Digital Governance: తెలంగాణ ప్రభుత్వం పాలనలో పారదర్శకతను పెంచడం కోసం పరిపాలనా విధానాలు, అనుమతులు, ఉద్యోగుల సర్వీసులు బిల్లుల చెల్లింపులను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది. ఉద్యోగుల వివరాల డిజిటలైజేషన్ చేసే క్రమంలో Human Resource Management System (e-HRMS)ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల పూర్తి వివరాలు, సర్వీసు రికార్డులను పారదర్శకంగా ఉంచేందుకు e-HRMS విధానాన్ని 100% డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే దాదాపు 93% మంది ఉద్యోగుల డేటా డిజిటలైజేషన్ పూర్తయింది.
రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది బ్యాంక్ ఖాతాలు, జీతాల వివరాలను కూడా డిజిటలైజ్ చేస్తున్నారు. దీనివల్ల ఏజెన్సీల ప్రమేయం తగ్గి, ప్రతినెలా ఒకటో తేదీనే నేరుగా వారి ఖాతాల్లో జీతాలు జమ అయ్యేలా పారదర్శకత పెరుగుతుంది. తెలంగాణ IFMIS పోర్టల్ ద్వారా ప్రభుత్వ బిల్లుల చెల్లింపుల ప్రక్రియను పూర్తిగా పేపర్‌లెస్ డిజిటల్ విధానంలోకి మార్చారు. అభివృద్ధి పనుల మంజూరీ,Technical Sanctions, కాంట్రాక్టుల కేటాయింపుల్లో ఎలాంటి అవకతవకలు, పక్షపాతానికి తావులేకుండా ఉండేందుకు మొత్తం టెండర్ ప్రక్రియను ఒకే డిజిటల్ గొడుగు కిందికి తీసుకువచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రాష్ట్రంలో డిజిటల్ పరిపాలనను అమలు చేయడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేశారు. దీన్నిOfficial Committee on Digital Governance గా పిలుస్తున్నారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో సచివాలయం నుండి క్షేత్రస్థాయి కార్యాలయాల వరకు అన్ని రకాల అనుమతులు, ఫైళ్ల కదలికలు పూర్తిగా ఆన్‌లైన్ రూపాన్ని సంతరించుకోనున్నాయి. ప్రజా పాలన పూర్తిగా పారదర్శకంగా ఉందనే విధంగా, అవినీతికి ఆస్కారమే లేకుండా చేయలనే లక్ష్యంతో సీఎం ఈ విధానానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also read: పైకి నవ్వుతున్నా లోపల ఆందోళనా.. ఈ 5 సంకేతాలు మీలో ఉంటే బీ కేర్ ఫుల్!