iFFALCON 65U65 TV: ప్రస్తుత కాలంలో పెద్ద స్క్రీన్ గల స్మార్ట్ టీవీలను.. ఇళ్లలో వాడటం ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా సినిమా థియేటర్ లాంటి ఫీల్ ఇంట్లోనే పొందాలని కోరుకునే వారి కోసం ఐఎఫ్‌ఫాల్కన్ అద్భుతమైన టీవీని అందుబాటులోకి తెచ్చింది. అదే iFFALCON 65U65 మోడల్. 164 సెం.మీ (65 అంగుళాల) సైజులో, 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో వస్తున్న ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.39,999 ధరకే లభిస్తుంది. గేమింగ్, మూవీ లవర్స్‌ను ఒకేలా ఆకట్టుకుంటున్న ఈ టీవీ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇంటి హాల్‌కు ఎంతో అందమైన లుక్‌ను తెచ్చే బిగ్ స్క్రీన్ టీవీల కోసం చూస్తున్నారా? అయితే ఈ మోడల్ మీకు చక్కటి ఆప్షన్ అవుతుంది. దీనిలో 164 సెం.మీ అనగా 65 ఇంచుల విశాలమైన డిస్‌ప్లేను అందించారు. బెజెల్ లెస్ డిజైన్ కారణంగా స్క్రీన్ మరింత పెద్దదిగా కనిపిస్తుంది. లివింగ్ రూమ్‌లో.. గోడకు లేదా టేబుల్ పై పెట్టుకున్నప్పటికీ ఇది ఇంటికి ఒక మోడ్రన్, ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. స్లిమ్ ప్రొఫైల్ కలిగి ఉండటం దీని ప్రత్యేకత.
ఈ టీవీలో 4K అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ సపోర్ట్ లభిస్తుంది. దీని వల్ల ప్రతి చిన్న వివరాలు కూడా చాలా స్పష్టంగా, సహజంగా కనిపిస్తాయి. దీనికి తోడు డాల్బీ విజన్ టెక్నాలజీ ఉండటం వల్ల రంగులు చాలా రిచ్‌గా, కాంట్రాస్ట్ పర్ఫెక్ట్ గా వస్తాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లేదా యూ ట్యూబ్‌లో 4K కంటెంట్‌ను చూస్తున్నప్పుడు నిజంగా థియేటర్‌లో.. కూర్చున్న ఫీల్ కలుగుతుంది. బ్రైట్‌నెస్ కూడా చాలా బాగుండటం వల్ల పగటి పూట కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది.
ప్రస్తుత ట్రెండ్‌కు తగినట్లుగా గేమర్స్ కోసం ఇందులో ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. 120Hz VRR సపోర్ట్ ఉండటం వల్ల హై-ఎండ్ గేమ్‌లు ఆడేటప్పుడు స్క్రీన్ టేరింగ్ లేదా లాగ్ సమస్యలు అసలు రావు. గేమ్‌ప్లే చాలా స్మూత్‌గా , రెస్పాన్సివ్‌గా ఉంటుంది. అలాగే ‘గేమ్ మాస్టర్’ మోడ్ గేమింగ్ అనుభవాన్ని మరింత పెంచుతుంది. పీఎస్5 లేదా ఎక్స్ బాక్స్ వంటి కన్సోల్స్ కనెక్ట్ చేసి ఆడే వారికి ఈ టీవీ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం.
మంచి విజువల్స్‌తో పాటు పవర్ ఫుల్ సౌండ్ ఉంటేనే ఎంటర్‌టైన్‌మెంట్ పరిపూర్ణం అవుతుంది. ఈ విషయంలో ఈ మోడల్ అస్సలు నిరాశపరచదు. ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ గల పవర్ ఫుల్ స్పీకర్లను వాడారు. ఎక్స్టర్నల్ సౌండ్ బార్ అవసరం లేకుండానే ఇంట్లోనే సరౌండ్ సౌండ్ ఫీల్ పొందవచ్చు. యాక్షన్ సీన్స్ చూసేటప్పుడు లేదా మ్యూజిక్ వింటున్నప్పుడు బేస్, క్లారిటీ చాలా అద్భుతంగా ఉంటాయి.
ఇది లేటెస్ట్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. దీని యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా సింపుల్‌గా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. వాయిస్ కంట్రోల్ కోసం గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ లభిస్తుంది.రిమోట్ తో పని లేకుండా మీ మాటలతోనే.. టీవీని ఆపరేట్ చేయొచ్చు. అలాగే ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి అన్ని ప్రముఖ ఓటీటీ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్రోమ్‌కాస్ట్ బిల్ట్-ఇన్ ఉండటం వల్ల మొబైల్ స్క్రీన్‌ను నేరుగా టీవీకి షేర్ చేసుకోవడం చాలా ఈజీ.
Also Read: రూ.60వేలలోపు అదిరిపోయే లెనోవో i5 ల్యాప్ టాప్..స్పెషల్ ఫీచర్లు ఇవే!
ఈ స్మార్ట్ టీవీలో కనెక్టివిటీ కోసం తగినన్ని పోర్ట్స్ ఇచ్చారు. గేమింగ్ కన్సోల్స్ ,సెట్-టాప్ బాక్స్ కనెక్ట్ చేయడానికి హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, పెన్‌డ్రైవ్‌లు లేదా హార్డ్ డిస్క్‌ల కోసం యూఎస్‌బీ పోర్ట్‌లు ఉన్నాయి. వీటితో పాటు వైఫై , బ్లూటూత్ కనెక్టివిటీ కూడా అబ్సల్యూట్‌గా చాలా స్టేబుల్‌గా పని చేస్తాయి. హెడ్‌ఫోన్స్ లేదా బ్లూటూత్ స్పీకర్లను వైర్‌లెస్ గా కనెక్ట్ చేసుకోవచ్చు.
మార్కెట్లో ఈ మోడల్ అసలు ధర చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం వివిధ ఆఫర్లు, సేల్స్‌లో కేవలం రూ.39,999 ధరకే లభిస్తోంది. కేవలం నలభై వేల రూపాయల బడ్జెట్‌లో 65 ఇంచుల బిగ్ స్క్రీన్, 120Hz VRR గేమింగ్ సపోర్ట్, డాల్బీ విజన్ & అట్మాస్ ఫీచర్లు ఉన్న టీవీ దొరకడం నిజంగా అద్భుతం. తక్కువ బడ్జెట్‌లో పెద్ద హోమ్ థియేటర్ సెటప్ కోరుకునే ప్రతి ఒక్కరికీ ఇది బెస్ట్ ఛాయిస్!