E-Paper
Advertisement

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?
Advertisement

Portronics AuraTrio: ప్రముఖ ఆడియో, డిజిటల్ యాక్సెసరీస్ బ్రాండ్ పోర్ట్రానిక్స్ భారత మార్కెట్లోకి ఒక కొత్త రకం బ్లూటూత్ స్పీకర్‌ను తీసుకొచ్చింది. దీని పేరు ‘ఆరాట్రియో’. సాధారణంగా మనం ఇంట్లో వాడే బ్లూటూత్ స్పీకర్లు ఒకే యూనిట్‌గా ఉంటాయి. కానీ ఈ స్పీకర్ డిజైన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది ఒక మొడ్యులర్ స్పీకర్ సిస్టమ్. అంటే ఒకే స్పీకర్‌ను మూడు భాగాలుగా విడదీసి వాడుకోవచ్చు. కొత్త రకం ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారి కోసం కంపెనీ దీనిని డిజైన్ చేసింది.

డిజైన్, సౌండ్ అవుట్‌పుట్:

ఆరాట్రియో సిస్టమ్‌లో మెయిన్ స్పీకర్‌తో పాటు రెండు చిన్న శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి. ఇవి మెయిన్ స్పీకర్‌కు రెండు వైపులా మ్యాగ్నెటిక్ పద్ధతిలో అతుక్కుని ఉంటాయి. కలసి ఉన్నప్పుడు ఇది 90 వాట్ల సౌండ్ అవుట్‌పుట్ ఇస్తుంది. విడదీసినప్పుడు మెయిన్ స్పీకర్ 60 వాట్లు, శాటిలైట్లు ఒక్కొక్కటి 15 వాట్ల చొప్పున సౌండ్ ఇస్తాయి. ఇంట్లో చిన్న పార్టీలు ఉన్నప్పుడు శాటిలైట్లను విడదీసి గదిలో వేర్వేరు మూలల్లో పెట్టుకోవచ్చు. బ్లాక్ టెక్స్చర్డ్ ఫ్యాబ్రిక్ ఫినిషింగ్‌తో వచ్చే ఈ స్పీకర్‌కు పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉంది.

కనెక్టివిటీ, బ్యాటరీ లైఫ్:

Advertisement

మూడు స్పీకర్లు విడిపోయినా ఒకేసారి పాటలు ప్లే అవ్వడానికి బ్లూటూత్ 5.4, ఆరాకాస్ట్ టెక్నాలజీని ఉపయోగించారు. ఎలాంటి యాప్ అవసరం లేకుండానే శాటిలైట్ స్పీకర్లు మెయిన్ యూనిట్‌తో కనెక్ట్ అవుతాయి. వీటిని విడివిడిగా కూడా వాడుకోవచ్చు. మెయిన్ స్పీకర్‌లో 4,500mah బ్యాటరీ, శాటిలైట్లలో చెరో 2,000mah బ్యాటరీ ఉంటుంది. సింగిల్ ఛార్జ్‌పై ఇది దాదాపు 6 గంటల ప్లేబ్యాక్ టైమ్ ఇస్తుంది. ఐపిఎక్స్6 వాటర్ రెసిస్టెన్స్ వల్ల వర్షం పడినా, నీటి చినుకులు పడినా ఏమీ కాదు.

ధర ఎంతంటే?

పోర్ట్రానిక్స్ ఆరాట్రియో అసలు ధర రూ.24,999 కాగా.. ప్రస్తుతం ఆఫర్‌లో భాగంగా రూ.14,999 ప్రత్యేక ధరకు లభిస్తోంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో ఇది అందుబాటులో ఉంది. దీనికి ఏడాది వారంటీ కూడా ఇస్తున్నారు. కొత్తదనంతో పాటు మంచి సౌండ్ క్వాలిటీ కోరుకునే ఆడియో ప్రేమికులకు ఈ మోడ్యులర్ స్పీకర్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

Tags

Related News

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

మీ ఛార్జింగ్ కేబుల్ తరచూ పాడవుతోందా?ఈ చిన్న మిస్టేక్స్ వెంటనే సరిదిద్దుకోండి!

బట్టలు ఉతకడమే కాదు.. 49% వేగంగా ఆరబెడుతుంది కూడా.. షియోమీ కొత్త వాషింగ్ మ్యాజిక్ ఇదే!

పార్శిల్ బాక్సులు చెత్తలో పడేస్తున్నారా?దొంగ చేతికి తాళాలిస్తున్నట్లే జాగ్రత్త!

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆడియోను.. ఫోన్ రింగ్‌టోన్‌గా సెట్ చేయండిలా!

రీఛార్జ్ ధరల విషయంలో TRAI కీలక నిర్ణయం.. డేటా వద్దంటే ఇక ఈ ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు!

Big Stories

Advertisement
×