E-Paper
Advertisement

ల్యాప్‌టాప్ ఫీచర్లతో బెస్ట్ ట్యాబ్ విడుదల..ధర కూడా చాలా తక్కువ తెలుసా?

ల్యాప్‌టాప్ ఫీచర్లతో బెస్ట్ ట్యాబ్ విడుదల..ధర కూడా చాలా తక్కువ తెలుసా?
Advertisement

Huawei MatePad 11.5: చదువుకోవడానికి అంతే కాకుండా ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి లేదా ఎంటర్ టైన్మెంట్ కోసం ఒక మంచి ట్యాబ్ కొనాలని చూస్తున్నారా? అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్న లేటెస్ట్ ట్యాబ్‌లలో హువాయ్ మేట్‌ప్యాడ్ 11.5 ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కేవలం రూ. 33,999 ధరకే.. కీబోర్డ్‌తో పాటు వస్తున్న ఈ టాబ్,ల్యాప్‌టాప్‌కు సరి కొత్త ప్రత్యామ్నాయంగా మారుతోంది. డిజిటల్ కాలంలో.. ల్యాప్‌టాప్‌లను మోయడం కంటే తేలికపాటి ట్యాబ్‌లను వాడేందుకు ఆసక్తి చూపుతున్న టెక్ లవర్స్ కోసం దీని ప్రత్యేకతలు ఇప్పుడు పూర్తిగా చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

ప్రీమియం డిజైన్ & డిస్‌ప్లే:

ఈ టాబ్లెట్ స్పేస్ గ్రే కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. దీని ప్రీమియం మెటాలిక్ డిజైన్ చూడటానికి చాలా ట్రెండీగా ఉంటుంది. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో 11.5 ఇంచుల పెద్ద స్క్రీన్ ఇవ్వడం జరిగింది. ఆన్‌లైన్ క్లాసులు వినేటప్పుడు, సినిమాలు చూసేటప్పుడు లేదా గ్రాఫిక్ వర్క్ చేసేటప్పుడు ఈ డిస్‌ప్లే చక్కటి ఫీల్ ఇస్తుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా స్మూత్‌గా పని చేసేలా డిజైన్ చేశారు.

పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ & స్టోరేజ్:

Advertisement

మల్టీటాస్కింగ్ ఈజీగా చేసుకోవడానికి.. ఈ  ట్యాబ్ లో అద్భుతమైన హార్డ్‌వేర్ ఉపయోగించారు. ఇందులో 8 GB RAM, 256 GB ROM ఇంటర్నల్ స్టోరేజ్ అవకాశం కూడా ఉంది. దీని వల్ల మీరు ఒకే సారి అనేక యాప్స్‌ను ఓపెన్ చేసినా ట్యాబ్ హ్యాంగ్ అవ్వకుండా వేగంగా పని చేస్తుంది. అలాగే.. 256 GB స్టోరేజ్ ఉండటం వల్ల మీ ఇష్టమైన సినిమాలు, ఫోటోలు, భారీ ఫైల్స్ అన్నీ సేఫ్‌గా దాచుకోవచ్చు. ఇది పవర్ ఫుల్ కిరిన్ టి82బి ప్రాసెసర్‌తో పని చేస్తుంది. గేమింగ్ , హెవీ అప్లికేషన్ల వాడకానికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

కీబోర్డ్ సపోర్ట్ – ల్యాప్ టాప్ ఫీలింగ్:

ఈ ప్యాకేజ్‌లో ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే.. దీంతో పాటు ఒక కీ బోర్డ్ కూడా వస్తుంది. టైపింగ్ ఎక్కువగా చేసే.. విద్యార్థులకు, ఆఫీస్ ఉద్యోగులకు, కంటెంట్ క్రియేటర్లకు ఈ కీబోర్డ్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. టాబ్లెట్‌‌ను ల్యాప్‌టాప్ లా మార్చుకుని ఈజీగా పనులు పూర్తి చేసుకోవచ్చు. కేవలం వై-ఫై కనెక్టివిటీతో పని చేసే ఈ మోడల్ ఇళ్లలో, ఆఫీసుల్లో నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని వర్క్ చేసుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

Advertisement

Also Read: ఈ ప్రైస్‌కి ఈ లుక్ వేరే లెవెల్ అంతే! మార్కెట్‌లో అదరగొడుతున్న స్మార్ట్ వాచ్

ధర :

మార్కెట్లో ఈ మోడల్ అసలు ధర సుమారు రూ.33,999 వరకు ఉంది. ఈ ధరలో.. కీబోర్డ్ కూడా లభించడం దీనికి అతి పెద్ద ప్లస్ పాయింట్. ఆన్‌ లైన్ స్టోర్లు లేదా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లలో.. వివిధ బ్యాంక్ ఆఫర్లు పోల్చుకుని కొంటే.. ఇంకా తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.

బడ్జెట్‌లో ఉంటూనే ల్యాప్‌టాప్ లాంటి ఫీల్ కోరుకునే వారికి హువాయ్ మేట్‌ప్యాడ్ 11.5 ఒక అద్భుతమైన ఛాయిస్ అని చెప్పొచ్చు. దీని స్టైలిష్ లుక్, భారీ మెమరీ, కీబోర్డ్ సెటప్ దీనిని మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. మీరు కూడా కొత్త ట్యాబ్ కొనాలని ఆలోచిస్తుంటే.. దీనిని నిస్సందేహంగా ఆర్డర్ చేయొచ్చు.

Related News

జియో vs వొడాఫోన్ ఐడియా.. రూ.299కే అదిరిపోయే ప్లాన్లు.. ఏది రీఛార్జ్ చేస్తే బెస్ట్?

రూ. 699లకే Airtel, Jio బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు.. రెండింటిలో ఏది బెస్ట్? దేని వల్ల ఎక్కువ లాభం!

ఈ ప్రైస్‌కి ఈ లుక్ వేరే లెవెల్ అంతే! మార్కెట్‌లో అదరగొడుతున్న స్మార్ట్ వాచ్

మీ ఆధార్‌కు ఏ మొబైల్ నంబర్ లింక్ అయిందో..క్షణాల్లో తెలుసుకోండిలా!

ఏటీఎంలో మీ కార్డ్ ఇరుక్కుపోయిందా? ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే క్షణాల్లో రికవరీ!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..బెస్ట్ పార్టీ స్పీకర్లపై మతిపోయే ఆఫర్

ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలా? అయితే ఈ 5 హై-సక్షన్ వాక్యూమ్ క్లీనర్స్ ట్రై చేయండి!

Big Stories

Advertisement
×