E-Paper
Advertisement

కొత్త లుక్‌లోకి Instagram.. వర్డ్‌మార్క్‌ను ఎందుకు మార్చాల్సి వచ్చిందో తెలుసా?

కొత్త లుక్‌లోకి Instagram.. వర్డ్‌మార్క్‌ను ఎందుకు మార్చాల్సి వచ్చిందో తెలుసా?
Advertisement

Instagram Wordmark Logo: ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయగానే పైన కనిపించే లోగో ఫాంట్‌ని గమనించారా? నిజానికి దాదాపు పదేళ్ల పాటు ఒకే డిజైన్‌తో నడిచిన ఆ వర్డ్‌మార్క్ (అక్షరాల శైలి)ని మెటా కంపెనీ ఇటీవల రీడిజైన్ చేసింది. కెమెరా ఐకాన్‌ను అలాగే ఉంచి, కేవలం ఫాంట్‌ను మాత్రమే హైబ్రిడ్ స్టైల్ (కర్సివ్ + నార్మల్ ప్రింట్) లోకి మార్చింది. ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆదమ్ మోస్సేరి దీన్ని ‘మరింత క్లీన్ అండ్ మోడర్న్ లుక్’ అని చెప్తున్నప్పటికీ.. నెటిజన్లకు మాత్రం r, s అక్షరాల వంపులు చూసి ఇది Instagramలా కాకుండా Instagzamలా ఉందంటూ రకరకాల మీమ్స్‌తో రచ్చ మొదలెట్టేశారు.

కొత్త లుక్ ఎలా ఉంది?

ఈ మార్పు ఇన్‌స్టాగ్రామ్ కెమెరా ఐకాన్‌కు వర్తించదు. కేవలం Instagram అని రాసే అక్షరాల స్టైల్‌ను మాత్రమే మార్చారు. అక్షరాల వంపులు, ఆకారాన్ని మరింత స్పష్టంగా, మోడర్న్‌గా తీర్చిదిద్దారు. పాత గుర్తింపును కోల్పోకుండానే.. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా క్లీన్ లుక్ ఇవ్వడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఉంది.

Advertisement

Also Read: స్మూత్ డిస్‌ప్లే, కిరాక్ లుక్.. ఆండ్రాయిడ్ 16తో Moto G Max 5G భారత్‌లోకి వచ్చేసింది!

మార్పుకు గల కారణాలు:

ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆదమ్ మోస్సేరి ఈ కొత్త లుక్ గురించి స్పందిస్తూ.. ఇది మరింత క్లీన్‌గా ఉందన్నారు. పదేళ్ల కిందటి ఇన్‌స్టాగ్రామ్‌కు, ఇప్పటి యాప్‌కు చాలా తేడా ఉంది. ఇప్పుడు కేవలం ఫొటోలు పంచుకోవడమే కాకుండా రీల్స్, స్టోరీస్, మెసేజింగ్, షాపింగ్ ఇలా ఎన్నో ఫీచర్లు వచ్చాయి. మారుతున్న వేదికకు అనుగుణంగా బ్రాండ్ ఇమేజ్‌ను కూడా అప్‌డేట్ చేయడానికే ఈ కొత్త డిజైన్ తీసుకొచ్చారు.

సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన:

Advertisement

ఏదైనా కొత్త మార్పు వచ్చినప్పుడు రకరకాల అభిప్రాయాలు రావడం సహజమే. ఈ కొత్త వర్డ్‌మార్క్‌పై కూడా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఈ కొత్త స్టైల్ బాగుందని అంటుంటే.. మరికొందరు పాతదే చదవడానికి సులభంగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కొన్ని అక్షరాల డిజైన్ వల్ల Instagram కాస్త Instagzamలా కనిపిస్తోందని మీమ్స్ వేస్తూ జోకులు పేలుస్తున్నారు.

పాత గుర్తింపుకు కొత్త మెరుగు:

ఏళ్ల తరబడి కోట్లాది మంది చూస్తున్న ఒక లోగోలో చిన్న మార్పు చేసినా అది వెంటనే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ చేసిన ఈ ప్రయత్నం బ్రాండ్‌ను పూర్తిగా మార్చడం కోసం కాదు.. ఉన్న గుర్తింపును మరింత మెరుగుపరచడం కోసమే. యూజర్లు ఈ కొత్త రూపానికి అలవాటు పడటానికి కాస్త సమయం పట్టినప్పటికీ.. ప్రస్తుతానికైతే ఈ కొత్త లుక్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో దుమ్ము లేపనున్న Poco M8x 5G.. లాంచ్‌కు ముందే లుక్స్ లీక్!

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×