E-Paper
Advertisement

తిరుమల భక్తులకు అలర్ట్.. మంగళవారం శ్రీవారి సేవా టికెట్లు విడుదల, నవంబర్ కోటా

తిరుమల భక్తులకు అలర్ట్.. మంగళవారం శ్రీవారి సేవా టికెట్లు విడుదల, నవంబర్ కోటా
Advertisement

Tirumala News: తిరుమల భక్తులకు అలర్ట్. నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి సేవ, దర్శన టికెట్లను ఈనెల 18న విడుదల చేయనుంది టీటీడీ. ఎందుకంటే నవంబర్ నెల పవిత్రమైన కార్తీక‌మాసం కావడంతో శివుడితోపాటు వెంకటేశ్వరుడి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, దీనికి సంబంధించిన అన్నివివరాలు మరోసారి చెక్ చేసుకోంది. టికెట్లు విడుదలకు కొద్ది గంటలు మాత్రమే మిగిలివుంది.

 

తిరుమల భక్తులకు అలర్ట్

Advertisement

తిరుమల వెంకటేశ్వరుని దర్శనమంటే చెప్పనక్కర్లేదు. ఏడాదిలో ఒక్కసారైన స్వామి కొండకు రావాలని భక్తులు తరిస్తుంటారు. కానీ కాలం మాత్రం కలిసిరాదు. ఆయన దర్శనం చేసుకుంటే కష్టాలు, పాపాలకు విముక్తి అవుతామని భావిస్తుంటారు. మరికొందరైతే స్వామిని ఎప్పటికప్పుడు దర్శించుకునేందుకు పోటీ పడుతుంటారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల గురించి భక్తులు ఎదురుచూస్తుంటారు. అందులో సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలు కీలకమైనవి. మూడు నెలల ముందు ఆయా టికెట్లను విడుదల చేస్తుంది టీటీడీ.

నవంబర్ నెల సేవా టికెట్ల కోటా విడుదల

నవంబర్‌ నెల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న అంటే మంగళవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ. సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈనెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో భక్తులు నమోదు చేసుకోవచ్చు. ఎంపికైన భక్తులు 20-22వ మధ్య మధ్యాహ్నం లోపు డబ్బులు చెల్లించి లక్కీ డిప్ టికెట్లు పొందాలి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను ఈనెల 21 ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. అందులో వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనుంది.

Advertisement

 

మంగళవారం శ్రీవారి సేవా టికెట్లు విడుదల

24న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన కోటా టికెట్లు ఇవ్వనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రవేశ దర్శన టోకెన్ల కోటా విడుదల చేస్తుంది. 25న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ. 300 టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి, తలకోన ప్రాంతాల్లో అద్దె గదుల బుకింగ్ కోటాను విడుదల కానుంది. అయితే ఈ టికెట్లు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలి. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది.

ALSO READ: భోగాపురం ఎయిర్‌పోర్టు.. అర్ధరాత్రి నుంచి విమానాల రాకపోకలు, బస్సుల ఛార్జీల మాటేంటి?

Related News

ఏపీలో లక్షన్నర కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్, శంకుస్థాపనకు ప్రధాని

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?

ప్రపంచ నగరాలకు ధీటుగా.. అమరావతికి మహర్దశ, కొత్త రైల్వే లైన్ కోసం టెండర్లు ఆహ్వానం

Big Stories

Advertisement
×