Miss You Trailer: లవర్ బాయ్ సిద్దార్థ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బొమ్మరిల్లు సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. అయితే మధ్యలో మాత్రం టాలీవుడ్ కు కొద్దిగా బ్రేక్ ఇచ్చాడు. గత రెండేళ్ల నుంచే సిద్దు.. మళ్లీ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నాడు.
గతేడాది చిత్తా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సిద్దు.. ఈ ఏడాది భారతీయుడు 2 తో భారీ పరాజయాన్ని అందుకున్నాడు. ఆ పరాజయం పక్కన పెడితే.. ఈ ఏడాది సిద్దు ఒక ఇంటివాడు అయ్యాడు. తన ప్రేయసి, నటి అదితి రావు హైదరీని పెళ్లి చేసుకున్నాడు.
Teja Sajja in The Rana Daggubati show: 1000 కోట్లకు ఒకే ఒక్క మొగుడు ప్రభాస్
పెళ్లి తరువాత సిద్దు నటిస్తున్న చిత్రం మిస్ యూ. ఎన్. రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్దు సరసన అషికా రంగనాథన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో సిద్దు.. వాసు అనే పాత్రలో కనిపిస్తున్నాడు.
వాసు.. ఒక అప్ కమింగ్ డైరెక్టర్. ఎప్పటికైనా ఒక మంచి లవ్ స్టోరీ తీయాలని, మంచి కథ కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ సమయంలోనే అతనికి సుబ్బలక్ష్మీ( అషికా రంగనాథన్) పరిచయమవుతుంది. చూడగానే సుబ్బు ప్రేమలో పడతాడు వాసు. అంతా సెట్ అయ్యింది అనుకొనేలోపు.. వారి జీవితాల్లోకి ఒక పొలిటికల్ లీడర్ వస్తాడు. అక్కడనుంచి వాసు జీవితం మారిపోతుంది.
RK Roja: రోజా కొడుకు టాలీవుడ్ ఎంట్రీ.. ఇదస్సలు ఊహించలేదే.. ?
అసలు వాసుకు.. పొలిటికల్ లీడర్ కు సంబంధం ఏంటి.. ? సుబ్బు ఎందుకు వాసుపై కోపంగా ఉంటుంది. చివరికి వాసు డైరెక్టర్ గా గెలిచాడా.. ? తన ప్రేమను గెలిపించుకున్నాడా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైలర్ మొత్తం లవ్ స్టోరీ చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. సిద్దు.. ఇప్పటికీ బొమ్మరిల్లు లో ఉన్నట్లే కనిపించడం విశేషం. ఈ సినిమా నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సిద్దు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.