E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 7900mAh బ్యాటరీతో Redmi M100!

బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 7900mAh బ్యాటరీతో Redmi M100!
Advertisement

Redmi M100: బడ్జెట్ శ్రేణిలో స్మార్ట్‌ఫోన్లను అందిస్తూ మార్కెట్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న రెడ్‌మీ.. తాజాగా M100 పేరుతో మరొక కొత్త ఫోన్‌ను రంగంలోకి దించింది. రోజువారీ వాడకానికి, ఎక్కువ సమయం ఛార్జింగ్ నిలిచి ఉండే ఫోన్ల కోసం చూసేవారిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని రూపొందించింది. ప్రస్తుతం చైనా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ డివైజ్ త్వరలోనే మరిన్ని దేశాలకు వచ్చే అవకాశం ఉంది.

ఆకట్టుకునే లుక్.. డిజైన్:

Redmi M100 ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, స్టారీ వైట్, వైల్డర్‌నెస్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ముఖ్యంగా వైల్డర్‌నెస్ గ్రీన్ వేరియంట్ వెనుక వైపు కెమెరా భాగంలో ఆకర్షణీయమైన ఆర్‌జీబీ డైనమిక్ లైటింగ్‌ను ఇచ్చారు. ఇది ఫోన్‌కు చాలా కొత్త లుక్‌ను ఇస్తుంది. స్క్రీన్ విషయానికి వస్తే.. దీనిలో 6.9 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. కంటికి శ్రమ తగ్గించే ప్రత్యేక మోడ్‌తో పాటు స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ రక్షణను కూడా అందించారు.

Advertisement

Also Read: ఆకట్టుకునే డిజైన్, అద్భుతమైన ఫీచర్లు.. లీకైన Samsung Galaxy S26 FE విశేషాలు!

పవర్‌ఫుల్ బ్యాటరీ.. రివర్స్ ఛార్జింగ్:

ఈ Redmi M100లో చెప్పుకోదగ్గ అతిపెద్ద విశేషం దీని బ్యాటరీనే. ఏకంగా 7900mAh సామర్థ్యం గల బ్యాటరీని ఇందులో అమర్చారు. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంతేకాకుండా.. ఈ ఫోన్ ద్వారా ఇతర చిన్న చిన్న పరికరాలకు ఛార్జింగ్ ఇచ్చుకునేలా 22.5W రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా కల్పించారు. ఇతర ఛార్జర్లతో కూడా వేగంగా ఛార్జ్ అయ్యేలా ప్రత్యేక ప్రోటోకాల్ సపోర్ట్ ఇచ్చారు.

పెర్ఫార్మెన్స్.. కెమెరా విశేషాలు:

Advertisement

స్నాప్‌డ్రాగన్ 4 Gen 5 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ Redmi M100 రోజువారీ పనులను చాలా సులభంగా పూర్తి చేస్తుంది. కెమెరా విభాగంలో వెనుక వైపు 13MP ప్రధాన కెమెరా ఉంది. నైట్ మోడ్, పోర్ట్రెయిట్, డాక్యుమెంట్ స్కానింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, హెడ్‌ఫోన్ జాక్ వంటి అన్ని అవసరమైన సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

ధర వివరాలు:

ప్రస్తుతానికి చైనాలో లాంచ్ అయిన ఈ Redmi M100 ఫోన్ ప్రారంభ ధర 8GB RAM + 128GB వేరియంట్‌కు దాదాపు రూ.25,500గా ఉంది. స్టోరేజ్ ఆధారంగా మరికొన్ని మోడల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో దీని లాంచ్ తేదీపై కంపెనీ ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు.

Also Read: భారత్‌లోకి Infinix Hot 70 Pro.. రూ.25,000 లోపు IP68 రేటింగ్, భారీ బ్యాటరీ ఫోన్!

Tags

Related News

చిన్న కిచెన్ల కోసం అదిరిపోయే..డబుల్ డోర్ ఫ్రిజ్‌లు

ఆకట్టుకునే డిజైన్, అద్భుతమైన ఫీచర్లు.. లీకైన Samsung Galaxy S26 FE విశేషాలు!

భారత్‌లోకి Infinix Hot 70 Pro.. రూ.25,000 లోపు IP68 రేటింగ్, భారీ బ్యాటరీ ఫోన్!

యూజర్లకు బిగ్ షాకిచ్చిన శాంసంగ్.. ఏకంగా రూ.12,000 పెరిగిన Galaxy S25 ధర, కొత్త రేట్లు ఇవే!

లాంగ్ అవర్స్ వర్క్ చేసే..వారి కోసం బెస్ట్ ఐ-సేఫ్ మానిటర్స్

ఇక హెడ్‌సెట్ అక్కర్లేదు.. గేమింగ్ కోసం Sony Pulse Elevate 3D ఆడియో స్పీకర్లు వచ్చేశాయ్!

రక్తంలోకి పోయే దుమ్మును కూడా పట్టుకుంటుంది.. షియోమీ నుంచి రెండు అద్భుతమైన ప్రొడక్ట్స్!

Big Stories

Advertisement
×