E-Paper
Advertisement

మ్యూజిక్‌కు తగ్గట్టుగా 360-డిగ్రీ లైటింగ్ షో.. దద్దరిల్లే బేస్‌తో JBL స్పీకర్

మ్యూజిక్‌కు తగ్గట్టుగా 360-డిగ్రీ లైటింగ్ షో.. దద్దరిల్లే బేస్‌తో JBL స్పీకర్
Advertisement

JBL Pulse 6 India launch: మ్యూజిక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రముఖ ఆడియో బ్రాండ్ జెబీఎల్ (JBL) నుంచి మరో కొత్త అద్భుతమైన స్పీకర్ మార్కెట్‌లోకి రానుంది. పార్టీలు, ట్రిప్స్ , ఇండోర్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం బ్లూటూత్ స్పీకర్ల వాడకం ప్రస్తుతం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో JBL సంస్థ తమ సరి కొత్త పల్స్ సిరీస్ స్పీకర్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. అదే ‘JBL పల్స్ 6. అద్భుతమైన లైటింగ్ ఎఫెక్ట్స్ , పవర్‌ఫుల్ సౌండ్‌కు పేరుగాంచిన పల్స్ సిరీస్‌లో ఇది లేటెస్ట్ మోడల్. ఈ కొత్త స్పీకర్ కేవలం.. మ్యూజిక్ అనుభవాన్నే కాకుండా.. పార్టీ మూడ్‌ను పూర్తిగా మార్చేయడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి ఫీచర్లు, ధర వివరాలను ఇప్పుడు చూద్దాం.

JBL పల్స్ 6 ఫీచర్లు:

1.డిజైన్, లైటింగ్ :

JBL పల్స్ సిరీస్ అనగానే మనకు ముందుగా గుర్తువచ్చేది దాని అద్భుతమైన కలర్‌ఫుల్ లైటింగ్. JBL పల్స్ 6 మునుపటి మోడల్స్ కంటే మరింత ఆకర్షణీయమైన 360-డిగ్రీ లైట్ షోతో వస్తోంది. మ్యూజిక్ బీట్స్‌కు తగినట్లుగా లైట్లు మారుతుండటం వల్ల ఇది పార్టీలకు పర్ఫెక్ట్ లుక్‌ను ఇస్తుంది. దీని కాంపాక్ట్ డిజైన్ కారణంగా ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు.

2.పవర్‌ఫుల్ 40W ఆడియో పర్ఫార్మెన్స్:

Advertisement

ఈ స్పీకర్ అతిపెద్ద హైలైట్ దీని సౌండ్ క్వాలిటీ. JBL పల్స్ 6 సుమారు 40W పవర్‌ఫుల్ ఆడియో అవుట్‌ పుట్‌తో వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది చిన్నపాటి పార్టీలకు లేదా గ్యాదరింగ్స్‌కు సరిపోయేంత గట్టిగా , స్పష్టమైన బేస్‌ను అందిస్తుంది. క్రిస్టల్ క్లియర్ వోకల్స్, డీప్ బేస్ లవర్స్‌కు ఈ స్పీకర్ ఒక అద్భుతమైన ఫీల్ ఇస్తుంది.

3.IP68 వాటర్, డస్ట్ ప్రొటెక్షన్:

బయట ట్రిప్స్‌కు వెళ్లే వారికి లేదా పూల్ పార్టీలు చేసుకునేవారికి సేఫ్టీ చాలా ముఖ్యం. దీన్ని దృష్టిలో.. ఉంచుకుని JBL పల్స్ 6 కు IP68 రేటింగ్‌ను అందించారు. దీని వల్ల నీటిలో పడినా లేదా ధూళి సోకినా స్పీకర్‌కు ఎలాంటి నష్టం జరగదు. వర్షాకాలంలో.. లేదా బీచ్‌ల వద్ద కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయొచ్చు.

4.బ్యాటరీ లైఫ్, కనెక్టివిటీ:

Advertisement

ఒక సారి ఛార్జ్ చేస్తే.. ఎక్కువ గంటల పాటు మ్యూజిక్ అందించే శక్తివంతమైన బ్యాటరీని ఇందులో అమర్చారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే.. ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అలాగే.. లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ సపోర్ట్ ఉండటంతో.. ఫోన్ లేదా ల్యాప్ ట్యాప్ త్వరగా, స్టెబిలిటీతో కనెక్ట్ అవుతుంది.

Also Read: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? దీని కంటే..బెస్ట్ ఉండదేమో !

5. ధర:

దీని ధర రూ.19,990 నుంచి రూ. 22,990 మధ్య ఉండొచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు. త్వరలోనే అధికారిక లాంచ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రీమియం లుక్, అదిరిపోయే బేస్, కలర్‌ఫుల్ లైటింగ్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

మీ ఇంటి పార్టీలను లేదా వీకెండ్ ట్రిప్స్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చుకోవాలనుకుంటే.. JBL పల్స్ 6 ఒక గొప్ప ఆప్షన్ అవుతుంది. దీని శక్తివంతమైన 40W సౌండ్, IP68 ప్రొటెక్షన్ దీనిని మార్కెట్లో ప్రత్యేకంగా నిలబెడతాయి.దీని అధికారిక లాంచ్ కోసం మ్యూజిక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×