E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ వర్కౌట్.. మనోజ్ కు షాక్.. ప్రభావతి దొరికిపోతుందా..?

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ వర్కౌట్.. మనోజ్ కు షాక్.. ప్రభావతి దొరికిపోతుందా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. సత్యం మౌనిక ఎలా ఉందొ అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ప్రభావతి ఒకసారి మౌనికకి ఫోన్ చేయమని చెప్తుంది. సంజయ్ మౌనికకు ఫోన్ రావడం చూసి నువ్వు ఎప్పుడూ ఫోన్ కూడా మాట్లాడకూడదు అని కండిషన్ పెడతాడు. అప్పుడే వాళ్ళ నాన్న ఫోన్ చేయడంతో ఆ ఫోన్ కట్ చేయకండి నేను మాట్లాడుతాను అని కూల్ గా మాట్లాడుతుంది… బాలు కోసం మీనా కిందకు దిగి వస్తుంది. పైనా పక్కేసి పెట్టాను కానీ మీరు ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతుంది.. నేను నిజంగానే తప్పు చేసానా మీనా అని అడుగుతాడు..మౌనికను అలా మాట్లాడే లోపల నాకు చాలా కోపం వచ్చింది.. నా మాటలకి నాకు కోపం ఎక్కువయ్యి కొట్టాను అని బాలు అంటాడు. మొత్తానికి ఈ గొడవ కాస్త ప్రభావతి ఆజ్యం పోయడంతో పెరుగుతుంది మళ్లీ సత్యం దాన్ని కూల్ చేసేస్తాడు.. మీనా మాత్రం ఆ నగలను దొంగతనం చేసింది ఎవరు అని తెలుసుకునే ప్రయత్నంలో ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మౌనిక విషయం గురించి బాధపడుతున్న బాలుని మీనా ఓదారుస్తుంది. వాడన్న మాటలకి మీరు కొట్టారు అంతేకానీ మీకు వాడి మీద ప్రత్యేకమైన పగ అయితే లేదు కదా అనేసి అంటుంది.. ఈ విషయం పక్కనపెడితే నగల గురించి ఏమనుకుంటున్నారు అని మీనా అడుగుతుంది.. ఇక నగలను ఎవరు దొంగతనం చేశారో తెలుసుకోవాలని బాలు చాలానే ప్రయత్నాలు చేస్తాడు. బాలు అనుమానమే నిజమవుతుంది.. మనోజ్ ఈ నగలని కొట్టేసాడని తెలుసుకుంటాడు.. ఎలాగైనా సరే ఈ నిజాన్ని వాడి నోటితోనే బయటకు రప్పించాలని అనుకుంటాడు.. దానికోసం నా దగ్గర అదిరిపోయే ప్లాన్ ఉందని అనుకుంటాడు..

Advertisement

మీనా చెప్పినట్టు బాబా ప్లాన్ ని బాలునే అమలు చేస్తాడు.. పకీరు దగ్గరికి వెళ్లి పూజించిన నిమ్మకాయ అన్నట్లుగా అంతా మేనేజ్ చేసుకుని బాలు లోపలికి తీసుకొని వస్తాడు. ఈ సీరియల్ ఎపిసోడ్ కి ఇదే హైలెట్.. ఆ నిమ్మకాయని ఎవరు నగలను దొంగతనం చేసారో వాళ్ళ కాళ్లు చేతులు పడిపోయేలా చేస్తుంది అని ఇంట్లోని వాళ్ళందరిని నమ్మిస్తాడు. మనోజ్ ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటారు.. నిజంగానే ఈ నిమ్మకాయకి అంత పవర్ ఉందా ఖచ్చితంగా వాడు చెప్పినట్లు అన్ని జరుగుతాయని మనోజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు.

