Chintapalli Baby: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గంజాయి మత్తులో మునిగి ఐదు నెలల పసిబిడ్డను అతి దారుణంగా చంపేశాడు. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి.
ఎపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చింతపల్లిలో కిరాతకం గంజాయి మత్తులో మునిగిన తండ్రి తన 5 నెలల పసిబిడ్డను కడతేర్చాడు. మత్తుకు బానిసైన తండ్రి తన కన్న పేగునే మరిచి ఆ మత్తు మహమ్మారికి బానిసై ఓ నిండు పసిప్రాణాన్ని బలితీసుకుంది. అయితే గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయిన కన్నతండ్రి తన ఐదు నెలల పసిగుడ్డును అతి కిరాతకంగా హతమార్చాడు.
Also read: రైలు కింద పడబోయిన ప్రయాణికుడు.. కానిస్టేబుల్ చాకచక్యంతో లైఫ్ సేఫ్!
బాబు తల్లి జీవనోపాధి కోసం చంతపల్లిలోని స్థానిక హోటల్‌లో పనికి వెళ్లింది. దీంతో ఆ సమయంలో చిన్నారి తండ్రి గొల్లూరు చందు వద్దే బాబు ఉన్నాడు. అయితే బాబు ఆకలితో ఏడుస్తుండటంతో తండ్రి చందు అతడిని తల్లి పనిచేస్తున్న హోటల్ వద్దకు తీసుకెళ్లి పాలు పట్టించాడు. అనంతరం బాబును తీసుకుని తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అయితే కొద్దిసేపటికే తీవ్ర గంజాయి మత్తులోకి తండ్రి చందు జారుకున్నాడు. అంతే ఇక దీంతో విచక్షణ మరిచి ఏమీ తెలియని తన ఐదు నెలల పసిబిడ్డను అత్యంత క్రూరంగా దాడి చేసి చంపేశాడు. కన్నతండ్రే కాలయముడిగా మారిన ఈ ఘటన అక్కడి ప్రాంతంతో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటనతో కన్నీరు మున్నీరైన తల్లి శోకంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు తండ్రిని చందును పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
Also read: ‘రే*ప్ చేస్తే చస్తామనే భయం పుట్టించాలి’.. మహిళల భద్రతపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!