E-Paper
Advertisement

టీమిండియాలో బాబ‌ర్ ఆజం ఉండింటే… ప్ర‌తీ మ్యాచ్ లోనూ సెంచ‌రీ చేసేవాడు

టీమిండియాలో బాబ‌ర్ ఆజం ఉండింటే… ప్ర‌తీ మ్యాచ్ లోనూ సెంచ‌రీ చేసేవాడు
Advertisement

Tanveer Ahmed On Babar Azam:  పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ గురించి తెలియని వారు ఉండరు. ఒకప్పుడు పాకిస్తాన్ జట్టులో కీలక బౌలర్ గా ఎదిగిన తన్వీర్ అహ్మద్, ఇప్పుడు క్రికెట్ విశ్లేషకుడిగా క్రికెట్ విశ్లేషకుడిగా తన జీవితాన్ని లాగుతున్నారు. అలాంటి తన్వీర్ అహ్మద్ పొద్దున లేస్తే చాలు… టీమిండియాను టార్గెట్ చేసి ఏదో ఒక ఆరోపణ చేస్తూనే ఉంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను కించపరుస్తూ ఆరోపణలు చేస్తారు. వైభవ్ సూర్యవంశీ లాంటి కుర్ర క్రికెటర్ల మనోస్థైర్యాన్ని దెబ్బతీనేలా మాట్లాడుతుంటారు తన్వీర్ అహ్మద్. అలాంటి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ తాజాగా మరో వివాదాస్పద స్టేట్మెంట్ ఇచ్చారు.

టీమిండియాలో బాబ‌ర్ ఉండింటే… ప్ర‌తీ మ్యాచ్ లోనూ సెంచ‌రీ చేసేవాడు

టీమిండియాలో పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజం ఉండి ఉంటే, ఎన్నో రికార్డులు తిరగరాసేవాడని బాంబు పేల్చారు. మహేంద్రసింగ్ ధోని కంటే గొప్ప కెప్టెన్ అయ్యేవాడని ప్రశంసించారు. ప్రతి మ్యాచ్ లో సెంచరీ తో విరాట్ కోహ్లీ రికార్డులను కూడా బద్దలు కొట్టేవాడని షాకింగ్ కామెంట్స్ చేశారు తన్వీర్ అహ్మద్. దీంతో బాబార్ ఆజంపై త‌న్వీర్ అహ్మ‌ద్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. ఇండియాలోని ఫ్లాట్ మైదానాలలో బాబర్ ఆజం టీమిండియా ప్లేయర్ గా అద్భుతంగా ఆడి ఉంటే, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, యూట్యూబర్లు కూడా టీవీలలో చర్చలు పెట్టే వాళ్ళని వెల్లడించారు. అత‌డిని మెచ్చుకునేవాళ్లు అంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

ఇండియాలో 40 నుంచి 50 మీట‌ర్లే బౌండ‌రీలు గేట్లు

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో చిన్న బౌండరీలు ఉంటాయని మరోసారి హేళన చేస్తూ మాట్లాడారు. అందుకే టీమిండియా క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారని.. అర్థ సెంచరీలతో పాటు సెంచరీలు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న బౌండరీలతో పాటు ఫ్లాట్ మైదానాలు ఉండటం వల్ల టీమిండియా వరుసగా విజయాలతో దూసుకు వెళ్తోందని ఫైర్ అయ్యారు. అదే విదేశీ మైదానాలలో మాత్రం ఇండియన్ క్రికెటర్లు తేలిపోయిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.

Advertisement

ఫ్లాట్, చిన్న బౌండరీలు ఉన్న మైదానాలలో ఆడుతున్న టీమిండియా జట్టులో బాబర్ ఆజం ఉండి ఉంటే ఎన్నో రికార్డులు సృష్టించేవాడని తెలిపారు. సెంచరీలు, అర్థ సెంచరీలు చేసి విరాట్ కోహ్లీ రికార్డులను కూడా బద్దలు కొట్టేవాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ జట్టులో బాబర్ ఉండి రికార్డులు సృష్టిస్తే.. పాకిస్తాన్ వాళ్లు కూడా చప్పట్లు కొట్టేవారని షాకింగ్ కామెంట్ చేశారు. బాబర్ అంతా టాలెంటెడ్ ప్లేయర్ అని కితాబిచ్చారు. ఇండియాలో 40 నుంచి 50 మీట‌ర్లే బౌండ‌రీలు గేట్లు ఉన్న త‌రుణంలోనే క‌ళ్లు మూసుకుని ఆడినా, సిక్స‌ర్లు వెళ‌తాయ‌న్నారు.

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

Related News

అన‌వ‌స‌రంగా భ‌య‌ప‌డొద్దు…టీమిండియాను ఓడించ‌డం చాలా ఈజీనే

విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

వ‌ర్షం ప‌డి, టీమిండియా వ‌ర్సెస్ పాక్ ఫైన‌ల్స్ ర‌ద్దు కావాలి

పాకిస్తాన్ క్రికెట్ లో విషాదం…130 కేజీల ఆజం ఖాన్ మృతి ?

భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

వర్షం పడకపోయింటే, టీమిండియాను చిత్తుగా ఓడించేవాళ్లం…అజ్మల్ జద్రాన్ సంచలనం !

కోహ్లీని పొగిడి పొగిడి విసుగు వచ్చేసింది…ఇకపై పాకిస్తాన్ తలవంచి దండం పెట్టాల్సిందే

దక్షిణాఫ్రికా జట్టులో చీలిక..తన్నుకున్న తెంబా బ‌వుమా, క్వింటన్ డికాక్

Big Stories

Advertisement
×