big Stories

Advertisement
×