Shocking Incident: చనిపోయిన వారిని ఖననం చేయడం లేదా పాతిపెట్టడం వంటివి చేస్తుంటారు. హిందూ మతంలో అయితే చితి పేర్చి వారి దహన సంస్కారాలు నిర్వహిస్తుంటారు. అదే క్రిస్టియన్ మతంలో అయితే ఖననం చేస్తారు. అయితే ఎవరు చనిపోయిన కూడా వారి శవాన్ని పాతిపెట్టిన కొన్ని రోజులకే కుళ్లిపోతుంది. ఇది సాధారణ ప్రక్రియ. కానీ ఓ నన్ చనిపోతే తనను పాతిపెట్టినా కూడా దాదాపు నాలుగేళ్ల పాటు కుళ్లిపోకుండా తన శవం దొరకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
మిస్సౌరీకి చెందిన నన్ అయిన సిస్టర్ విల్హెల్మినా లాంకాస్టర్ నాలుగేళ్ల క్రితం అంటే మే 2019లో మృతి చెందారు. 95 ఏళ్ల వయసులో సిస్టర్ విల్హెల్మినా కన్నుమూశారు. మిస్సౌరీలోని గోవర్‌లో ఉన్న బెనెడిక్టైన్ సిస్టర్స్ ఆఫ్ మేరీ, క్వీన్ ఆఫ్ ది అపోస్టల్స్‌ను స్థాపించారు. ఆమె మరణానంతరం మృతదేహాన్ని సాధారణ చెక్క శవపేటికలో ఎంబామింగ్ చేయకుండా ఖననం చేశారు. విశేషమేమిటంటే, దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె మృతదేహాన్ని వెలికితీసి చూడగా షాక్ అయ్యే ఘటన వెలుగుచూసింది. విల్హెల్మినా మృతదేహం పాతిపెట్టి నాలుగేళ్లు గడిచినా కూడా అది అసాధారణమైన భద్రపరిచే స్థితిలో ఉంది. కొంచెం కూడా కుళ్ళిపోయిన సంకేతాలు లేకపోవడం విశేషం.
నన్‌లు అందరు విల్హెల్మినా అవశేషాలను కాన్వెంట్ ప్రార్థనా మందిరంలోని బలిపీఠం క్రింద ఉన్న కొత్త ప్రదేశానికి తరలించాలని నిర్ణయించుకున్నారు. ఈ తరుణంలో మృతదేహాన్ని వెలికి తీయగా ఈ ఆసక్తికర ఘటన ఎదురైంది. నన్‌లు విల్హెల్మినా మృతదేహం బయటకు తీసే సమయంలో కేవలం తన ఎముకలు మాత్రమే దొరుకుతాయని భావించారు. కానీ ఆమె శరీరం దాదాపు పూర్తిగా చెక్కుచెదరకుండా ఉండటంతో వారు ఆశ్చర్యపోయారు.
ఇలాంటి ఘటనలను “అక్షయత”గా సూచిస్తారు. ఇది కాథలిక్ సంప్రదాయంలో సాధారణ క్షీణత ప్రక్రియకు గురికాని శరీరాలను ఈ పదంతో పిలుస్తారు. ఇలాంటి ఘటనను పవిత్రతకు చిహ్నంగా పరిగణిస్తారు. నన్‌ని పాతిపెట్టిన చెక్క శవపేటికకు మాత్రం పగుళ్లు ఏర్పడింది. శవపేటిక లోపలికి తేమ మరియు కీటకాలు ప్రవేశించడానికి వీలు ఉన్నా కూడా కుళ్ళిపోకుండా దొరికింది.
ఈ ఘటన ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మేరకు ప్రజలు నన్ మృతదేహాన్ని సందర్శించడానికి వీలుగా ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో వచ్చి చూసిన వారంతా దీనిని ఒక అద్భుతం మరియు ఆమె పవిత్రతకు నిదర్శనంగా పరిగణించారు. మరోవైపు వైద్య నిపుణులు కూడా ఆమె మృతదేహం కుళ్ళిపోవడానికి ఖచ్చితమైన వివరణ ఇవ్వలేకపోయారు. ఈ కేసు కూడా దర్యాప్తు అంశంగానే మిగిలిపోయింది.
Sister Wilhelmina Lancaster, a nun from Missouri, passed away in May 2019 at the age of 95. She was the founder of the Benedictine Sisters of Mary, Queen of the Apostles, in Gower, Missouri.
Her body was buried without embalming in a simple wooden coffin. Remarkably, when her… pic.twitter.com/ixQGPcAINY
— VisionaryVoid (@VisionaryVoid) September 6, 2024