E-Paper
Advertisement

బీఆర్‌ఎస్‌ను బావబామ్మర్దులే బొంద పెడుతున్నారు: అద్దంకి దయాకర్

బీఆర్‌ఎస్‌ను బావబామ్మర్దులే బొంద పెడుతున్నారు: అద్దంకి దయాకర్
Advertisement

Addanki Dayakar: బీఆర్‌ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్‌లపై ఎంఎల్సీ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హరీష్ రావును నయా వసూల్ రాజాగా అభివర్ణిస్తూ.. కాంట్రాక్టర్లు ఎవరూ ఆయనకు భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు హరీష్ రావుకు టాక్స్ కట్టాల్సి వచ్చేదని.. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. హరీష్ రావు ప్రవర్తన ప్రస్తుతం చంద్రముఖి పాత్రను తలపిస్తోందని ఎద్దేవా చేశారు.

అధికారులను బెదిరించడం హరీష్ రావుకు అలవాటుగా మారిందని.. గతంలో అధికారులతో తప్పులు చేయించి వారిని జైలుకు పంపిన చరిత్ర బీఆర్‌ఎస్‌దని అద్దంకి దయాకర్ ఆరోపించారు. క్రషర్ కంపెనీల వద్ద ఒక్కొక్కరి నుంచి కోటి రూపాయలు వసూలు చేయలేదని హరీష్ రావు ప్రమాణం చేయగలరా అని సవాలు విసిరారు. హరీష్ చేస్తున్న బ్లాక్ దందాలను బయటపెడితేనే ఆయన అసలు స్వరూపం అందరికీ తెలుస్తుందని మండిపడ్డారు. కేటీఆర్, హరీష్ రావుల నటనకు ఆస్కార్ అవార్డులు ఇవ్వవచ్చని.. వారు నారద, శకుని పాత్రలను పోషిస్తున్నారని విమర్శించారు.

Advertisement

బీఆర్‌ఎస్ పార్టీని బావబామ్మర్దులు కలిసి బొంద పెడుతున్నారని.. గతంలో టీఆర్‌ఎస్‌ను కూడా వారే నాశనం చేశారని దయాకర్ ధ్వజమెత్తారు. హరీష్ రావు ఎప్పుడు బీజేపీలోకి జంప్ అవుతారో అని కేటీఆర్ నిరంతరం భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. హరీష్ రావు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేశారని.. అప్పుడు పాలన ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే ఉందని గుర్తు చేశారు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు కేటీఆర్, హరీష్ రావులే బ్రాండ్ అంబాసిడర్లు అని.. ప్రతి చర్య వెనుక కేవలం ఆర్థిక లాభం మాత్రమే చూస్తారని ఆరోపించారు.

ప్రతిపక్షంలో ఉండి కూడా ఆదాయం రావాలని వారు కోరుకుంటున్నారని అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఏదైనా ఒక అంశాన్ని తెరపైకి తీసుకురావడం.. దానికి సంబంధించిన వారిని భయపెట్టి డబ్బులు వసూలు చేయడమే వీరి పని అని విమర్శించారు. హరీష్ రావు అనే కోయిల ముందే కూస్తోందని.. దమ్ముంటే తన ఆరోపణలపై చర్చకు రావాలని సవాలు విసిరారు. రాష్ట్ర ఖజానాను దోచుకుంటూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Read Also: రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి- జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Related News

ఢిల్లీకి మాజీ మంత్రి కొండా సురేఖ, అనుచరులతో భేటీ, మళ్లీ ఏం జరిగింది?

హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు.. కొత్త బీఎండబ్ల్యూ కారుని చుట్టి ముట్టి, రూ2. లక్షలు డిమాండ్

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

పొంగులేటి సమాధానం చెప్పలేదు.. క్షమాపణ కోరలేదు: హరీశ్‌రావు

వంద రోజుల్లో అన్నాం.. ఏ వంద రోజులో చెప్పామా? బీఆర్‌ఎస్ మాక్ అసెంబ్లీలో తలసాని రచ్చ!

ఖమ్మం జిల్లాలో ఎల్‌నినో ఎఫెక్ట్.. పంట మార్చినా రైతన్నకు తప్పని కన్నీళ్లు!

తెలంగాణను దేశంలోనే క్రీడా శక్తిగా తీర్చిదిద్దుతాం: మంత్రి వాకిటి శ్రీహరి

అధికారంలో ఉంటేనే సభకు వస్తారా? BRS ఎమ్మెల్యేలపై కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×