BigTV English

Arvind Kejriwal gets bail: సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్, ఆరు నెలల తర్వాత..

Arvind Kejriwal gets bail: సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్, ఆరు నెలల తర్వాత..

Arvind Kejriwal gets bail: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎట్టకేలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్. ఆయనకు సుప్రీంకోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.


ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితులు ఒకొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారడంతో కొందరు విడుదలయ్యారు. కీలక నిందితులుగా భావిస్తున్నమాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్యే కవితకు బెయిల్ వచ్చింది.

తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ వంతైంది. ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. దాదాపు ఆరునెలల తర్వాత ఈ కేసులో తీహార్ జైలు నుంచి ఆయన బయటకు రానున్నారు.


ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని ఖరారు చేయడానికి సీఎం కేజ్రీవాల్ సర్కార్ 100 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు ప్రధాని ఆరోపణ. ఆ నిధులను గోవా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై రంగంలోకి దిగన ఈడీ, మద్యం కుంభకోణం కేసులో ఈ ఏడాది మార్చి 21న సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది.

ALSO READ:  భారత నిబంధనలు పాటించని అమెజాన్, వాల్ మార్ట్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరపున ప్రచారం చేసుకునేందుకు ఆయనకు పలు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది సుప్రీంకోర్టు. పోలింగ్ అనంతరం న్యాయస్థానం ముందు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలతో కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకి తరలించారు. ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు జులై 12న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన తీహార్ జైలులో ఉండిపోయారు.

లిక్కర్ కేసులో జూన్ 26న కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. తనను అరెస్ట్ చేయడాన్ని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత హైకోర్టుకి వెళ్లారు. బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం ససేమిరా అంది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారాయన. దీనిపై ఇరుపక్షాల వాదలను విన్న ఇద్దరు సభ్యుల ధర్మాసనం, సెప్టెంబర్ ఐదున తీర్పు రిజర్వ్ చేసింది.  శుక్రవారం తీర్పు ఇచ్చింది న్యాయస్థానం.  10 లక్షల పూచీకత్తుపై  బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు గురించి ఎక్కడా మాట్లాడవద్దని తీర్పులో ప్రస్తావించింది.

Related News

Modi New Strategy: అమెరికాను దెబ్బ కొట్టేందుకు మోదీ స్వదేశీ మంత్రం.. ఫలిస్తుందా?

Tariff Affect: ట్రంప్ సుంకాల మోత అమలులోకొచ్చింది.. ఎక్కువ ప్రభావం వీటిపైనే

Bihar: బీహార్ యాత్రలో సీఎం రేవంత్.. రాహుల్ గాంధీ ప్లాన్ అదేనా!

Jammu Kashmir: ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి..

Trump-Modi: 4సార్లు ట్రంప్ ఫోన్ కాల్ కట్ చేసిన మోదీ.. జర్మనీ పత్రిక సంచలన కథనం

Cloudburst: దోడాలో క్లౌడ్ బరస్ట్.. జమ్మూ ప్రాంతంలో వరదల విజృంభణ.. మళ్లీ ప్రాణనష్టం!

Big Stories

×