E-Paper
Advertisement

5Gకి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది..త్వరలోనే జియో 6G ఇంటర్నెట్

5Gకి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది..త్వరలోనే జియో 6G ఇంటర్నెట్
Advertisement

Jio 6G internet launch in India: మొబైల్ ఇంటర్నెట్ ప్రపంచంలో.. మనం ఇప్పుడు 5G వేగాన్ని ఆస్వాదిస్తున్నాము. అయితే.. టెక్నాలజీ ఎప్పుడూ ఒకచోట ఆగిపోదు. యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా వేగం మరింత పెరుగుతూనే ఉంటుంది. తాజాగా ఇండియలోని ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో దేశంలో 6G ఇంటర్నెట్ శకానికి నాంది పలికింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా.. ఆచరణలోనూ అద్భుతాలు సృష్టించగలమని నిరూపిస్తూ జియో సంస్థ దేశంలోనే.. తొలి ‘గిగా మైమో రేడియో’ను ఆవిష్కరించింది. ఇది భవిష్యత్తు డిజిటల్ కమ్యూనికేషన్ రూపురేఖలను పూర్తిగా మార్చనుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

6G ప్రత్యేకతలు ఏంటి?

ప్రస్తుతం మనం వాడుతున్న 5G నెట్‌వర్క్ కంటే .. కొత్తగా రాబోతున్న 6G టెక్నాలజీ సుమారు 5 రెట్లు ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తుందని జియో ప్రకటించింది. ఇంటర్నెట్ వేగం కేవలం గిగాబైట్ల నుంచి టెరాబైట్లకు మారనుంది. దీని వల్ల పెద్ద పెద్ద సినిమాలు, వీడియో ఫైల్స్ కేవలం సెకన్లలోనే డౌన్‌లోడ్ అయిపోతాయి. అంతే కాకుండా హై-డెఫినిషన్ స్ట్రీమింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలు ఓకే సారి ఎలాంటి లాగ్ లేకుండా అత్యంత ఈజీగా రన్ అవుతాయి.

మొట్టమొదటి గిగా మైమో రేడియో:

Advertisement

జియో ఆవిష్కరించిన ఈ కొత్త ‘గిగా మైమో రేడియో’ 6G ప్రయాణంలో అత్యంత కీలకమైన అడుగు. మైమో టెక్నాలజీ సిగ్నల్ సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుతుంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా నెట్‌వర్క్ డ్రాప్ అయ్యే సమస్య లేకుండా ప్రతి కస్టమర్2కి హై-స్పీడ్ ఇంటర్నెట్ అందేలా ఇది చూస్తుంది. దేశీయంగానే తయారవుతున్న ఈ అత్యాధునిక పరికరాలు ఇండియాను గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

సాంకేతిక రంగాలపై ప్రభావం:

6G టెక్నాలజీ రాక కేవలం మొబైల్ యూజర్ల వేగాన్ని పెంచడమే కాకుండా.. దేశంలోని అనేక రంగాలను సమూలంగా మారుస్తుంది. స్మార్ట్ సిటీలు, డ్రైవర్ లెస్ కార్లు ,లేటెస్ట్ టెలీ-మెడిసిన్ సర్వీసులు , రోబోటిక్స్ సర్జరీలకు ఈ హై-స్పీడ్, లో-లాటెన్సీ నెట్‌వర్క్ వెన్నెముకగా నిలుస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు కూడా అతి వేగంగా ఇంటర్నెట్‌ను చేరడానికి 6G సాంకేతికత అద్భుతంగా ఉపయోగ పడుతుంది.

Advertisement

Also Read: డబ్బులు కట్ అయ్యి మనీ పడలేదా?ఈ తప్పులు అస్సలు చేయెద్దు! 

సామాన్యులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

ప్రస్తుతం జియో ఈ టెక్నాలజీకి సంబంధించిన ప్రయోగాలు , రీసెర్చ్‌ను వేగవంతం చేసింది. భవిష్యత్తులో గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా దీనిని మరింత అభివృద్ధి చేసి వాణిజ్య పరంగా మార్కెట్లోకి తీసుకురానున్నారు. దేశంలో డిజిటల్ విప్లవానికి మరో సారి పెద్ద పీఠ వేస్తూ జియో తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం టెక్ లవర్స్2ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

టెక్నాలజీ రంగంలో భారత్ ఇకపై ఎవరికీ తీసిపోదని జియో మరో సారి నిరూపించింది. 5G విజయాల తర్వాత ఇప్పుడు 6G వైపు అడుగులు వేయడం దేశ సాంకేతిక సత్తాకు నిదర్శనం. రాబోయే రోజుల్లో మన డిజిటల్ ఫీల్ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే ఈ అద్భుతమైన మార్పు కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

ఇది మామూలు ఫోన్ కాదు భయ్యా.. 200 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో ఒప్పో సరికొత్త రికార్డ్!

Apple Watch Series 11పై అమెజాన్‌లో క్రేజీ డీల్.. యాపిల్ ప్రియులకు ఇంత కంటే మంచి ఛాన్స్ రాదు!

రూ.25 వేల బడ్జెట్‌లో ఐదు అదిరిపోయే ఫోన్ ఆఫర్లు.. ఏది కొనడం బెస్ట్ అంటే?

ఫేక్ ఇ-ఇన్‌వాయిస్ మెసేజ్‌లతో మోసపోకండి..అసలు,నకిలీ బిల్లులను ఇలా గుర్తించండి!

సమయాన్ని కొలవడంలో సరికొత్త విప్లవం.. న్యూక్లియర్ క్లాక్ ఎలా పనిచేస్తుందో తెలుసా?

డబ్బులు కట్ అయ్యి మనీ పడలేదా?ఈ తప్పులు అస్సలు చేయెద్దు!

షాపింగ్ ప్రియులకు పండుగ బొనాంజా.. టీవీ నుంచి ల్యాప్‌టాప్ వరకు.. మిస్ చేసుకోలేని డీల్స్!

Big Stories

Advertisement
×