E-Paper
Advertisement

పొరపాటున ఫోటోలు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి!

పొరపాటున ఫోటోలు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి!
Advertisement

Restore deleted pictures: ఫోటో గ్యాలరీని క్లీన్ చేసే సమయంలో లేదా అనుకోకుండా ముఖ్యమైన ఫొటోలు డిలీట్ అయ్యాయా? క్షణాల్లో మన విలువైన జ్ఞాపకాలు మాయమవడంతో గుండె ఆగినంత పనవుతుంది కదా! ముఖ్యంగా .. ఫ్రెండ్స్‌తో దిగిన బెస్ట్ మెమరీస్, ఫ్యామిలీ పిక్స్ లేదా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పొరపాటున డిలీట్ అయితే ఆ టెన్షనే వేరు. అయితే.. మీకో గుడ్ న్యూస్! మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే.. శాశ్వతంగా డిలీట్ అయిపోయాయని మీరు భయపడుతున్న ఆ ఫోటోలను మళ్లీ వెనక్కి తెచ్చుకోవడం ఇప్పుడు చిటికెలో పని. ఎలాంటి టెన్షన్ పడకుండా, ఆ డిలీట్ అయిన మీ ఫొటోలను సేఫ్‌గా, ఈజీగా ఎలా రికవర్ చేసుకోవాలో స్టెప్-బై-స్టెప్ చూసేద్దాం రండి!

స్మార్ట్‌ ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రతీ అరుదైన క్షణాన్ని కెమెరాలో బంధించడం మనకు అలవాటే. కానీ స్టోరేజ్ ఫుల్.. అయినప్పుడు లేదా గ్యాలరీని క్లీన్ చేసే.. క్రమంలో పొరపాటున ముఖ్యమైన ఫోటోలను డిలీట్ చేసేస్తుంటాం. ఆ తర్వాత లబోదిబోమంటూ టెన్షన్ పడుతుంటాం. కానీ.. మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు! ఆండ్రాయిడ్ ఫోన్లలో డిలీట్ అయిన ఫోటోలను తిరిగి సంపాదించడానికి కొన్ని మ్యాజికల్ ట్రిక్స్ ఉన్నాయి.

ట్రాష్ లేదా రీసైకిల్ బిన్ మ్యాజిక్:

Advertisement

మొదటిగా మీరు చేయాల్సిందల్లా.. మీ ఫోన్‌లోని గ్యాలరీ యాప్‌ను ఓపెన్ చేయడమే. శాంసంగ్, ఒప్పో, వివో, రియల్ మీ వంటి ఆండ్రాయిడ్ ఫోన్లన్నీ.. మనం డిలీట్ చేసిన ఫోటోలను వెంటనే రిమూవ్ చేయవు. వాటిని సురక్షితంగా ‘ట్రాష్’ లేదా ‘రీసెంట్లీ డిలీటెడ్’ ఫోల్డర్‌లో దాదాపు 30 రోజుల పాటు భద్రపరుస్తాయి. వీటి కోసం

1. మీ ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసి ‘ఆల్బమ్స్’ లేదా త్రీ-డాట్ మెనూలోకి వెళ్లండి.

Advertisement

2.అక్కడ ‘ట్రాష్’ లేదా ‘రీసెంట్లీ డిలీటెడ్’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.

3. మీరు పోగొట్టుకున్న ఫోటో అక్కడ కనిపిస్తే.. దానిని సెలెక్ట్ చేసి ‘రీస్టోర్ ఆప్షన్ ఎంచుకోండి . అంతే.. ఆ ఫోటో మళ్లీ మీ ఒరిజినల్ గ్యాలరీలోకి సేఫ్ ఎంట్రీ ఇస్తుంది.

గూగుల్ ఫోటోల ద్వారా తిరిగి పొందండి:

ప్రస్తుతం చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ఫోటోలు యాప్‌ను ఉపయోగిస్తున్నారు. మీ ఫోన్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆటోమేటిక్ బ్యాకప్ ఆన్ చేసి ఉంటే.. మీ ఫోటోలకు ఎప్పటికీ ఢోకా ఉండదు.

1.మీ ఫోన్‌లో Google Photos యాప్ ఓపెన్ చేయండి.

2.కింద ఉండే ‘లైబ్రరీ’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, పైన కనిపించే ‘ట్రాష్’ ఫోల్డర్‌ను ఓపెన్ చేయండి.

3. ఇక్కడ గత 60 రోజుల్లో డిలీట్ అయిన మీ ఫోటోలన్నీ దర్శనమిస్తాయి. మీకు కావలసిన ఫోటోను లాంగ్ ప్రెస్ చేసి ‘రీస్టోర్’ కొట్టండి చాలు, క్షణాల్లో వెనక్కి వచ్చేస్తుంది.

థర్డ్-పార్టీ రికవరీ యాప్‌ల సాయం:

ఒకవేళ ట్రాష్‌లో లేదా గూగుల్ ఫోటోలలో కూడా ఆ ఫొటోలు కనిపించకపోతే.. ఇక పూర్తిగా డిలీట్ అయినట్లే అని నిరుత్సాహపడకండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి కొన్ని నమ్మదగిన థర్డ్-పార్టీ యాప్‌లను (ఉదాహరణకు DiskDigger వంటివి) ట్రై చేయవచ్చు. ఈ యాప్‌లు మీ ఫోన్ ఇంటర్నల్ మెమరీని డీప్ స్కాన్ చేసి, డిలీట్ అయిన ఫైళ్లను వెతికిపెట్టడంలో పర్ఫెక్ట్‌గా సహాయ పడతాయి. అయితే.. రూట్ చేయని ఫోన్లలో ఇవి కేవలం లో-రెజల్యూషన్ ఫోటోలను మాత్రమే రికవర్ చేయగలవనే విషయాన్ని గుర్తుంచుకోండి.

Also Read: పొరపాటున డిలీట్ చేసిన మెసేజ్‌లు, అలర్ట్‌లు మళ్లీ చూడాలా ?

క్లౌడ్ బ్యాకప్‌లతో.. పర్మినెంట్ సేఫ్టీ:

గూగుల్ డ్రైవ్, మైక్రో సాఫ్ట్ వన్‌డ్రైవ్ లేదా డ్రాప్‌ బాక్స్ వంటి క్లౌడ్ స్టోరేజ్ సర్వీసులను మీరు వాడుతున్నట్లయితే.. ఫోటోలు ఆటోమేటిక్‌గా అక్కడ సింక్ అయి ఉండే.. ఛాన్స్ ఉంది. మీ అకౌంట్‌లోకి లాగిన్ అయి క్లౌడ్ డ్రైవ్‌ను.. చెక్ చేస్తే మీ పాత జ్ఞాపకాలన్నీ భద్రంగా ఉంటాయి. భవిష్యత్తులో ఇలాంటి సందర్భంగాలు రిపీట్ కాకుండా ఉండాలంటే, ఇప్పటి నుంచే మీ ఫోన్ లో ఆటో-బ్యాకప్ ఆన్ చేసుకొని ఉండటం చాలా బెటర్!

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×