E-Paper
Advertisement

BE 07 TO విజన్ T.. మహీంద్రా నుంచి రాబోతున్న పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

BE 07 TO విజన్ T.. మహీంద్రా నుంచి రాబోతున్న పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!
Advertisement

Mahindra Electric SUVs: భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో మహీంద్రా మరింత దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే బోర్న్ ఎలక్ట్రిక్ SUVలతో మంచి స్పందన పొందుతున్న కంపెనీ.. రాబోయే రోజుల్లో మరిన్ని మోడళ్లను తీసుకురావాలని చూస్తోంది. ఇందులో భాగంగా 2027-28 నాటికి భారత మార్కెట్లో రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలను విడుదల చేసే అవకాశం ఉంది. వీటిలో ఒకటి BE 07 కాగా, మరో SUV విజన్ T కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతోంది. రెండు మోడళ్లు ప్రస్తుతం పరీక్షలు జరుపుకుంటున్నాయి.

BE 07.. ఫ్యామిలీ SUVగా

మహీంద్రా BE 07 కంపెనీ బోర్న్ ఎలక్ట్రిక్ శ్రేణిలో మరో కీలక మోడల్ కానుంది. ఇది మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ SUVగా మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే ఈ వాహనం భారత రోడ్లపై పలుమార్లు టెస్టింగ్‌లో కనిపించింది. BE 07ను మహీంద్రా తన INGLO స్కేట్‌బోర్డ్ ఆర్కిటెక్చర్‌పై అభివృద్ధి చేస్తోంది. BE 06లో కనిపించే కూపే తరహా డిజైన్‌కు భిన్నంగా, BE 07లో సంప్రదాయ ఫ్యామిలీ SUV లక్ ను చూడొచ్చు. 2,775 మిల్లీమీటర్ల వీల్‌బేస్ ఉండటంతో క్యాబిన్‌లో మంచి స్థలం లభించే అవకాశం ఉంది.

టెక్నాలజీకి పెద్దపీట!

Advertisement

BE 07లో ఫీచర్లకు కూడా మహీంద్రా ప్రాధాన్యం ఇవ్వనుంది. పనోరమిక్ సన్‌రూఫ్, ADAS, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఫ్రేమ్‌లెస్ డోర్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. క్యాబిన్‌లో మూడు 12.3 అంగుళాల స్క్రీన్లతో కూడిన డ్యాష్‌బోర్డ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవొచ్చు. ఇందులో సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, కో డ్రైవర్ కోసం ప్రత్యేక ఎంటర్‌ టైన్‌మెంట్ స్క్రీన్ ఉండనున్నాయి.

500 కిలోమీటర్ల వరకు రేంజ్?

BE 07లో 59 kWh, 70 kWh, 79 kWh బ్యాటరీ ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది. వెనుక యాక్సిల్‌పై ఎలక్ట్రిక్ మోటార్‌తో పాటు, అధిక వేరియంట్లలో డ్యూయల్ మోటార్ AWD సెటప్‌ను కూడా కంపెనీ తీసుకురావచ్చని తెలుస్తోంది. పెద్ద బ్యాటరీతో వచ్చే వేరియంట్ వాస్తవ వినియోగంలో సుమారు 500 కిలోమీటర్ల రేంజ్ అందించే అవకాశం ఉంది. 79 kWh బ్యాటరీని 175 kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో 10 నుంచి 80 శాతం వరకు సుమారు 30 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చని తెలుస్తోంది.

విజన్ T.. ఎలక్ట్రిక్ థార్‌కు టీజర్ గా!  

Advertisement

మహీంద్రా మరోవైపు విజన్ T కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్న ఎలక్ట్రిక్ SUVని కూడా పరీక్షిస్తోంది. ఈ మోడల్‌ను థార్ ఎలక్ట్రిక్‌కు ముందస్తు లుక్ గా భావిస్తున్నారు. అయితే దీని పేరు, పూర్తి స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ SUV కోసం మహీంద్రా కొత్త NU_IQ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించనుంది. ఇదే ఆర్కిటెక్చర్‌పై భవిష్యత్తులో మరిన్ని మోడళ్లను అభివృద్ధి చేసే అవకాశం ఉంది.  విజన్ T ఆధారిత ఎలక్ట్రిక్ SUVలో థార్‌కు ఉన్న ఆఫ్‌రోడ్ DNA కనిపించే అవకాశం ఉంది. బాక్సీ డిజైన్, స్క్వేర్డ్ వీల్ ఆర్చ్‌లు, పెద్ద ఆల్ టెర్రైన్ టైర్లు, బయట కనిపించే డోర్ హింజ్‌లు, ప్రత్యేకమైన బోనెట్ లాచెస్ వంటి అంశాలు ఇందులో ఉండొచ్చు. క్యాబిన్‌లో ఆధునిక డిస్‌ప్లేలు, పెద్ద టచ్‌స్క్రీన్‌ తో పాటు ముఖ్యమైన ఫంక్షన్ల కోసం ఫిజికల్ బటన్లను కూడా అందించే అవకాశం ఉంది. అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ఫోర్ వీల్ డ్రైవ్ సామర్థ్యాలు కూడా ఈ SUV ప్రత్యేకతగా నిలిచే అవకాశం ఉంది.

Read Also: హోండా కార్లపై అక్టోబర్‌ లో అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.2.34 లక్షల తగ్గింపు!

Tags

Related News

హోండా కార్లపై అక్టోబర్‌ లో అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.2.34 లక్షల తగ్గింపు!

మారుతి స్విఫ్ట్‌ లో కొత్త టర్బో ఇంజిన్.. కళ్లు చెదిరే పవర్‌ తో మార్కెట్ లోకి ఎంట్రీ!

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మైలేజీతో పాటు ఇవి కూడా చెక్ చేయండి!

Big Stories

Advertisement
×