E-Paper
Advertisement

షావోమి ఫోన్లలో ఐఫోన్ తరహా గ్లాస్ డిజైన్.. మీ మోడల్ ఉందో లేదో చెక్ చేసుకోండి!

షావోమి ఫోన్లలో ఐఫోన్ తరహా గ్లాస్ డిజైన్.. మీ మోడల్ ఉందో లేదో చెక్ చేసుకోండి!
Advertisement

Xiaomi HyperOS 4: ప్రముఖ షావోమీ మొబైల్ వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్. ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల కోసం త్వరలోనే ‘హైపర్‌ఓఎస్ 4’ అప్‌డేట్‌ను తీసుకురాబోతోంది. ఈసారి కేవలం పెర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా.. ఫోన్ చూడటానికి ఎంత అందంగా ఉండాలో అనే దానిపై కంపెనీ ఎక్కువ దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఐఫోన్ డిజైన్‌ను పోలి ఉండే ఒక కొత్త ‘సాఫ్ట్ లైట్ గ్లాస్’ యూఐ (UI)తో ఈ అప్‌డేట్ రాబోతోంది.

కళ్లకు ఇంపుగా సాఫ్ట్‌లైట్ గ్లాస్ డిజైన్..

ఈ కొత్త అప్‌డేట్‌లో ప్రధాన ఆకర్షణ సాఫ్ట్‌లైట్ గ్లాస్ ఎఫెక్ట్. ఫోన్ స్క్రీన్ వాడేటప్పుడు గాజులాంటి పారదర్శకత, అద్భుతమైన లైటింగ్ ఎఫెక్ట్స్, ఒక యాప్ నుంచి ఇంకో యాప్‌కి మారేటప్పుడు స్మూత్‌గా వచ్చే విజువల్స్ యూజర్లకు ఒక ప్రీమియం అనుభూతిని ఇస్తాయి. యాపిల్ లిక్విడ్ గ్లాస్ తరహాలోనే అనిపించినా, షాఓమి దీనిని తమ సొంత శైలిలో మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దింది.

Advertisement

Also Read: యాపిల్ ప్రియులకు మళ్లీ నిరాశే.. కెమెరా ఎయిర్‌పాడ్స్ వచ్చేది అప్పుడేనట!

ఆ ఫోన్లకే తొలి ప్రాధాన్యత..

ఈ డిజైన్ ఎఫెక్ట్స్ చాలా హెవీ గ్రాఫిక్స్‌తో కూడుకుని ఉంటాయి. అందుకే ఇవి రన్ అవ్వడానికి మంచి ప్రాసెసర్ అవసరం. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, డైమెన్సిటీ 9500 లేదా అంతకంటే అధునాతన ప్రాసెసర్లు ఉన్న ఫోన్లకు మాత్రమే ఈ ఫీచర్ మొదటగా అందుబాటులోకి వస్తుంది. అయితే పాత ప్రీమియం మోడల్స్ అయిన షావోమి 13, రెడ్‌మీ K70, షావోమి మిక్స్ ఫ్లిప్ వంటి ఫోన్లకు కూడా దీనిని అందించేందుకు కంపెనీ ఆలోచిస్తోంది.

ఆ లిస్ట్‌లో ఉన్న డివైజ్‌లు ఇవే..

Advertisement

చైనాలో ప్రస్తుతం హైపర్‌ఓఎస్ 4 బీటా టెస్టింగ్ జరుగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం షావోమి మిక్స్ ఫోల్డ్, మిక్స్ ఫ్లిప్ సిరీస్‌లతో పాటు షావోమి 17, 15, 14, 13 సిరీస్ ఫోన్లకు ఈ అప్‌డేట్ రానుంది. అలాగే రెడ్‌మీ K100, K90, K80, K70 సిరీస్ మోడల్స్, రెడ్‌మీ టర్బో సిరీస్ ఫోన్లు దీనిని సపోర్ట్ చేస్తాయి. వీటితో పాటు షావోమి ప్యాడ్ 8, ప్యాడ్ 7 సిరీస్, రెడ్‌మీ కె ప్యాడ్ ట్యాబ్లెట్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

గ్లోబల్ యూజర్లకు ఎప్పుడంటే..

ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను చైనాలోని బీటా యూజర్లతో పరీక్షిస్తున్నారు. ఇది సక్సెస్ అయ్యాక ఇతర దేశాల్లోని యూజర్లకు దీనిని విడుదల చేస్తారు. కాబట్టి.. గ్లోబల్ రోలౌట్ కోసం మరికొంత సమయం పట్టవచ్చు. చివరికి ఈ గ్లాస్ యుఐ కనుక పాత మోడల్స్‌కు కూడా వస్తే.. చాలామంది షావోమి యూజర్లకు తమ ఫోన్ సరికొత్తగా మారిన అనుభూతి ఖాయంగా దక్కుతుంది.

Also Read: 7050mAh బ్యాటరీతో రచ్చలేపుతున్న iQOO Z11.. లాంచ్ ఆఫర్‌తో ఎంత తక్కువకు వస్తుందంటే?

Tags

Related News

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Wi-Fi 8 రాకతో డెడ్ జోన్స్ మాయం.. సిగ్నల్ డ్రాప్స్‌కి పర్మనెంట్ చెక్ పెట్టేసే కొత్త ఫీచర్లు!

ఒక్కసారి కొంటే 5 ఏళ్లు తిరుగుండదు.. బడ్జెట్‌లో టాప్-5 ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే!

Big Stories

Advertisement
×