E-Paper
Advertisement

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !
Advertisement

Black vs blue solar panels: ప్రస్తుత కాలంలో సోలార్ శక్తి వాడకం విపరీతంగా పెరిగిపోయింది.ప్రభుత్వం కూడా సోలార్ రూఫ్‌టాప్ పథకాల ద్వారా రాయితీలు ఇస్తుండటంతో సామాన్యులు సైతం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే మార్కెట్‌లోకి వెళ్లినప్పుడు సోలార్ ప్యానెల్స్ నలుపు రంగులో ఒకటి, నీలం రంగులో మరొకటి కనిపిస్తాయి. వీటి రంగులు మారడానికి కారణం వాటి తయారీ విధానం. వీటి సాంకేతిక పేర్లు మోనోక్రిస్టలైన్ (Monocrystalline – నలుపు రంగు), పాలీక్రిస్టలైన్ (Polycrystalline – నీలం రంగు). ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

1. తయారీ విధానం,రంగు :

బ్లూ సోలార్ ప్యానెల్స్: వీటిని సిలికాన్ స్పటికాలను కరిగించి తయారు చేస్తారు. దీని వల్ల కాంతి పడినప్పుడు ఇవి నీలం రంగులో మెరుస్తాయి.

Advertisement

బ్లాక్ సోలార్ ప్యానెల్స్ (మోనోక్రిస్టలైన్): వీటిని సిలికాన్ యొక్క ఒకే స్వచ్ఛమైన స్పటికంతో తయారు చేస్తారు. అందుకే ఇవి పూర్తి నలుపు రంగులో లేదా ముదురు రంగులో కనిపిస్తాయి.

2. సామర్థ్యం, పనితీరు:

బ్లాక్ ప్యానెల్స్: స్వచ్ఛమైన సిలికాన్‌తో తయారవుతాయి కాబట్టి వీటి సామర్థ్యం చాలా ఎక్కువ. సూర్యకాంతి తక్కువగా ఉన్నప్పుడు (మేఘావృతమైన వాతావరణంలో) లేదా ఉదయం, సాయంత్రం వేళల్లో కూడా ఇవి చక్కగా కరెంట్ ను ఉత్పత్తి చేస్తాయి.

Advertisement

బ్లూ ప్యానెల్స్: వీటి సామర్థ్యం మోనోక్రిస్టలైన్ ప్యానెళ్లతో పోలిస్తే కొంత తక్కువగా ఉంటుంది. కేవలం ఎండ ఎక్కువగా ఉన్న సమయంలోనే ఇవి ఎక్కువ ఉత్పత్తిని ఇస్తాయి.

3. ధరల మధ్య తేడా:

మార్కెట్లో సాధారణంగా ఒక ప్రామాణికమైన 1 కిలోవాట్ (kW) సోలార్ సిస్టమ్ ధరలు చూస్తే..

పాలీక్రిస్టలైన్ (నీలం రంగు) ప్యానెల్స్: ఇవి బడ్జెట్ ధరలో లభిస్తాయి. 1 kW సిస్టమ్ ధర సుమారు రూ.45,000 నుంచి రూ.55,000 వరకు ఉంటుంది.

మోనోక్రిస్టలైన్ (నలుపు రంగు) ప్యానెల్స్: టెక్నాలజీ అడ్వాన్స్‌డ్‌గా ఉండటం వల్ల ఇవి కాస్త ఖరీదు ఎక్కువ. 1 kW సిస్టమ్ ధర సుమారు రూ. 55,000 నుంచి రూ.70,000 వరకు ఉంటుంది. (ప్రభుత్వ సబ్సిడీని బట్టి ధరల్లో మార్పులు ఉండొచ్చు).

Also Read: ఫోన్ వేడిగా ఉన్నప్పుడు పొరపాటున కూడా..ఈ పనులు చేయొద్దు!

4. స్థలం, మన్నిక:

మీ ఇంటిపై తక్కువ స్థలం ఉండి, ఎక్కువ పవర్ కావాలనుకుంటే నలుపు రంగు (మోనో క్రిస్టలైన్) ప్యానెల్స్ బెస్ట్. తక్కువ స్థలంలోనే ఎక్కువ వాట్ సామర్థ్యాన్ని అందిస్తాయి.

మీ ఇల్లు పెద్దదిగా ఉండి.. స్థలానికి ఎలాంటి ఇబ్బంది లేకపోతే తక్కువ బడ్జెట్‌లో నీలం రంగు (పాలీ క్రిస్టలైన్) ప్యానెల్స్ వేసుకోవచ్చు. ఇవి దాదాపు 25 సంవత్సరాల వరకు పాడవకుండా ఉంటాయి.

ఏది కొనడం మంచిది?:

మీ బడ్జెట్ తక్కువగా ఉండి, ఎక్కువ స్థలం అందుబాటులో.. ఉంటే నీలం రంగు (పాలీ క్రిస్టలైన్) ప్యానెల్స్ ఎంచుకోవచ్చు. అలా.. కాకుండా ఎక్కువ లాభం, అత్యధిక ఎఫిషియెన్సీ , తక్కువ స్థలంలో ఎక్కువ కరెంట్ కావాలనుకుంటే.. కాస్త ఎక్కువ ఖర్చు పెట్టి నలుపు రంగు (మోనో క్రిస్టలైన్) సోలార్ ప్యానెల్స్ కొనడం బెస్ట్.

Related News

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

వాషింగ్ మెషీన్ వాడుతున్నారా? మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే!

ఫోన్ వేడిగా ఉన్నప్పుడు పొరపాటున కూడా..ఈ పనులు చేయొద్దు!

20% – 80% రూల్ నిజంగానే ల్యాప్‌టాప్ బ్యాటరీని కాపాడుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..

ఒక ఇయర్‌బడ్‌లో సౌండ్ తక్కువగా వస్తోందా? కొత్తవి కొనే ముందు ఈ ట్రిక్ ట్రై చేయండి!

కొత్త మిడ్-రేంజ్ ఫోన్ బెస్ట్ ఆ? పాత ఫ్లాగ్‌షిప్ మొబైలా? ఏది కొనాలి?

అమెజాన్ సేల్ షాకింగ్ ఆఫర్..రూ.9 వేలకే బ్రాండెడ్ ట్రెడ్‌మిల్స్,మిస్ అయితే అంతే!

Big Stories

Advertisement
×