BigTV English

iQOO 13 : ఆహా.. డిసెంబర్ 3 వచ్చేస్తున్న ఐక్యూ కొత్త మెుబైల్.. ఫీచర్స్ కిర్రాక్ అంతే!

iQOO 13 : ఆహా.. డిసెంబర్ 3 వచ్చేస్తున్న ఐక్యూ కొత్త మెుబైల్.. ఫీచర్స్ కిర్రాక్ అంతే!

iQOO 13 :  ఎప్పటికప్పుడు తన కస్టమర్స్ కోసం లేటెస్ట్ మెుబైల్స్ ను లాంఛ్ చేస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో…. మరో కొత్త మొబైల్ ను లాంఛ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అదిరిపోయే ఫీచర్స్ తో రాబోతున్న ఈ మొబైల్ ఎప్పుడెప్పుడు వస్తుందో అంటూ టెక్ ప్రియులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్తూ ఐక్యూ 13 రిలీజ్ డేట్ ను ఆ సంస్థ వెల్లడించింది. ఈ మొబైల్ డిసెంబర్ 3న మార్కెట్లోకి రానుందని తెలిపింది. దీంతో ఈ మెుబైల్ ఫీచర్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.


ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థలు ఈ ఏడాది చివరలో లేటెస్ట్ మెుబైల్స్ ను లాంఛ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ నెలలో Oppo Find X8 series, Realme GT 7 Pro, Asus ROG Phone 9 series, iQOO 13 మెుబైల్స్ రాబోతున్నాయి. వివో, సామ్ సాంగ్ మొబైల్స్ సైతం బెస్ట్ వెర్షన్ లో రాబోతున్న నేపథ్యంలో ఐక్యూ సైతం డిసెంబర్ 3న ఐక్యూ 13 మొబైల్ ను లాంఛ్ చేయనున్నట్లు తెలిపింది.

ఐక్యూ మెుబైల్స్ కు ఉండే డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ మొబైల్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఈ సంస్థ.. తాజాగా మరో కొత్త మొబైల్ లాంఛింగ్ కు సిద్ధమైంది. iQOO 13ను డిసెంబర్ 3న ఇండియాలో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. అక్టోబర్ 30న చైనాలో ఈ మెుబైల్ ను లాంఛ్ చేసిన ఐక్యూ భారత్ లో ఈ ఏడాది చివరలో లాంఛ్ చేస్తుంది. ఈ మెుబైల్ ఫీచర్స్ సైతం అద్భుతంగా ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 చిప్‌సెట్‌తో రాబోతుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌ 6.7 అంగుళాల 2K AMOLED డిస్‌ప్లేతో ఈ మెుబైల్ రాబోతుంది.


iQOO 13 మెుబైల్ 16GB RAM + 512GB స్టోరేజ్ తో మార్కెట్లోకి రాబోతుంది. ఇక పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌కు బదులు మూడు 50MP సెన్సార్స్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వచ్చేస్తుంది. ఇందులో అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉంది. ప్రైమరీ లెన్స్ తో పాటు అల్ట్రా వైడ్ లెన్స్, 2x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16 MP ఫ్రంట్ కెమెరా సైతం కలిగి ఉంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6150mAh బ్యాటరీ ఉంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 రేటింగ్‌ ను కలిగి ఉంది. ఈ మెుబైల్ లో మెటల్ ఫ్రేమ్, స్టైలిష్ హాలో లైట్ స్ట్రిప్ కూడా ఉంది. ధర సైతం ఫీచర్స్ కు తగినట్లే ఐక్యూ నిర్ణయించింది.

ఇక ఈ మెుబైల్ ధర ఇప్పటికీ తెలియనప్పటికీ రూ. 55వేలు ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఐక్యూ నుంచి వచ్చిన మొబైల్స్ తో పోలిస్తే ఐక్యూ 13లో లేటెస్ట్ అప్డేట్స్ ఉండనున్నాయి. ఇక ఏది ఏమైనా ఐక్యూ తీసుకొస్తున్న ది బెస్ట్ మొబైల్స్ లో ఐక్యూ 13 ఒకటని తెలుస్తోంది.

ALSO READ : రీఛార్జ్ ఛార్జీల పెంపుపై స్పంచించిన కేంద్రం.. ఏమన్నాదంటే..!

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×