E-Paper
Advertisement

వ్యూస్‌, డ‌బ్బుల కోసం మా వెధ‌వ‌లే టీమిండియాకు భజన చేస్తున్నారు

వ్యూస్‌, డ‌బ్బుల కోసం మా వెధ‌వ‌లే టీమిండియాకు భజన చేస్తున్నారు
Advertisement

Tanveer Ahmed slams Pakistan Ex-Cricketers :   పాకిస్తాన్ మాజీ క్రికెటర్లపై తన్వీర్ అహ్మద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కొంతమంది మాజీ క్రికెటర్లు టీమిండియాకు భజన చేస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబ్, ఇతర సోషల్ మీడియాలో వ్యూస్ సంపాదించేందుకు శత్రు దేశపు క్రికెటర్లను తెగ పొగుడుతున్నట్టు బాంబ్ పేల్చారు. అంతేకాదు, భారత క్రికెట్ నియంత్రణ మండలితో కొంతమంది పాక్ మాజీ క్రికెటర్లు కుమ్మక్కు అయినట్టు కూడా ఆరోపణల చేశారు.

వ్యూస్‌, డ‌బ్బుల కోసం మా వెధ‌వ‌లే… టీమిండియాను పొగుడుతున్నారు

బీసీసీఐ వేసే కుక్క బిస్కెట్లు తీసుకునే వాళ్లు కూడా తమ దేశంలో ఉన్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.భారత దేశం ఇచ్చే డబ్బులు తీసుకుంటూ, పాకిస్తాన్ నుంచే భజన చేయడం మొదలు పెట్టారని విమర్శలు చేశారు. ఓడిపోయినా, గెలిచినా టీమిండియా ప్లేయర్లను జోకుతున్నట్టు మండిపడ్డారు. పాకిస్తాన్ దేశంలో పుట్టి, శత్రువుకు ప్రచారం చేయడానికి సిగ్గుగా లేదా ? అంటూ ఫైర్ అయ్యారు. ఇండియా అంతలా నచ్చితే, పాకిస్తాన్ దేశాన్ని వదిలేసి.. అక్కడికే వెళ్లిపోవాల్సింది అంటూ మండిపడ్డారు. మా వెధ‌వ‌లే వ్యూస్‌, డ‌బ్బుల కోసం టీమిండియాను పొగుడుతున్నారనే విషయం తనకు అవమానంగా ఉందన్నారు. మనోళ్లు బాగా ఆడినా, ఆడకపోయినా.. మెచ్చుకోవాలని, అదే దేశ భక్తి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

అసలు తన్వీర్ అహ్మద్ వ్యాఖ్యల వెనుక రహస్యం ఏంటి ?

టీమిండియా క్రికెట్, బీసీసీఐ వ్యవస్థ చాలా పెద్దది. టీమిండియా మ్యాచ్ లు ఎప్పుడు, ఎక్కడ జరిగినా జనాలు ఎగబడి చూస్తారు. అందుకే సోషల్ మీడియాలో టీమిండియాను మెచ్చుకుంటూ పాకిస్తాన్ మాజీలు పొగుడుతారంటూ తన్వీర్ అహ్మద్ చెప్పే ప్రయత్నం చేశారు. టీమిండియా ప్లేయర్ల గురించి పాకిస్తాన్ వాళ్లు పాజిటివ్ కామెంట్స్ చేస్తే.. భారతీయులు కచ్చితంగా చూస్తారు. లైక్, షేర్ చేస్తారని వెల్లడించారు. శత్రువు మెచ్చుకుంటే, కచ్చితంగా గర్వంగా ఉంటుంది.. అందుకే భారతీయులు పాకిస్తాన్ మాజీల వీడియోలు రెగ్యులర్ గా చూస్తారని వెల్లడించారు. దీన్ని క్యాచ్ చేసుకున్న పాక్ మాజీలు.. టీమిండియాను జోకడం మొదలు పెట్టినట్టు చురకలు అంటించారు.

Advertisement

ఇలా టీమిండియాకు డబ్బా కొట్టి.. కోట్లు సంపాదించిన వాళ్లు కూడా ఉన్నారన్నారు. ఇలాంటి పనులు చేయడం తనకు అస్సలు ఇష్టం ఉండదని వెల్లడించారు. కానీ కొంతమంది పాకిస్తాన్ పరువు తీసేందుకు ఇలా చేస్తున్నట్టు ఆగ్రహించారు. కాగా, షోయబ్ అక్తర్, సయిద్ అజ్మల్, రమీజ్ రాజా లాంటి నిత్యం టీమిండియా మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. యూట్యూబ్, టీవీ ఛానెల్ డిబెట్స్, అంతర్జాతీయ వేదికల్లోనూ ఇండియాకు పాజిటివ్ గానే కామెంట్స్ చేస్తారు. అయితే, వీళ్లనే తన్వీర్ పరోక్షంగా విమర్శించినట్టు ప్రచారం సాగుతోంది.

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

 

 

Related News

యువ‌రాజ్ వ‌ల్లే 2007, 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నమెంట్స్‌..కానీ తొక్కేశారు

విరాట్ కోహ్లీ 100 సెంచ‌రీలు కొట్ట‌లేడు…అదే జ‌రిగితే నా పేరు మార్చుకుంటా !

ఒరేయ్ దద్దమ్మల్లారా…ఇండియ‌న్ ఓపెన‌ర్ల‌ను చూసి కాపీ అయినా కొట్టండిరా

ఇన్‌స్టాగ్రామ్‌లో న‌న్ను విరాట్ కోహ్లీ బ్లాక్ చేశాడు.. మ్యాక్స్‌వెల్ సంచ‌ల‌నం

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్, కోహ్లీలే పాక్ ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ ఇస్తారు !

రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తే భూకంపమేం రాదు..ఎప్పటి లాగానే అందరూ క్రికెట్ చూస్తారు

క్రికెట్ మానేసి, కిరాణా కొట్టు పెట్టుకోమని అవమానించారు

Big Stories

Advertisement
×