BigTV English

Jio : జియో పతనం మెుదలైందా! ఒక్క నెలలోనే 79.6 లక్షల వినియోగదారులు అవుట్..

Jio : జియో పతనం మెుదలైందా! ఒక్క నెలలోనే 79.6 లక్షల వినియోగదారులు అవుట్..

Jio : వినియోగదారులు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో చెప్పలేం. కానీ ది బెస్ట్ అనుకునే వాటికి మాత్రం కచ్చితంగా ఓటు వేస్తారు. తాజాగా ఈ విషయాన్ని ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) నిరూపించింది. భారత్ లో ప్రైవేట్ టెలికాం సంస్థలైనా జియో (JIO), వోడాఫోన్ ఐడియా (VODA PHONE IDEA), ఎయిర్టెల్ (AIRTEL) తమ టారిఫ్ చార్జీలను విపరీతంగా పెంచేసిన సమయంలో బిఎస్ఎన్ఎల్ (BSNL) అందుబాటులోకి వచ్చింది. అది తక్కువ ధరలకే బెస్ట్ ప్లాన్స్ ను అందించే ప్రయత్నాలు చేసింది. 4g సేవలతో పాటు 5g సేవలను మరింత మెరుగుపరుస్తూ దేశ వ్యాప్తంగా విస్తరించింది.


ఈ నేపథ్యంలో వందల కోట్లతో మొదలైన ప్రైవేట్ టెలికాం సంస్థలకు కస్టమర్స్ షాక్ ఇచ్చారు. రీచార్జ్ చార్జ్ లను విపరీతంగా పెంచేస్తున్న నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయిన వినియోగదారుల సంఖ్య అత్యంత ఎక్కువగా ఉందని తాజాగా ట్రాయ్ తెలిపింది. ఇక భారత్ లో సెప్టెంబర్ లో చూసుకుంటే అత్యధికంగా వినియోగదారులను కోల్పోయిన టెలికాం సంస్థగా తొలి స్థానంలో నిలిచింది జియో.

విపరీతంగా రీఛార్జ్ ఛార్జ్ లను పెంచేయడంతో జులై నుంచి వినియోగదారులను కోల్పోతూ వస్తున్న జియో.. సెప్టెంబర్ లో అత్యంత ఎక్కువగా తన వినియోగదారులను కోల్పోయిందని టెలికాం రెగ్యులర్ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. ఇక జియో తో పాటు వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ సైతం సబ్స్క్రైబర్స్ ను కోల్పోయింది. నిజానికి సెప్టెంబర్ 30 నాటికి జియో సబ్స్క్రైబర్స్ దేశ వ్యాప్తంగా 46.37 కోట్లు ఉన్నారు. ఇక ఎయిర్టెల్ కి 38.34 కోట్లు ఉండగా.. వోడాఫోన్కు 21.24 కోట్ల వినియోగదారులు ఉన్నారు. ఇక బిఎస్ఎన్ఎల్ కు అప్పటికి 9.38 కోట్ల యూజర్స్ మాత్రమే ఉన్నారు. ఇక కొద్ది నెలల్లోనే జియో నుంచి విపరీతంగా బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయిన కస్టమర్స్ సంఖ్య ఎక్కువగా ఉందని ట్రాయ్ తెలిపింది.


సెప్టెంబర్ లో జియో ఏకంగా 79.6 లక్షల వినియోగదారులను కోల్పోయినట్టు తెలుస్తుంది. ఇక ఎయిర్టెల్ 14.3 లక్షలు, వోడాఫోన్ 15.5 మిలియన్ల యూజర్లను కోల్పోయినట్టు ట్రాయ్ తెలిపింది. ఇక ఈ నేపథ్యంలోనే 8.4 లక్షల మంది బిఎస్ఎన్ఎల్ లో కొత్తగా చేరారు. అంటే గడిచిన మూడు నెలలలోనే బిఎస్ఎన్ఎల్ కు వినియోగదారులు విపరీతంగా పెరిగిపోయారని చెప్పాలి. ట్రాయ్ తెలిపిన వివరాలు ప్రకారం.. జియో టారిఫ్ ఛార్జీలను పెంచేసిన తర్వాత యూజర్స్ ను కోల్పోవడం మొదలైందని.. జులై 7.5 లక్షలు ఉండగా.. ఆగస్టులో 45.1 లక్షలు ఉన్నారని తెలిపింది. ఇక సెప్టెంబర్లో ఏకంగా 79.6 లక్షల వినియోగదారుల్లో జియో కోల్పోయిందని చెప్పుకు వచ్చింది. ఈ విషయం ఇలాగే కొనసాగితే జియో కచ్చితంగా వెనుక పడే అవకాశం ఉందని వినియోగదారులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా తన టారిఫ్ చార్జర్ ను తగ్గించుకొని వినియోగదారులకు అందుబాటు ధరల్లో రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకురావాలని హితవు పలుకుతున్నారు. మరి చూడాలి ఈ రిజల్ట్ తో జియో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో!

ALSO READ : రూమ్ సౌండ్ బట్టి మారిపోయే మ్యూజిక్.. ఇంకా ఎన్నో అదిరే ఫీచర్స్!

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×