Vishwanath and Sons:కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ స్పోర్ట్స్ డ్రామా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఆగస్ట్ 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకొని సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం రూ.120 కోట్ల నుంచి రూ.185 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంది.
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కేవలం రెండు ఇళ్లలోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం జరిగింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో రెండు భారీ సెట్ వేసి మరీ ఈ సినిమా షూటింగ్ నిర్వహించారు. పేరుకే ఈ సినిమా రెండు ఇళ్లల్లో షూటింగ్ జరిగినా.. ఆ సెట్ నిర్మాణానికి భారీగా ఖర్చయినట్లు తెలుస్తోంది. మొత్తం 120 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంది ఈ సినిమా.. శుక్రవారం కొత్త సినిమాలు వచ్చినప్పటికీ, సూర్య సినిమా వైపు ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య ఒలింపిక్ పిస్టల్ షూటర్ ‘సంజయ్ విశ్వనాథ్’ పాత్రలో కనిపించారు. ఈ సినిమా కోసం సూర్య రూ.45 కోట్ల భారీ రెమ్యునరేషన్ అందుకున్నారు. సర్‌గేషన్ ఆధారంగా సాగే ఈ కథలో హీరోయిన్ మమిత బైజు (మ్యాడీ) రూ.1.5 నుంచి రూ.3 కోట్లు పారితోషికం తీసుకోగా, రవీనా టాండన్ రూ.2 నుంచి రూ.3 కోట్లు, రాధికా శరత్‌కుమార్ రూ.40 లక్షల వరకు అందుకున్నారు. జీవీ ప్రకాష్ అందించిన సంగీతం సినిమాకు మరో కొండంత బలంగా నిలిచింది.
విడుదలకు ముందే ఈ సినిమా డిజిటల్ (నెట్‌ఫ్లిక్స్), శాటిలైట్, ఆడియో మరియు డిస్ట్రిబ్యూషన్ హక్కుల రూపంలో రూ.300 కోట్లకు పైగా బిజినెస్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్ల గ్రాస్ వసూలు చేసి అదిరిపోయే బోణీ కొట్టింది. ఇక విభిన్నమైన కాన్సెప్ట్‌తో పాటు ఎమోషనల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండటంతో విడుదలైన రెండు రోజుల్లోనే ఏకంగా రూ.100 కోట్ల మైలురాయిని దాటేసి రికార్డు సృష్టించింది.
also read:పోలీసులను ఆశ్రయించిన ఫోక్ డాన్సర్ మాధురి.. కేస్ ఫైల్!
ఈ చిత్రం మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.141.32 కోట్ల గ్రాస్ సాధించగా, ప్రొడ్యూసర్స్ ప్రకారం ఇది రూ.150 కోట్లకు పైగానే ఉంది. ఇండియాలో రూ.94.32 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.47 కోట్లు రాబట్టింది. తమిళనాడులో రూ.45.50 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.28.20 కోట్లు, అలాగే మిగతా భారతీయ రాష్ట్రాల్లో రూ.20.62 కోట్లు వసూలు చేసింది. రెండో వారంలోకి అడుగుపెట్టినా శుక్రవారం నాటి వసూళ్లు పెరగడం విశేషం.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, అద్భుతమైన కథాబలంతో ప్రేక్షకులను అలరిస్తూ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం నిర్మతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. సూర్య మార్కెట్ పరిధిని పెంచడమే కాకుండా, వెంకీ అట్లూరి దర్శకత్వ ప్రతిభను మరోసారి నిరూపించింది.