E-Paper
Advertisement

యాపిల్ లవర్స్‌కు ఇది కదా కావాల్సింది.. iPhone 17 Proపై ఏకంగా రూ.78,000 తగ్గింపు!

యాపిల్ లవర్స్‌కు ఇది కదా కావాల్సింది.. iPhone 17 Proపై ఏకంగా రూ.78,000 తగ్గింపు!
Advertisement

iPhone 17 Pro Offers: యువతలో యాపిల్ ఐఫోన్ అంటేనే ప్రత్యేకమైన క్రేజ్. కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వచ్చిందంటే దాని ధర ఎంత ఉన్నా కొనాలని చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా iPhone 17 Pro లాంటి ప్రీమియం మోడల్‌కు డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే రూ.1.34 లక్షలకుపైగా ధర ఉన్న ఈ ఫోన్‌ను అంతకంటే చాలా తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం ఉందంటే ఎవరైనా వదులుకుంటారా చెప్పండి! పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం, అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్, బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కలిపి ఉపయోగిస్తే.. ఐఫోన్ 17 ప్రో ధర భారీగా తగ్గే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇది దాదాపు సగం ధరకు దగ్గరగా రావచ్చు. మరి ఈ డీల్ ఎలా వర్క్ అవుతుంది? ఎంత వరకు డబ్బు ఆదా చేయొచ్చు? పూర్తి వివరాలు మీ కోసం..

ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్..

ఐఫోన్ 17 ప్రో బేస్ మోడల్ అసలు ధర సుమారు రూ.1,34,900 వరకు ఉంటుంది. అయితే మీ పాత స్మార్ట్‌ఫోన్ కండిషన్ బాగుంటే దానికి రూ.44,500 నుండి రూ.55,000 వరకు ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ లభించే అవకాశం ఉంది. ఫోన్ మోడల్, స్టోరేజ్, డిస్‌ప్లే స్క్రాచెస్ లేకపోవడంపై ఈ ధర ఆధారపడి ఉంటుంది.

Advertisement

Also Read: క్యూఆర్ కోడ్ వైపు చూస్తే చాలు.. జియో ఏఐ గ్లాసెస్‌తో పేమెంట్స్ సక్సెస్!

అదనపు బోనస్..

కేవలం పాత ఫోన్ ధర మాత్రమే కాకుండా.. పండగల సమయంలో ప్రముఖ రిటైలర్లు రూ.10,000 నుండి రూ.12,000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తున్నారు. దీనివల్ల ఫోన్ ధర మరింత తగ్గి.. అతి తక్కువ బడ్జెట్‌లోకి వస్తుంది. అయితే ఈ ఆఫర్లు కొన్ని ప్రత్యేక మోడళ్లకు మాత్రమే వర్తిస్తాయి.

బ్యాంక్ క్యాష్‌బ్యాక్..

Advertisement

ఎక్స్ఛేంజ్ డీల్‌తో పాటు ఎంపిక చేసిన కొన్ని నిర్దిష్ట బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగిస్తే రూ.3,000 నుండి రూ.4,000 వరకు తక్షణ డిస్కౌంట్ లేదా క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. షాపింగ్ చేసేముందు ఏ కార్డుపై ఎంత తగ్గింపు ఉందో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

ఎక్కడ కొనాలి?

రిలయన్స్ డిజిటల్, క్రోమా, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ రకమైన స్టాక్డ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఒక్క చోటే కాకుండా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ధరలు పోల్చి చూసి కొంటే.. iPhone 17 Proను దాదాపు రూ.57,000 నుండి రూ.70,000కే సొంతం చేసుకోవచ్చు.

Also Read: పార్టీ లవర్స్ కోసం JBL కొత్త పార్టీబాక్స్ స్పీకర్లు.. 18 గంటల బ్యాటరీ, AI కారోకే మైక్స్‌తో లాంచ్!

Tags

Related News

క్యూఆర్ కోడ్ వైపు చూస్తే చాలు.. జియో ఏఐ గ్లాసెస్‌తో పేమెంట్స్ సక్సెస్!

రూ.799కే బోట్ సౌండ్‌బార్..దీని ముందు హోం థియేటర్ బలాదూర్

డిస్‌ప్లే ఇయర్‌బడ్స్ చూశారా?మార్కెట్‌లో జెబీఎల్ లైవ్ బీమ్ 4 లాంచ్

పార్టీ లవర్స్ కోసం JBL కొత్త పార్టీబాక్స్ స్పీకర్లు.. 18 గంటల బ్యాటరీ, AI కారోకే మైక్స్‌తో లాంచ్!

టెక్కీలకు పండగే.. ఒకేసారి మల్టిపుల్ డివైజ్ ఛార్జ్ చేసే షావోమి పవర్ బ్యాంక్!

ఫోన్ అప్‌డేట్ చేయకపోతే వాట్సప్ గోవిందా.. సీక్రెట్‌గా టెస్టింగ్ మొదలుపెట్టిన మెటా సంస్థ!

అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×