E-Paper
Advertisement

సిలిండర్ మోయాల్సిన పనే లేదు..తడి క్లాత్‌తోనే ఎంత ఖాళీ ఉందో కనిపెట్టేయెచ్చు

సిలిండర్ మోయాల్సిన పనే లేదు..తడి క్లాత్‌తోనే ఎంత ఖాళీ ఉందో కనిపెట్టేయెచ్చు
Advertisement

Lpg cylinder gas level trick: ప్రతి మిడిల్ క్లాస్ వంట గదిలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ అనేది అత్యంత కీలకమైన భాగం. ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ. 950 నుంచి రూ. 1,000 వరకు ఉంది. ఇంత ఖరీదైన గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. అర్ధ రాత్రి పూట కూర వండేటప్పుడు సడన్‌గా గ్యాస్ స్టవ్ ఆగిపోతే కలిగే చిరాకు అంతా ఇంతా కాదు. సిలిండర్ బరువు చూద్దామంటే.. అది దాదాపు 30 కిలోల బరువుంటుంది కాబట్టి దాన్ని ఎత్తడం అందరికీ సాధ్యం కాదు. మరి సిలిండర్‌ను కదపకుండా.. బరువు చూడకుండా దాంట్లో గ్యాస్ ఎంత ఉందో ఎలా తెలుసుకోవాలి? సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న ఆ సూపర్ మ్యాజికల్ చిట్కా గురించి ఇప్పుడు చూద్దాం.

తడి క్లాత్ మ్యాజిక్:

ఈ అద్భుతమైన ట్రిక్ కోసం మీకు కావాల్సిందల్లా కేవలం ఒక సాధారణ తడి క్లాత్ మాత్రమే! దీనిని ఉపయోగించి నిమిషంలోపు మీ సిలిండర్‌లో గ్యాస్ ఏ లెవెల్ వరకు ఉందో ఇట్టే కనిపెట్టవచ్చు.

వాడాల్సిన విధానం:

Advertisement

ముందుగా ఒక కాటన్ క్లాత్ నీటిలో బాగా తడిపి, నీటిని పిండేయాలి. ఆ తర్వాత ఆ తడి గుడ్డను మీ గ్యాస్ సిలిండర్ చుట్టూ పైనుండి క్రిందికి నిలువుగా లేదా రౌండ్‌గా తుడవండి. సిలిండర్ పైన అంతా తడిగా మారుతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్‌ను గమనించండి. సిలిండర్ పైభాగం వేగంగా ఆరి పోవడం మీకు కనిపిస్తుంది. కానీ గ్యాస్ ఎంతవరకు నిండుగా ఉందో.. ఆ కింది భాగం మాత్రం కాస్త తడిగా లేదా నెమ్మదిగా ఆరుతుంది.

దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి?

ఇందులో ఎలాంటి మ్యాజిక్ లేదు, పూర్తిగా సైన్స్ దాగి ఉంది. సిలిండర్ లోపల ఏ భాగంలో అయితే లిక్విడ్ రూపంలో గ్యాస్ ఉంటుందో.. ఆ భాగం చల్లగా ఉంటుంది. ఎందుకంటే ద్రవ రూపంలో ఉన్న గ్యాస్ చుట్టూ ఉండే ఉష్ణోగ్రతను పీల్చుకుంటుంది. సిలిండర్ ఖాళీగా ఉన్న పైభాగం త్వరగా వేడెక్కి తడి ఆరిపోతుంది. అదే గ్యాస్ ఉన్న కింది భాగం చల్లగా ఉండటం వల్ల తడి ఆరడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసమే మనకు గ్యాస్ లెవెల్ ఎంత ఉందనేది స్పష్టంగా చూపిస్తుంది.

Advertisement

Also Read: ఫోన్ ఛార్జర్లు వేడెక్కడం సాధారణమేనా? ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

మరో పద్ధతి:

మీరు తడి క్లాత్ ట్రిక్ కాకుండా మరో పద్ధతి కూడా ట్రై చేయెచ్చు. కొద్దిగా గోరు వెచ్చని నీటిని తీసుకుని.. సిలిండర్ పక్క భాగాలపై పోయాలి. ఆ తర్వాత కొద్ది సేపు ఆగి మీ చేతితో సిలిండర్ గోడలను తాకి చూడండి. గ్యాస్ లేని పై భాగం వేడిగా అనిపిస్తుంది. గ్యాస్ ఉన్న కింది భాగం మాత్రం చల్లగా తగులుతుంది. దీని వల్ల కూడా గ్యాస్ ఖాళీ అవుతున్న విషయాన్ని ముందే ప్లాన్ చేసుకోవచ్చు.

గ్యాస్ సిలిండర్ సడన్‌గా అయిపోయి ఇబ్బంది పడే.. రోజులు పోయాయి. ఈ చిన్న ట్రిక్‌తో మీ స్మార్ట్ కిచెన్‌లో ఎప్పుడెప్పుడు గ్యాస్ అయిపోతుందో .. ముందే ప్లాన్ చేసుకుని కొత్త సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు.

Related News

రిలయన్స్ డిజిటల్ సంచలనం.. iPhone 17 Proపై ఏకంగా రూ.77,000 తగ్గింపు!

బ్యాటరీ కింగ్ Vivo Y21 5Gపై ఏకంగా 25,500 తగ్గింపు.. కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి!

సేవింగ్స్ పెంచుకోవడంలో..ఫిక్స్‌డ్ డిపాజిట్,మ్యూచువల్ ఫండ్స్‌లో ఏది బెస్ట్?

మిక్సీ కాలిపోయిన వాసన వస్తుందా? మీరు వెంటనే చేయాల్సిన పని ఇదే!

ఫోన్ ఛార్జర్లు వేడెక్కడం సాధారణమేనా? ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

20 ఏళ్ల ఐఫోన్ జర్నీకి గ్రాండ్ ట్రీట్.. iPhone 20లో ఈ మార్పులు చూస్తే పిచ్చెక్కిపోతారండి బాబూ!

YouTubeలో ఇలాంటి ఫీచర్లు వస్తాయని కలలో కూడా ఊహించలేరు.. యూజర్లు, క్రియేటర్లు జాక్‌పాట్ కొట్టినట్టే!

Big Stories

Advertisement
×