అటు ప్రభావతి కూడా వామ్మో వీడు నిజంగానే ఏదో ఒకటి చేసేలా ఉన్నాడు అని కంగారు పడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కంగారు పడడం చూసిన బాలు కచ్చితంగా నగలదొంగ ఇవాళ బయట పడిపోతాడని అనుకుంటాడు. ఈ నిమ్మకాయని రాత్రి మన ఇంట్లో పెడితే కచ్చితంగా పొద్దని కల్లా దొంగ కాళ్లు చేతులు పడిపోతాయట ఇక జీవితంలో నడవలేడట అని అంటాడు. ముందా నిమ్మకాయ తీసి బయటపడింది ఏంటి ఇవన్నీ ఇంట్లో అనేసీ బాలుని అడుగుతాడు. అయితే మనోజు నువ్వు ఏం తప్పు చేయలేదు కదా నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావ్ అనేసి బాలు అడుగుతాడు. నేనెందుకు కంగారు పడతాను ఈ పిచ్చి పిచ్చిగా ఇవన్నీ తెచ్చి ఇంట్లో పెడితే ఎవరికైనా భయం ఉండదా అనేసి అంటాడు..

Advertisement

మీనా ఏంటండి ఇదంతా మీరు నిజంగానే ఆ నిమ్మకాయని పకీర్ దగ్గర తీసుకొచ్చారా అని అడుగుతుంది. ఫకీర్ దగ్గర పాడా నేనే వరి చేత నిజం కక్కించాలని ఇలా చేశాను. వాడి ఫ్రెండ్ ని అడిగాను కానీ వాడు నేను మనోజ్ కి డబ్బులు ఇవ్వలేదు అని చెప్పాడు. కచ్చితంగా ఇక మనోజ్ నగల నమ్మేసే డబ్బులు తెచ్చాడు ఆ నిజాన్ని రేపటితో బయట పెట్టేస్తాను అని బాలు అంటాడు.. ఏంటో అర్థం కావట్లేదు అండి రేపు ఏం జరుగుతుందో చూద్దాం అనేసి నేను అంటుంది.

Also Read :మొన్న అభిమానిపై బాలయ్య అందుకే సీరియస్ అయ్యాడా? అసలు నిజం ఇది..

అయితే మనోజు ప్రభావతి ఇద్దరు కూడా వాళ్ళిద్దరికీ కాళ్లు చేతులు పడిపోయాయని కలగంటాడు. దొంగలు ఎవరో దొరికిపోయారని మనోజ్ వచ్చి వాళ్ళని చూసి హేళన చేస్తాడు. ప్రభావతి కాళ్లు చేతులు పడిపోవడం చూసి బాలు సెటైర్లు వేస్తాడు. ప్రతిరోజు ఇంట్లో ఏ పని చేయకపోయినా అటు ఇటు తిరుగుతూ అడ్డంగా ఉండే దానివి ఇప్పుడు నీకే ఒక సాయం చేసి తోస్తే గాని లేవలేక ఉన్నావా అని అంటాడు.. అటు మనోజ్ కూడా వీల్ చైర్ మీద కనిపించడం ఎపిసోడ్ కి హైలైట్ గాని నిలుస్తుంది. చూస్తుంటే ఇదంతా ఎవరో ఒకరు కలగన్నట్లు తెలుస్తుంది. నిజా నిజాలు ఏంటో రానున్న ఎపిసోడ్లో తెలుసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడితో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ లోకి అడుగుపెట్టిన 16 మంది కంటెస్టెంట్స్ వీళ్లే!

గూగుల్ చేస్తే బిగ్ బాస్ నరేష్ అని రావాలి… కప్పు కొట్టే బయటకు వెళ్తా: పొట్టి నరేష్

డిగ్రీలో 5 సబ్జెక్టులు ఫెయిల్.. సింగపూర్ లో హౌస్ కీపింగ్ జాబ్.. . సుధీర్ రెడ్డి స్టోరీ ఇదే!

టికెట్ గెలుచుకొని వచ్చా.. కప్పు తీసుకొని పోతా.. మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఝాన్సీ!

ఇక ఆట షూర్.. బిగ్ బాస్ 10 హౌస్ లోకి అడుగు పెట్టిన ఫస్ట్ కంటెస్టెంట్!

అదిరిపోయిన బిగ్ బాస్ 10 హౌస్.. మ్యాజిక్ కీతో ఆటను మలుపు తిప్పిన నాగార్జున!

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

Big Stories

Advertisement
×