E-Paper
Advertisement

జియో ధమాకా ఆఫర్.. భారీగా ‘ఎక్స్‌ట్రా డేటా’.. గేమర్స్, యూత్‌కు పండగే!

జియో ధమాకా ఆఫర్.. భారీగా ‘ఎక్స్‌ట్రా డేటా’.. గేమర్స్, యూత్‌కు పండగే!
Advertisement

Jio Prepaid Plans: రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్లను తీసుకువచ్చింది. ముఖ్యంగా డేటా ఎక్కువగా వాడే యువత, గేమర్స్, అన్‌లిమిటెడ్ 5Gని ఆస్వాదించాలనుకునే వారిని టార్గెట్ చేస్తూ 5 ప్రత్యేక ప్లాన్‌లు అందుబాటులో ఉంచింది. వాటిపై అదనపు డేటా ప్రయోజనాలను సైతం అందిస్తోంది. ఇంతకీ ఆ ప్లాన్స్ ఏవి? వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రూ. 459 గేమింగ్ ప్లాన్

ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవారికి, సోషల్ మీడియా ఎక్కువగా వాడే యువతకు కోసం జియో ఈ ప్లాన్ తీసుకొచ్చింది. సాధారణంగా వచ్చే రోజువారీ డేటాతో పాటు, ఈ ప్లాన్‌పై జియో అదనపు డేటా ప్రయోజనాన్ని అందిస్తోంది. 28 వ్యాలిడిటీతో ప్రతీ రోజు 2GB డేటా యూజర్లు పొందొచ్చు. దీనికి అదనంగా మరో 5GB డేటాను జియో ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఇందులో లభించనుంది.

రూ. 495 యూత్ అండ్ గేమింగ్ ప్లాన్

Advertisement

రూ. 459 ప్లాన్ కంటే వేగవంతమైన డేటా కోరుకునే వారి కోసం రూ. 495 ప్లాన్‌ను జియో అందుబాటులో ఉంచింది. 64kbps స్పీడ్ తో ప్రతీ రోజూ 1.5GB డేటా యూజర్లకు లభించనుంది. ఇది కాకుండా అదనంగా మరో 5GB డేటా యూజర్లు పొందొచ్చు. ఈ ప్లాన్ లో లభించే ఫాస్ట్ డేటా వల్ల గేమింగ్ ఆడేటప్పుడు ఎలాంటి లాగ్స్ (ఆటంకాలు) లేకుండా, లైవ్ స్ట్రీమింగ్స్ చేసుకోవడానికి వీలవుతుంది. హెవీ ఇంటర్నెట్ యూజర్లకు ఈ ప్లాన్ మంచి వాల్యూ ఫర్ మనీ అని చెప్పవచ్చు.

జియో రూ. 545 ప్లాన్

యూత్ అండ్ గేమింగ్ సిరీస్‌లో ఇది కాస్త ప్రీమియం ప్లాన్. 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతీ రోజూ 2GB డేటాను 64 kbps స్పీడ్ తో వాడుకోవచ్చు. దీనిపై కూడా 5GB అదనపు డేటా అందుబాటులో ఉండనుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి, ఆన్‌లైన్ క్లాసులు వినే విద్యార్థులకు అలాగే రాత్రింబవళ్లు ఆన్‌లైన్ గేమింగ్‌లో మునిగితేలే వారికి ఈ రూ. 545 ప్లాన్ ద్వారా లభించే ఎక్స్‌ట్రా డేటా పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.

రూ. 749 ట్రూ 5G అన్‌లిమిటెడ్ ప్లాన్

Advertisement

మీ ఏరియాలో జియో 5G నెట్‌వర్క్ ఉండి, మీ దగ్గర 5G స్మార్ట్‌ఫోన్ ఉంటే.. ఈ ప్లాన్ ఈ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. రూ. 749 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ ట్రూ 5G డేటాను ఎంజాయ్ చేయవచ్చు. లేదంటే 72 రోజుల వ్యాలిడిటీతో ప్రతీరోజూ 2GB డేటాతో పాటు అదనంగా 20 GB యూజర్లు పొందొచ్చు. ఇక ఈ ప్లాన్ లో అడిషనల్ బెనిఫిట్స్ కింద 3 నెలల జియో హాట్ స్టార్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్, జియో క్లౌడ్ స్టోరేజ్, రూ.35,000 విలువైన గూగుల్ జెమిని ప్రోకు యాక్సెస్ లభించనుంది.

Also Read: బాత్రూమ్‌లో చేసే ఈ 7 తప్పులు ఇంట్లో సమస్యలకు కారణం.. ఆర్థిక కష్టాలకు ఆహ్వానం

రూ. 899 5G అన్‌లిమిటెడ్ ప్లాన్

ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం జియో ఈ ప్లాన్ తీసుకొచ్చింది. 90 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ కింద యూజర్లకు అపరిమిత 5G డేటా లభించనుంది. మీది 5G ఫోన్, 5G నెట్ వర్క్ పరిధిలో ఉంటే.. ఈ డేటాను వినియోగించుకోవచ్చు. కానీ పక్షంలో ప్రతీ రోజూ 2GB డేటాతో పాటు అదనంగా మరో 20GB యూజర్లు వాడుకోవచ్చు. మరోవైపు 3 నెలలపాటు ఫ్రీ హాట్ స్టార్, జియో యాప్ కంటెంట్, గూగుల్ జెమినీ ప్రో వంటి వాటికి యాక్సెస్ సైతం ఈ ప్లాన్ కింద దక్కించుకోవచ్చు.

Also Read: వేధించేవాడు.. అహంకారపు మాటలు భరించలేకపోయా.. అంజలి షాకింగ్ కామెంట్!

Related News

Google Pixel 11పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.19,000 ఆదా చేసుకునే అవకాశం!

ఇది మామూలు ఫోన్ కాదు భయ్యా.. 200 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో ఒప్పో సరికొత్త రికార్డ్!

Apple Watch Series 11పై అమెజాన్‌లో క్రేజీ డీల్.. యాపిల్ ప్రియులకు ఇంత కంటే మంచి ఛాన్స్ రాదు!

5Gకి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది..త్వరలోనే జియో 6G ఇంటర్నెట్

రూ.25 వేల బడ్జెట్‌లో ఐదు అదిరిపోయే ఫోన్ ఆఫర్లు.. ఏది కొనడం బెస్ట్ అంటే?

ఫేక్ ఇ-ఇన్‌వాయిస్ మెసేజ్‌లతో మోసపోకండి..అసలు,నకిలీ బిల్లులను ఇలా గుర్తించండి!

సమయాన్ని కొలవడంలో సరికొత్త విప్లవం.. న్యూక్లియర్ క్లాక్ ఎలా పనిచేస్తుందో తెలుసా?

డబ్బులు కట్ అయ్యి మనీ పడలేదా?ఈ తప్పులు అస్సలు చేయెద్దు!

Big Stories

Advertisement
×