E-Paper
Advertisement

ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు డిలీట్ అయ్యాయా? టెన్షన్ వద్దు మామ.. ఇలా చేస్తే చిటికెలో రికవర్!

ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు డిలీట్ అయ్యాయా? టెన్షన్ వద్దు మామ.. ఇలా చేస్తే చిటికెలో రికవర్!
Advertisement

Photo Recovery: స్మార్ట్‌ఫోన్ వాడుతున్నప్పుడు ఒక్కొసారి పొరపాటున నచ్చిన ఫోటోలు, ముఖ్యమైన వీడియోలు డిలీట్ అయిపోవడం చాలామందికి ఎదురయ్యే సమస్యే. అయితే కొందరు కంగారుపడి ఏవేవో థర్డ్ పార్టీ యాప్స్ వాడి ఫోన్‌ను మరింత ఇబ్బందుల్లో పడేస్తుంటారు. కానీ ఎలాంటి డేటా నష్టం లేకుండా డిలీట్ అయిన జ్ఞాపకాలను సురక్షితంగా ఎలా తిరిగి తెచ్చుకోవాలో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

‘ట్రాష్’ లేదా ‘బిన్’ ఫోల్డర్ చెకింగ్

ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ వాడుతున్నట్లైతే.. ఫోటోలు డిలీట్ అయిన వెంటనే అవి పూర్తిగా మాయమవవు. అవి ఫోన్ గ్యాలరీలోని ‘ట్రాష్’ లేదా ‘రీసెంట్లీ డిలీటెడ్’ ఫోల్డర్‌లోకి వెళ్తాయి. కాబట్టి ఐఫోన్ వినియోగదారులు.. గ్యాలరీలోని ‘ఆల్బమ్స్’ లోకి వెళ్లి కింద ఉండే ‘రీసెంట్లీ డిలీటెడ్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి వాటిని రీస్టోర్ చేసుకోవచ్చు. అలాకాకుండా ఆండ్రాయిడ్ యూజర్లు అయితే గ్యాలరీ సెట్టింగ్స్‌లో లేదా కింద కనిపించే ‘ట్రాష్/బిన్’ ఆప్షన్‌ ద్వారా డిలీట్ అయిన ఫోటోలను తిరిగి పొందవచ్చు.

క్లౌడ్ స్టోరేజ్ బ్యాకప్ తనిఖీ

Advertisement

ఒకవేళ గ్యాలరీ బిన్‌లో కూడా ఫోటోలు లేకపోతే ఫోన్ బ్యాకప్ ఆప్షన్లను ఒకసారి చెక్ చేయండి. చాలామంది ఫోన్లలో గూగుల్ ఫోటోస్ (Google Photos) లేదా ఐక్లౌడ్ (iCloud) ఆటో-బ్యాకప్ ఆన్ చేసి పెడుతుంటారు. తొలుత గూగుల్ ఫోటోస్ యాప్ ఓపెన్ చేసి ‘లైబ్రరీ’ లోకి వెళ్లి ‘బిన్’ లేదా ‘ట్రాష్’ చెక్ చేయండి. ఒకవేళ మెయిన్ గ్యాలరీ నుండి డిలీట్ అయినా అక్కడ క్లౌడ్‌లో అవి సేవ్ అయి ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఐక్లౌడ్ వాడుతుంటే.. కంప్యూటర్ లేదా వేరే డివైజ్ ద్వారా iCloud.comకి లాగిన్ అయి కూడా డిలీట్ అయిన డేటాను రికవర్ చేసుకోవచ్చు.

వాట్సాప్, సోషల్ మీడియా చాట్స్

డిలీట్ చేసిన ఫోటోలు లేదా వీడియోలు ఎవరికైనా వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో పంపించి ఉంటే వాటిని చాలా సులభంగా తిరిగి పొందొచ్చు. సదరు చాట్ హిస్టరీ ఓపెన్ చేసి ‘మీడియా’ సెక్షన్‌లోకి వెళ్తే ఆ ఫోటోలు కనిపిస్తాయి. అక్కడ నుండి వాటిని మళ్లీ ఫోన్ గ్యాలరీలోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రికవరీ సాఫ్ట్‌వేర్‌ వినియోగం

Advertisement

పైన పేర్కొన్న ఏ పద్ధతి పనిచేయకపోతే కంప్యూటర్ సహాయంతో డేటాను రికవర్ చేసే నమ్మకమైన సాఫ్ట్‌వేర్‌లను వాడాల్సి ఉంటుంది. ‘Dr.Fone’, ‘EaseUS MobiSaver’, ‘DiskDigger’ వంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్‌లు ఇందుకు ఉపయోగపడతాయి. అయితే ప్లే స్టోర్‌లో దొరికే ఏవో తెలియని ఫేక్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసి ఫోన్ డేటాను రిస్క్‌లో పడేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. నమ్మకమైన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ద్వారా మాత్రమే ఫోన్‌ను కనెక్ట్ చేసి స్కాన్ చేయాలని హితవు పలుకుతున్నారు.

Also Read: మన ATM పిన్ 4 అంకెలే ఎందుకు? అసలు కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు!

ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

మెుబైల్ లోని ఫోటోలు డిలీట్ అయినట్లు గుర్తించిన వెంటనే ఫోన్ వాడకం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్తగా ఫోటోలు తీయడం లేదా యాప్స్ డౌన్‌లోడ్ చేయడం ఆపేయాలని హితవు పలుకుతున్నారు. ఎందుకంటే కొత్త డేటా వచ్చి చేరితే పాత డేటా శాశ్వతంగా డిలీట్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఫోన్‌లో ‘గూగుల్ ఫొటోస్’ లేదా ‘ఐ క్లౌడ్’ ఆటో సింక్ (Auto-sync) ఆప్షన్‌ను ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచుకోవడం మంచిదని హితవు పలుకుతున్నారు.

Also Read: ఏసీ కొనే బడ్జెట్ లేదా? ఈ 5 చిన్న గ్యాడ్జెట్స్‌తో.. హ్యాపీగా చిల్ అవ్వండి!

Related News

ఇక ఇంట్లోనే పబ్ ఫీలింగ్.. రూ.5 వేల లోపు 80W పవర్‌ఫుల్ సౌండ్‌తో బోట్ కొత్త స్పీకర్ లాంచ్!

ప్రతినెలా కరెంటు బిల్లు సగం అవ్వాలా? లైట్, రిమోట్‌తో వచ్చే బెస్ట్ BLDC ఫ్యాన్లు ఇవే.. ఓ లుక్కేయండి!

బ్యాంక్ ఆఫర్లతో ఇంకా చీప్‌గా.. Amazon Saleలో ఐకూ, రియల్‌మీ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు!

మన ATM పిన్ 4 అంకెలే ఎందుకు? అసలు కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు!

అమేజాన్ ప్రైమ్ డే సేల్.. సగానికి పైగా తగ్గిన టాప్ బ్రాండ్ సౌండ్‌బార్ల ధరలు.. డోంట్ మిస్!

ఏసీ కొనే బడ్జెట్ లేదా? ఈ 5 చిన్న గ్యాడ్జెట్స్‌తో.. హ్యాపీగా చిల్ అవ్వండి!

యాపిల్ లవర్స్‌కు పండగే.. iPhone 17 Pro Maxపై కళ్లు చెదిరే డిస్కౌంట్.. కొనేయండిలా!

Big Stories

Advertisement
×