E-Paper
Advertisement

iPhone 16e Discount: సూపర్ డీల్.. ఐఫోన్ 16e ధరపై రూ.10000 తగ్గింపు.. త్వరపడండి లిమిటెడ్ ఆఫర్

iPhone 16e Discount: సూపర్ డీల్.. ఐఫోన్ 16e ధరపై రూ.10000 తగ్గింపు.. త్వరపడండి లిమిటెడ్ ఆఫర్
Advertisement

iPhone 16e Discount| అపిల్ కంపెనీ ఫిబ్రవరి 2025లో బడ్జెట్ ఫ్రెండ్లీ iPhone 16eని లాంచ్ చేసింది. తక్కువ ధరలో ఐఫోన్ కావాల్సిన కస్టమర్లకు ఈ మోడల్‌ని ప్రత్యేకంగా రూపొందించారు. ఇప్పుడు ఈ ఫోన్ భారీ ధర తప్పింపుతో అందుబాటులోకి వచ్చింది. అమెజాన్‌లో స్పెషల్ ప్రమోషన్ జరుగుతోంది. ఈ సేల్‌లో మీరు పెద్ద మొత్తంలో సేవింగ్స్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ వల్ల ఐఫోన్ 16e అందరికీ సులభంగా అందుబాటులోకి వచ్చింది.

ధర తగ్గింపు వివరాలు

ఐఫోన్ 16e 128GB మోడల్ ఫిబ్రవరిలో రూ.59,900కి విడుదల అయింది. ఇప్పుడు అమెజాన్‌లో దీని లిస్టెడ్ ప్రైస్ రూ.51,499. ఇది నేరుగా లభించే డిస్కౌంట్. మరిన్ని బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. SBI క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే అదనంగా రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు. ICICI బ్యాంక్ కార్డ్‌లతో కూడా ఈ బెనిఫిట్‌ని పొందగలం. IDFC ఫస్ట్ బ్యాంక్ కార్డ్‌లు కూడా అర్హత కలిగి ఉన్నాయి.
అన్ని డిస్కౌంట్ల తర్వాత ఫైనల్ ప్రైస్ రూ.49,499 అవుతుంది. ఇది కొత్త ఐఫోన్‌కి అద్భుతమైన డీల్. మరిన్ని సేవింగ్స్ కోసం ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ ఇన్ చేయవచ్చు. మీ పాత ఫోన్ కండిషన్ బట్టి రూ.47,700 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

డిస్‌ప్లే

Advertisement

డిస్‌ప్లే గురించి చెప్పాలంటే.. 6.1 అంగుళాల OLED స్క్రీన్ ఉంది. ఇది సూపర్ రెటినా XDR డిస్‌ప్లే. కలర్స్ చాలా రియలిస్టిక్‌గా కనిపిస్తాయి. రెజల్యూషన్ 2532×1170 పిక్సెల్స్ – టెక్స్ట్, ఇమేజెస్ చాలా షార్ప్‌గా ఉంటాయి. 60Hz రిఫ్రెష్ రేట్ ఉంది. బయట ఉన్నప్పుడు కూడా మంచి విజిబిలిటీ కోసం 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది.

పర్ఫామెన్స్

పర్ఫామెన్స్, డ్యూరబిలిటీలో ఐఫోన్ 16e అద్భుతం. A18 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. డైలీ టాస్క్‌లు సులభంగా హ్యాండిల్ చేయగలం. లేటెస్ట్ iOS 18.3 వెర్షన్‌తో వస్తుంది. అపిల్, అన్ని కరెంట్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లు ఉన్నాయి. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్. ఫేస్ IDతో ఫాస్ట్, సెక్యూర్ అన్‌లాకింగ్ ఫీచర్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.

కెమెరా

Advertisement

కెమెరా సిస్టమ్ గురించి చెప్పాలంటే.. రియర్‌లో (వెనుకభాగం) ఒకే 48MP కెమెరా ఉంది. F1.6 లెన్స్‌తో మంచి లైట్ కెపాబిలిటీ. అల్ట్రా-వైడ్ యాంగిల్ ఫీచర్ కూడా ఉంది. గ్రూప్ ఫోటోలు, ల్యాండ్‌స్కేప్ షాట్‌లకు బాగా ఉపయోగపడుతుంది. ఫ్రంట్ కెమెరా 12MP, F1.9 లెన్స్‌తో సెల్ఫీలు, వీడియో కాల్స్ చేయడానికి సూపర్.

డిజైన్

డిజైన్ చూస్తే.. స్లీక్, మోడరన్ లుక్. సైజు 146.7mm లెంగ్త్, 71.5mm వెడల్పు ఉంటుంది. చేతిలో పట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. థిక్‌నెస్ 7.8mm, వెయిట్ 167 గ్రాములు. పాకెట్‌లో కూడా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంది.

కనెక్టివిటీ ఫీచర్స్

కనెక్టివిటీలో మోడరన్ 5G నెట్‌వర్క్‌లు సపోర్ట్ చేస్తుంది. స్ట్రీమింగ్‌కి ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్స్. డ్యూయల్ SIM సపోర్ట్‌తో ఫ్లెక్సిబిలిటీ. Wi-Fi, బ్లూటూత్ స్టాండర్డ్. USB టైప్-C పోర్ట్‌తో ఛార్జింగ్, డేటా ట్రాన్స్‌ఫర్. GPSతో మంచి నావిగేషన్ సర్వీసెస్ ఫీచర్స్ ఉన్నాయి.

బ్యాటరీ

బ్యాటరీ లైఫ్ కూడా బాగుంది. 4005mAhతో ఒక రోజు పూర్తిగా ఉపయోగించవచ్చు. వీడియో ప్లేబ్యాక్ 26 గంటల వరకు ఉంటుంది. ఇది iPhone 16eకి బెస్ట్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. మొత్తంగా, ఈ డీల్‌తో iPhone 16e బడ్జెట్ ఐఫోన్‌లో టాప్ చాయిస్. త్వరగా కొనుగోలు చేయండి, ఆఫర్ మిస్ కాకండి!

Also Read:  గూగుల్ కొత్త టివి రిమోట్.. బ్యాటరీలు అవసరం లేదు, జీవితకాలం చార్జింగ్‌లోనే ఉంటుంది

Related News

రూ.28వేలకే.. 55 ఇంచుల స్మార్ట్ టీవీ! ఆఫర్ అంటే ఇలా ఉండాలి

మార్కెట్‌లోకి కొత్త మోడల్ ఇయర్‌బడ్స్..ఇది నిజంగా సూపర్!

రూ.5,899 ధరకే.. 24 ఇంచుల థామ్సన్ టీవీ!

వైఫై కనెక్టివిటీతో పనిచేసే సీసీ కెమెరా.. కొత్త వాళ్లు కనిపిస్తే ఫోన్‌కు అలర్ట్

స్టైలిష్ లుక్, పవర్ ఫుల్ సౌండ్..ఏంటీ తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లా ?

iPhone 17 దూసుకెళ్తుంటే.. 17e మాత్రం టాప్-5లో లేదు, అసలు కారణం ఇదే!

ప్రొజెక్టర్ డిస్‌ప్లే మసకగా ఉందా? ఈ 4 మార్పులు చేస్తే సినిమా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పక్కా!

మార్కెట్‌లో దుమ్ము రేపుతున్న స్మార్ట్ వాచ్..యూత్‌కు పర్ఫెక్ట్

Big Stories

Advertisement
×