Rohit Sharma: గత కొన్ని రోజులుగా టీమిండియాలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గంభీర్ కోచ్ గా నియామకం అయిన నుంచి టీమిండియా దారుణ ఓటములు ఎదురుచూసింది. అయితే.. ఇలాంటి నేపథ్యంలో… టీమిండియా సీనియర్లు రంజీ మ్యాచ్ లు ఆడుతున్నారు. అయితే.. ఇక్కడ మరో వివాదం తెరపైకి వచ్చింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma), శ్రేయస్ అయ్యర్ లపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రంజి క్రికెట్ లో వారిద్దరి ప్రదర్శనపై కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు. సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్లపై రోహిత్ శర్మ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Also Read: Dimuth Karunaratne: చాంపియన్స్ ట్రోఫీకి కంటే ముందే శ్రీలంకకు షాక్.. స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్..!
నిజానికి రోహిత్ శర్మ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పుడు దేశవాలి క్రికెట్ లోను రాణించలేకపోతున్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా రోహిత్ బాటలోనే పయనిస్తున్నాడు. రోహిత్ రెండు ఇన్నింగ్స్ లో 328 పరుగులు చెయగా…శ్రేయస్ రెండు ఇన్నింగ్స్ లలో 1117 పరుగులు చేశాడు. జమ్మూ కాశ్మీర్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పైన ఎటాకింగ్ చేయాలని రోహిత్ శ్రేయస్ ల నిర్ణయాన్ని గవాస్కర్ తీవ్రంగా తప్పుపట్టాడు. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు శార్దూల్ ఠాకూర్ తనుష్ కోటియన్ లను చూసి నేర్చుకోవాలని హెచ్చరించాడు. పైగా టెస్టుల్లో దూకుడు అసలు పనికిరాదని, ఇలా టెస్టుల్లో దూకుడుగా ఆడడం ద్వారా భవిష్యత్తులో టెస్ట్ క్రికెట్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళనను వ్యక్తం చేశాడు.
టెక్నిక్ తో షాట్లు కొట్టాలి. అంతేకానీ ప్రతి బంతిని బౌండరీకి తరలించాలని అనుకోకూడదని ఇద్దరికీ చురకలు అంటించాడు. వారి ఆటను చూస్తే దేశవాలిలో ఆడేందుకు ఇష్టపడినట్టుగా అనిపించలేదని ఇష్టపడలేదని బీసీసీఐ కాంట్రాక్ట్ నుంచి తప్పిస్తుందనే భయంతో రంజి ఆడినట్లుగా కనిపిస్తోంది. గతంలో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు నిరాకరించిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించిన విషయం తెలిసిందే.
Also Read: IND Vs ENG ODI 2025: వన్డే సిరీస్ టైమింగ్స్.. ఉచితంగా ఎలా,ఎక్కడ చూడాలంటే..?
ఈ నేపథ్యంలోనే రోహిత్, యశస్వి జైస్వాల్ తమ సెంట్రల్ కాంటాక్ట్ ను కోల్పోకుండా ఉండేందుకు ఆడినట్లుగా కనిపిస్తుందని అన్నారు గవాస్కర్. అయితే ఇదే వ్యాఖ్యలపై రోహిత్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. తనను కించపరిచేలా విమర్శించడాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నాడు. దీంతో బీసీసీఐకు గవాస్కర్ అంతగా విమర్శించాల్సిన అవసరం లేదని, గవాస్కర్ కామెంట్స్ కారణంగా మరింత ఒత్తిడికి గురైనట్లు రోహిత్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు బీసీసీఐలో పనిచేసే ఓ అధికారి వెల్లడించాడు. మరి ఈ వివాదం ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి. ఇది ఇలా ఉండగా..ఇంగ్లాండ్ పైన 5 టీ 20ల సిరీస్ ను టీమిండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మూడు వన్డేల సిరీస్ లో భాగంగా… ఇంగ్లాండ్ తో తలపడనుంది టీమిండియా.