Best Earbuds Under 7000: పండగ సీజన్ మొదలైందంటే చాలు.. కొత్త గ్యాడ్జెట్లపై ఆఫర్ల కోసం టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా మంచి సౌండ్, అదిరిపోయే బేస్, ANC వంటి ఫీచర్లతో వచ్చే ఇయర్‌బడ్స్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవాలని చాలామంది చూస్తుంటారు. అలాంటి వారికి ఈసారి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో మంచి ఆప్షన్స్ అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ 8 నుంచి Amazon Great Indian Festival, అక్టోబర్ 9 నుంచి Flipkart Big Billion Days ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రూ.7,000 లోపు బడ్జెట్‌లోనే OnePlus, Samsung, JBL, Nothing, Sony వంటి బ్రాండ్ల నుంచి అదిరిపోయే ఫీచర్లతో ఇయర్‌బడ్స్ లభిస్తున్నాయి. మరి ఈ సేల్‌లో మీ బడ్జెట్‌కు తగ్గ బెస్ట్ బడ్స్ ఏవో చూద్దామా..
మీరు గనుక హెవీ బేస్, స్పష్టమైన సౌండ్ కోరుకుంటే వన్‌ప్లస్ బడ్స్ 4 మంచి ఎంపిక. ఇందులో 55dB వరకు నాయిస్ క్యాన్సిలేషన్, తక్కువ లాటెన్సీ గేమింగ్ మోడ్ ఇచ్చారు. సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 45 గంటల ప్లేబ్యాక్ టైమ్ లభిస్తుంది. ప్రస్తుతం సేల్‌లో దీని ధర రూ.5,999గా ఉంది.
తక్కువ బడ్జెట్‌లో శాంసంగ్ బ్రాండ్ ఇయర్ బడ్స్ కావాలనుకునే వారికి ఇదొక క్రేజీ డీల్. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, గెలాక్సీ ఏఐ అనువాద ఫీచర్ కూడా ఉంది. ఎంఆర్‌పీ రూ.9,999 ఉన్న ఈ బడ్స్ సేల్‌లో కేవలం రూ.3,399కే అందుబాటులో ఉన్నాయి.
Also Read: వంటగదిలో వినోదం మిస్ అవ్వక్కర్లేదు.. పాత గూగుల్ హోమ్ డిస్‌ప్లే ఉంటే ఇలా వాడేయండి!
సౌండ్ పరంగా జేబీఎల్ ఇచ్చే క్వాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బడ్స్‌లో 6 మైక్రోఫోన్లు, టాక్‌త్రూ ఫీచర్, దాదాపు 48 గంటల బ్యాటరీ లైఫ్ లభిస్తాయి. పాటలు వినడానికి, కాల్స్ మాట్లాడటానికి ఇవి సరిపోతాయి. సేల్‌లో దీని ధర రూ.4,999 మాత్రమే.
ట్రెండీ లుక్, యూనిక్ డిజైన్ కావాలనుకునే యూత్ నథింగ్ ఇయర్ ఏ వైపు చూడవచ్చు. ఇందులో LDAC సపోర్ట్, 45dB వరకు ANC, ఇంకా చాట్ జీపీటీ సపోర్ట్ కూడా ఉంది. కేస్ బ్యాటరీతో కలిపి 42.5 గంటల వరకు పనిచేస్తాయి. సేల్‌లో వీటిని రూ.5,999కి సొంతం చేసుకోవచ్చు.
సౌండ్ స్పష్టత విషయంలో సోనీ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఈ బడ్స్‌లో ఉన్న DSEE టెక్నాలజీ వల్ల పాటలు చాలా క్లియర్‌గా వినిపిస్తాయి. 22 గంటల బ్యాటరీ లైఫ్, రెండు డివైజ్‌లకు కనెక్ట్ అయ్యే సదుపాయం ఇందులో ఉంది. సేల్ సమయంలో దీని ధర రూ.5,990గా ఉంది. బ్యాంక్ డిస్కౌంట్లు, కూపన్లు ఉపయోగిస్తే.. ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి.. మీ బడ్జెట్, అవసరానికి తగిన ఇయర్ బడ్స్ ఎంచుకుని సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.
Also Read: యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?