E-Paper
Advertisement

Podarillu Today Episode : శైలు మాటతో దిమ్మతిరిగే.. కేశవకు దైర్యం చెప్పిన మాధవ్.. నారాయణ కిడ్నాప్..

Podarillu Today Episode : శైలు మాటతో దిమ్మతిరిగే.. కేశవకు దైర్యం చెప్పిన మాధవ్.. నారాయణ కిడ్నాప్..
Advertisement

Podarillu Today Episode august 21st : నారాయణ ఒక తోటలో కూర్చొని తన ఫ్రెండ్స్ తో కలిసి పేకాట ఆడుతూ ఉండగా అక్కడికి వచ్చిన దుర్గ నారాయణతో గొడవకు దిగుతాడు. ఇక తను తన మనుషులతో నారాయణను కొట్టిస్తాడు. ఆ తర్వాత ఎలాగైనా సరే నారాయణతో గొడవపడి తనని చంపేయాలని అనుకుంటాడు చివరికి నారాయణ వాళ్ళతో కొట్లాడి గెలిచిన సరే.. దుర్గ మాత్రం దొంగ దెబ్బ తీసి నారాయణ కొడతాడు. అది చూసిన చక్రి ఫ్రెండ్ సతీష్ వెళ్లి వాళ్లకి చెప్తాడు వాళ్లంతా కూడా నారాయణ ఎక్కడికి వెళ్ళాడు ఎవరు తీసుకెళ్లారు అని టెన్షన్ పడిపోతూ ఉంటారు.

శైలు మాటతో ఫ్యూజుల్ అవుట్..

శైలు ప్రెగ్నెంట్ అని చెప్పగానే కేశవ దిమ్మ తిరిగిపోయేలా షాక్ అవుతాడు.. అదేలా సాధ్యమే మన మధ్య ఏమి జరగలేదు కదా.. ఎందుకు నువ్వు తల్లి అవుతావు నన్ను ఇలా కన్ఫ్యూజ్ చేయొద్దు అని కేశవ కంగారు పడిపోతూ ఉంటాడు. శైలు మాత్రం మనిద్దరి మధ్య ఏమి జరగలేదని ఎలా అంటావ్ రా మా వాళ్ళు అన్నట్టే నువ్వు చేస్తున్నావు కడుపు వచ్చింది కాబట్టి వాడు నిన్ను వదిలేస్తాడు అని అన్నారు. అలా కాదే అక్కడ ఏదో జరిగింది అని అంటున్నావు కానీ ఏమీ జరగలేదు కదా ఇది ఎలా సాధ్యమని కంగారు పడిపోతాడు.. నువ్వు నాకు ప్రపోజ్ చేసే ముద్దు పెట్టావా దాంతోనే కు కడుపు వచ్చేసింది అని శైలు అనగానే కేశవ మాత్రం భయంతో కంగారు పడిపోతూ ఉంటాడు.

చక్రీ హ్యాపీ.. మాధవ్ ఫీల్..

Advertisement

చక్రి నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. మనింట్లో అన్ని రివర్స్ రివర్స్ గా జరిగిపోతున్నాయి.. పెద్దన్నయ్యకి పెళ్లి కావాల్సింది నాకు ముందు పెళ్లి అయింది.. నేను నాన్నను కావాల్సింది నువ్వు నాన్నవయ్యి నాకు షాక్ ఇచ్చావు అంటూ చక్రీ అంటాడు. అయితే చక్రి అనగానే కేశవ నేను చెప్పేది వినరని ఎంత చెప్పినా సరే అసలు వినకుండా ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోతాడు. మాధవ కేశవ దగ్గరికి వచ్చి నువ్వు కేశవ అని ప్రేమించావు అనుకున్నాను. కానీ ఇప్పుడు తల్లిని చేశావు అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పరువు పోతుందని ఆలోచించి నీకే పెళ్లి చేస్తారు. కానీ ఏం జరుగుతుందో చూసుకుందాంలే అని అంటాడు. కేశవ వీళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అని కంగారు పడిపోతూ ఉంటారు.

ఊరికి వెళ్లేందుకు అంతా రెడీ..

