E-Paper
Advertisement

ప్రతినెలా కరెంటు బిల్లు సగం అవ్వాలా? లైట్, రిమోట్‌తో వచ్చే బెస్ట్ BLDC ఫ్యాన్లు ఇవే.. ఓ లుక్కేయండి!

ప్రతినెలా కరెంటు బిల్లు సగం అవ్వాలా? లైట్, రిమోట్‌తో వచ్చే బెస్ట్ BLDC ఫ్యాన్లు ఇవే.. ఓ లుక్కేయండి!
Advertisement

Smart Ceiling Fans: ఇప్పుడు సీలింగ్ ఫ్యాన్లు కేవలం గాలిని మాత్రమే ఇవ్వడం లేదు. తక్కువ కరెంట్ వాడుకుంటూ.. రూమ్‌కి మంచి వెలుతురునిస్తూ, మొబైల్ లేదా వాయిస్ కంట్రోల్‌తో నడిచేలా అప్‌గ్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా చిన్న ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లలో ఫ్యాన్, లైట్ కోసం విడివిడిగా ఖర్చు పెట్టకుండా ఈ స్మార్ట్ ఫ్యాన్లు స్థలాన్ని, బడ్జెట్‌ను ఆదా చేస్తున్నాయి. వీటిలోని బిఎల్‌డిసి (BLDC) మోటార్ల వల్ల కరెంట్ బిల్లు కూడా భారీగా తగ్గుతుంది.

ఆల్‌రౌండర్ ఓరియంట్ ఏరోస్లిమ్ ఐఓటీ:

ఈ విభాగంలో ఓరియంట్ ఎలక్ట్రిక్ ఏరోస్లిమ్ ఫ్యాన్ ఒక చక్కటి ఎంపికగా నిలుస్తుంది. దీనిలో బిఎల్‌డిసి మోటార్‌తో పాటు వైఫై కనెక్టివిటీ, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉన్నాయి. దీని కింద ఉండే ఎల్‌ఈడీ లైట్ కేవలం డిజైన్ కోసం కాకుండా బెడ్‌రూమ్‌లు, స్టడీ రూమ్‌లకు సరిపోయేంత మంచి వెలుతురును ఇస్తుంది. రిమోట్ కంట్రోల్, వింటర్ మోడ్ (రివర్స్ రొటేషన్) కూడా ఇందులో లభిస్తాయి.

Advertisement

Also Read: బ్యాంక్ ఆఫర్లతో ఇంకా చీప్‌గా.. Amazon Saleలో ఐకూ, రియల్‌మీ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు!

ప్రీమియం లుక్‌లో క్రాంప్టన్ సైలెంట్ ప్రో:

నిశ్శబ్దంగా తిరుగుతూ.. ఎక్కువ గాలిని ఇచ్చే ఫ్యాన్ కావాలనుకుంటే క్రాంప్టన్ సైలెంట్ ప్రో అండర్‌లైట్ మోడల్ బాగుంటుంది. దీనిలో యాప్ కంట్రోల్‌తో పాటు లైట్ కలర్స్‌ను (వార్మ్, న్యూట్రల్, కూల్ వైట్) మార్చుకునే వీలుంది. అయితే ఈ సిరీస్‌లో లైట్ లేని మోడల్స్ కూడా ఉన్నాయి. దీంతో కొనేటప్పుడు అండర్‌లైట్ ఫీచర్ ఉన్న వేరియంట్‌నే చూసి తీసుకోవాలి.

సింపుల్‌గా ఉండే హావెల్స్ ట్రినిటీ:

Advertisement

మీకు వైఫై, యాప్‌లతో సంబంధం లేకుండా కేవలం రిమోట్‌తో నడిచే మంచి లైటింగ్ ఫ్యాన్ కావాలంటే హావెల్స్ ట్రినిటీ సరైనది. దీనిలో స్మార్ట్ కనెక్టివిటీ లేకపోయినా.. పవర్‌ఫుల్ బిఎల్‌డిసి మోటార్, రిమోట్‌తో డిమ్ చేసుకోగలిగే ఎల్‌ఈడీ లైట్ సెటప్ ఉంటుంది. ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చకుండా సింపుల్‌గా వాడుకోవడానికి ఇది బెస్ట్ ఛాయిస్.

కొనేముందు గుర్తుంచుకోవాల్సినవి:

మార్కెట్లో ఆటమ్‌బర్గ్ ఆరిస్ కాంటూర్, పాలీక్యాబ్ హోమ్ స్టోల్జ్ వంటి కొన్ని స్మార్ట్ ఫ్యాన్లు కేవలం స్మార్ట్ ఫీచర్లకే ప్రాధాన్యత ఇస్తాయి తప్ప వాటిలో రూమ్‌కి సరిపడా వెలుతురు ఉండదు. కాబట్టి.. కొనేముందు మీ ప్రాధాన్యత కరెంట్ ఆదా చేయడమా, స్మార్ట్ కనెక్టివిటీనా లేక మంచి లైటింగా అనేది చూసుకోవాలి. మీ రూమ్ సైజుకు తగ్గట్టుగా, స్థానిక సర్వీస్ సపోర్ట్ ఉన్న బ్రాండ్‌ను ఎంచుకోవడం ఎల్లప్పుడూ మంచిది.

Also Read: యాపిల్ లవర్స్‌కు పండగే.. iPhone 17 Pro Maxపై కళ్లు చెదిరే డిస్కౌంట్.. కొనేయండిలా!

Related News

టైపింగ్ మాత్రమే కాదు..మీ ఫోన్ కీబోర్డ్ చేసే అద్భుతమైన పనులు ఇవే!

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.789కే.. బ్లెండ్‌జెట్ పోర్టబుల్ జ్యూసర్

‘ఐస్ బ్యాటరీ’ వింత.. రాత్రి నీరు గడ్డకట్టిస్తారు.. పగలు భవనాన్ని చల్లబరుస్తారు..!

ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్..రూ.799కే ఇయర్‌బడ్స్

మీరు ఆఫ్ చేయాల్సిన అవసరమే లేదు.. ఫుడ్ రెడీ అవగానే ఆగిపోతాయ్

రూ.30 వేలలోపే 50 ఇంచుల టీవీ..ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు!

తక్కువ స్థలంలో ఎక్కువ స్టోరేజ్..అమెజాన్ ఆఫర్‌లో మినీ ఫ్రిడ్జ్‌‌లు

Jio రూ.299 vs Airtel రూ.349.. రెండిటిలో ఏ ప్లాన్ బెస్ట్.. దేనివల్ల బెనిఫిట్స్ ఎక్కువ?

Big Stories

Advertisement
×