E-Paper
Advertisement

సెప్టెంబర్ 1 నుంచి ఆలయాల్లో మొబైల్ ఫోన్ల నిషేధం, ప్రభుత్వం కీలక నిర్ణయం!

సెప్టెంబర్ 1 నుంచి ఆలయాల్లో మొబైల్ ఫోన్ల నిషేధం, ప్రభుత్వం కీలక నిర్ణయం!
Advertisement

Mobile Phone Ban In Temples: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల ప్రాంగణాల్లో మొబైల్ ఫోన్లు ఉపయోగించడాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. తాజాగా హిందూ మత, ధార్మిక దానాల శాఖ మంత్రి ఎస్. రమేష్  ఈ అంశానికి సంబంధించి ప్రకటన చేశారు. ఆలయాల్లో ప్రశాంత వాతావరణాన్ని కాపాడటంతో పాటు గర్భగుడి పవిత్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు  వివరించారు.

మొబైల్ ఫోన్లకు ప్రత్యేక డిపాజిట్ కౌంటర్లు

మొబైల్ నిషేధాన్ని అమలు చేసేందుకు ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. భక్తులు ఆలయానికి వచ్చినప్పుడు తమ మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 1 నాటికి ఈ కౌంటర్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంతో భక్తులు మొబైల్ ఫోన్‌ను ఆలయంలోకి తీసుకెళ్లకుండా, సురక్షితంగా డిపాజిట్ చేసి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.

గర్భగుడిలో వీడియోలపై ఆందోళన

Advertisement

ఆలయాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం విధించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి గర్భగుడిలో వీడియోలు, ఫొటోలు తీయడం. ఇటీవల కాలంలో ఆలయ గర్భగుడుల్లో మొబైల్ ఫోన్లతో చిత్రీకరించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. దీంతో ఆలయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై భక్తులు, ఆలయ నిర్వాహకుల్లో ఆందోళన పెరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

ఆలయ ఆస్తులపై కూడా ప్రత్యేక దృష్టి

ఆలయాల్లో మొబైల్ నిషేధంతో పాటు దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల పరిరక్షణపై కూడా దేవాదాయ శాఖ దృష్టి పెట్టింది. ఆలయాలకు చెందిన భూములు, ఇతర ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు వాటిని ఏ ప్రయోజనం కోసం కేటాయించారో అదే విధంగా ఉపయోగిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి చెప్పారు. మధురై మీనాక్షి అమ్మన్ ఆలయానికి సంబంధించిన ట్రస్ట్ ఆస్తుల విషయంలో జరిగినట్లు చెబుతున్న అక్రమ రిజిస్ట్రేషన్‌పై కూడా చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

19 మందిపై కేసు నమోదు

Advertisement

ట్రస్ట్‌ కు చెందిన ఆస్తులను అక్రమంగా రిజిస్టర్ చేశారనే ఆరోపణలకు సంబంధించి దేవాదాయ ఫిర్యాదు మేరకు 19 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కేసులో కొంతమంది నిందితులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆలయ ఆస్తులను రక్షించడం, వాటిని సరైన విధంగా వినియోగించేలా చూడటం తమ శాఖ ప్రధాన లక్ష్యాల్లో ఒకటన్నారు.

ఆలయాల పునరుద్ధరణ పనులు వేగవంతం

రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో కొనసాగుతున్న ‘తిరుపణి’ పునరుద్ధరణ పనులను కూడా వేగవంతం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆలయాల అభివృద్ధి, మరమ్మతులు, పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఆలయాల్లో నిర్వహించనున్న కుంభాభిషేకాల వివరాలను ప్రభుత్వం వెల్లడించనుంది. అలాగే కొత్త పునరుద్ధరణ ప్రాజెక్టులు, శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంఖ్య, ఆలయ రథాలు, చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళికలను కూడా ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాలతో ఆలయాల పవిత్రతను కాపాడటంతో పాటు వాటి ఆస్తులు, పురాతన నిర్మాణాలను సంరక్షించేందుకు ప్రభుత్వం మరింత దృష్టి పెట్టనున్నట్లు మంత్రి వివరించారు.

Read Also: హైదరాబాద్ ప్రజలకు రైల్వే గుడ్ న్యూస్, హైటెక్ సిటీలో ఆ రైళ్లకు హాల్టింగ్!

Tags

Related News

రూ.17 వేల నుంచే వైల్డ్‌ లైఫ్ టూర్.. ఈ 3 ప్లేసులు మిస్ అవ్వొద్దు!

వందే భారత్ స్లీపర్ vs రాజధాని.. ఫుడ్ ఏ రైల్లో బాగుంటుంది?

రైలు పట్టాల కింద రాళ్లు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఊహించడానికే భయంగా ఉంది బాబోయ్!

సైట్ ఓపెన్ చేస్తే సర్వర్ డౌన్.. క్షణాల్లో మాయమవుతున్న రైల్వే టికెట్లు!

రైలు ప్రయాణికులకు అలర్ట్.. టికెట్‌ ఉన్నా జరిమానా తప్పదు.. ఎందుకంటే?

రైల్వే ట్రాక్‌ లపై డ్రోన్లతో నిఘా.. ప్రయాణాలకు ఇబ్బంది లేకుండానే తనిఖీలు!

వెయిటింగ్ లిస్ట్ ఉన్నా టెన్షన్ వద్దు.. చార్ట్ తర్వాత కూడా రైలు టికెట్ ఇలా బుక్ చేసుకోవచ్చు!

పగిలిన అద్దాలు.. కంపుకొట్టే టాయిలెట్లు.. బాబోయ్.. ఇది వందేభారత్ రైలా?

Big Stories

Advertisement
×