అందరూ ఇవాళ మన ఊరికి వెళ్ళిపోదాము ఆ తర్వాత ఏం జరిగిందో చూసుకుందామని అనుకుంటారు. ఎందుకు మీరు అప్పుడే వెళ్తున్నారు? అందరం సరదాగా ఉన్నాం కదా కొద్ది రోజులు ఇక్కడే ఉన్నాము అని గాయత్రి భర్త వినోద్ అడుగుతాడు. కానీ తను మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. అసలు ఎందుకు మీరు వెళ్తున్నారో చెప్పండి ఏదైనా పని ఉందా అని ఎంత చెప్పినా సరే వినకుండా మేము వెళ్ళిపోతాము అని అంటారు.. గాయత్రి లోపలికి వెళ్లి మాధవ్ బావ వాళ్ళు వెళ్లిపోతామంటున్నారు అమ్మ అని అనగానే వెళ్లిపోని మంచిదే కదా అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చి సతీష్ మీ నాన్నని దుర్గ మనుషులు కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లారు అని చెప్పగానే షాక్ అవుతుంది.. అంతేకాదు తాయారుకి నిజం చెప్పడంతో కంగారు పడిపోతుంది. ఇంట్లోని వాళ్ళందరూ ఆ దుర్గా మా నాన్నని ఎందుకు తీసుకెళ్లాడు అని టెన్షన్ పడుతూ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతారు..

దుర్గ మనుషులను కొట్టిన బ్రదర్స్..

Advertisement

దుర్గ మనుషులు నారాయణ నీ కొడుతూ ఉండగా అక్కడికి వెళ్లిన అన్నదమ్ములు అందరూ కలిసి దారుణంగా కొట్టేస్తారు నారాయణని మొత్తానికి కాపాడుతారు. అందరినీ కొట్టి మరి నారాయణ నువ్వు కాపాడుతారు. అయితే ఈ క్రమంలో నారాయణని చంపబోతున్న దుర్గని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు చక్రి.. దుర్గ తప్పుకోని ఎంత చెప్తున్నా సరే చక్రి మాత్రం అసలు వినకుండా కత్తిని గట్టిగా పట్టుకోవడంతో రక్తం కారిపోతుంది.. అసలు నువ్వు ఎవరు నీకు మాకు ఏంటి సంబంధం అని చక్రి అడగగానే నారాయణ రక్తసంబంధం అని అంటాడు ఆ మాట విన్న అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు..

నిజం చెప్పిన తాయారు..

అసలు నువ్వు ఎవరు మా నాన్నని ఎందుకు కిడ్నాప్ చేశావు చెప్పు అని మాధవ్ అడగ్గానే.. అప్పుడే ఇంట్లోకి వచ్చిన తాయారు నేను చెప్తాను అని అంటుంది.. ఇతను మీ అమ్మకి స్వయానా తమ్ముడు.. మీది రక్తసంబంధం సొంత మేనమామే దుర్గా అని తాయారు చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మీ నాన్న మీ అమ్మని చంపేసి వెళ్ళిపోయాడు కదా పగని మనసులో పెట్టుకొని ఉన్నాడు ఇన్నాళ్ళకి మీ నాన్న మళ్ళీ ఆ ఊరికి రావడంతో పగ గుర్తొచ్చింది అని తాయారు చెప్పింది ఆ మాట వినగానే ఇంత భద్ర శతృత్వం ఉందా అని అందరూ ఆలోచిస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. డబ్బులు కొట్టేసిన భాగ్యం.. విశ్వం ప్లాన్ సక్సెస్..

Related News

బుల్లితెరపై సందడి చేసిన స్వప్న దత్.. ఆ క్రేజీ మూమెంట్ చూసారా?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నూక రాజు.. రాంప్రసాద్ ను మించిన రెమ్యూనరేషన్!

“బిందెల బిందెలు బావయ్యో”.. మరో ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన మాధురీ రాథోడ్!

పండును ఈ పరిస్థితుల్లో చూస్తే కన్నీళ్లు ఆగవు.. మళ్లీ డ్యాన్స్ చేయగలడా? రికవరీకి ఎంత టైమ్?

బిగ్ బాస్ 10 5వ వారం నామినేషన్ లిస్ట్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

Nindu Noorella Saavasam Serial Today Episode October 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి, పార్థును చంపకుండా అమర్ అడ్డుకుంటాడా..? 

Karthika Deepam 2 Serial Today Episode October 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తో జ్యోత్స్న పెళ్లి చేస్తానన్న దీప              

హేటర్స్ కి అనసూయ దిమ్మతిరిగే రియాక్షన్!

Big Stories

Advertisement
×