E-Paper
Advertisement

ఐఫోన్ వీడియోల్లో బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ కంట్రోల్ చేయొచ్చు.. ఈ ఫీచర్ గురించి తెలుసా?

ఐఫోన్ వీడియోల్లో బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ కంట్రోల్ చేయొచ్చు.. ఈ ఫీచర్ గురించి తెలుసా?
Advertisement

iPhone Audio Mix Feature: స్మార్ట్‌ఫోన్‌తో వీడియోలు తీయడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ లేదా స్నేహితులతో గడిపిన మధుర క్షణాలు.. ఏది రికార్డ్ చేసినా వీడియో క్లియర్‌గా ఉంటే సరిపోదు, ఆడియో కూడా అంతే క్లియర్‌గా ఉండాలి. కానీ చుట్టూ ఉండే వాహనాల శబ్దాలు, జనాల హోరు, ఇతర బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వల్ల మన వాయిస్ సరిగ్గా వినిపించక వీడియో అనుభవమే దెబ్బతింటుంది. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టే ఉపయోగకరమైన ఫీచర్ ఐఫోన్‌లో ఉందని మీకు తెలుసా?

ఐఫోన్ 16, ఆ తర్వాతి కొన్ని మోడళ్లలో అందుబాటులో ఉన్న Audio Mix ఫీచర్‌తో వీడియో రికార్డ్ చేసిన తర్వాత కూడా ఆడియోను మీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. అసలు ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను ఎలా తగ్గించుకోవచ్చు? మీ వీడియోల్లో వాయిస్‌ను మరింత స్పష్టంగా వినిపించాలంటే ఏ సెట్టింగ్స్ ఉపయోగించాలి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆడియో మిక్స్ ఆప్షన్..

Advertisement

ఈ సీక్రెట్ ఫీచర్ పేరు ‘ఆడియో మిక్స్’. మీరు ఐఫోన్ ఫోటోస్ యాప్‌లోకి వెళ్లాక, అక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో నాలుగు రకాల మోడ్స్ ఉంటాయి. స్టాండర్డ్ మోడ్‌లో వీడియో రికార్డ్ చేసిన ఆడియో అలాగే ఉంటుంది. కానీ మిగతా మూడు మోడ్స్ మీ వీడియో ఆడియోను పూర్తిగా మార్చేస్తాయి.

Also Read: యాపిల్ లవర్స్‌కు ఇది కదా కావాల్సింది.. iPhone 17 Proపై ఏకంగా రూ.78,000 తగ్గింపు!

ఏ మోడ్ దేనికి?

Advertisement

ఇన్-ఫ్రేమ్ మోడ్‌ను ఎంచుకుంటే.. కెమెరా ఫ్రేమ్‌లో ఉన్నవారి గొంతు మాత్రమే స్పష్టంగా వినిపిస్తుంది. కెమెరా వెనుక నుంచి ఎవరైనా మాట్లాడితే ఆ శబ్దం తగ్గుతుంది లేదా పూర్తిగా పోతుంది. స్టూడియో మోడ్ సెలెక్ట్ చేస్తే మైక్ పెట్టి స్టూడియోలో రికార్డ్ చేసినట్టుగా క్లియర్ ఆడియో వస్తుంది. సినిమాటిక్ మోడ్ అయితే మూవీస్ చూస్తున్న అనుభూతిని ఇస్తుంది.

నాయిస్ తగ్గించే స్లైడర్..

కేవలం ఈ మోడ్స్ మాత్రమే కాకుండా.. అక్కడ ఒక స్లైడర్ కూడా ఉంటుంది. దాని సహాయంతో మీకు ఎంత బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ కావాలో అంత తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకున్నాక వీడియోను సేవ్ చేస్తే సరిపోతుంది. ఇది ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ లేకుండానే వాయిస్‌ను చాలా స్పష్టంగా మారుస్తుంది.

ఐఫోన్ 18 ప్రో ప్రత్యేకత..

ఐఫోన్ 18 ప్రో మోడల్స్ వాడుతున్న వారికి యాపిల్ మరిన్ని అడ్వాన్స్డ్ ఆప్షన్లు ఇచ్చింది. ఇందులో ఆడియో మిక్స్ ద్వారా పాటలను, మనుషుల మాటలను వేర్వేరుగా ఐసోలేట్ చేయవచ్చు. దీంతో పాటు మ్యాన్యువల్ కెమెరా కంట్రోల్స్, 4K డాల్బీ విజన్ టైమ్‌లాప్స్, ఫోటో ఎడిటింగ్ కాకుండా ఒరిజినల్ ప్రూఫ్ ఇచ్చే రిఫరెన్స్ ఇమేజ్ ఫీచర్ వంటి అధునాతన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Also Read: క్యూఆర్ కోడ్ వైపు చూస్తే చాలు.. జియో ఏఐ గ్లాసెస్‌తో పేమెంట్స్ సక్సెస్!

Tags

Related News

యాపిల్ లవర్స్‌కు ఇది కదా కావాల్సింది.. iPhone 17 Proపై ఏకంగా రూ.78,000 తగ్గింపు!

క్యూఆర్ కోడ్ వైపు చూస్తే చాలు.. జియో ఏఐ గ్లాసెస్‌తో పేమెంట్స్ సక్సెస్!

రూ.799కే బోట్ సౌండ్‌బార్..దీని ముందు హోం థియేటర్ బలాదూర్

డిస్‌ప్లే ఇయర్‌బడ్స్ చూశారా?మార్కెట్‌లో జెబీఎల్ లైవ్ బీమ్ 4 లాంచ్

పార్టీ లవర్స్ కోసం JBL కొత్త పార్టీబాక్స్ స్పీకర్లు.. 18 గంటల బ్యాటరీ, AI కారోకే మైక్స్‌తో లాంచ్!

టెక్కీలకు పండగే.. ఒకేసారి మల్టిపుల్ డివైజ్‌లను ఛార్జ్ చేసే షావోమి పవర్ బ్యాంక్!

ఫోన్ అప్‌డేట్ చేయకపోతే వాట్సప్ గోవిందా.. సీక్రెట్‌గా టెస్టింగ్ మొదలుపెట్టిన మెటా సంస్థ!

Big Stories

Advertisement
×