E-Paper
Advertisement

చంకలో వెంట్రుకలకు రంగులు.. ఆ దేశంలో ఇదే ట్రెండ్!

చంకలో వెంట్రుకలకు రంగులు.. ఆ దేశంలో ఇదే ట్రెండ్!
Advertisement

Underarm Hair Goes Colorful: సాధారణంగా మహిళలు అండర్‌ ఆర్మ్ హెయిర్‌ ను తొలగించుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అందం, శుభ్రత పేరుతో చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఈ అలవాటుకు చైనా యువతులు కొత్త అర్థం చెబుతున్నారు. వెంట్రుకలను షేవ్ చేయకుండా, వాటికి నీలం, గులాబీ వంటి రంగులు వేస్తూ తమదైన స్టైల్‌ ను చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కొత్త ట్రెండ్ సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.

షేవ్ చేయకుండా.. రంగులు వేయడమే ట్రెండ్!

చైనాలో కొందరు యువతులు అండర్‌ ఆర్మ్ హెయిర్‌ ను అలాగే ఉంచి, వాటికి వివిధ రంగులు వేస్తున్నారు. ముఖ్యంగా పింక్, బ్లూ, పర్పుల్ లాంటి రంగులతో ప్రయోగాలు చేస్తున్నారు. సాధారణంగా దాచాల్సినదిగా భావించే శరీర భాగాన్నే తమ వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచే మార్గంగా మార్చుకుంటున్నారు. ఇది కేవలం ఫ్యాషన్ ప్రయోగం మాత్రమే కాదని, మహిళల శరీరంపై సమాజం పెట్టిన కొన్ని పరిమితులను ప్రశ్నించే ప్రయత్నమని ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్న వారు చెబుతున్నారు.

మై బాడీ.. మై ఛాయిస్!   

Advertisement

మహిళలు ఎలా కనిపించాలి? ఏ దుస్తులు ధరించాలి? శరీరంపై వెంట్రుకలు ఉండాలా? వాటిని తొలగించాలా? అనే విషయాలపై సమాజం చాలా కాలంగా కొన్ని పరిమితులు విధించింది. అయితే, కొత్త తరం యువతులు తమ శరీరానికి సంబంధించిన నిర్ణయాలు తామే తీసుకోవాలని భావిస్తున్నారు. అండర్‌ ఆర్మ్ హెయిర్‌ను తొలగించకుండా, దానికి రంగులు వేయడం ద్వారా ‘మై బాడీ.. మై ఛాయిస్’ అని మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సహజమైన శరీరాన్ని అంగీకరించడమే కాకుండా, దాన్ని తమ క్రియేటివిటీకి వేదికగా మార్చుకుంటున్నారు.

సోషల్ మీడియాలో వైరల్!

ఈ ట్రెండ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌లలో కనిపించడంతో నెటిజన్లలో ఆసక్తి పెరిగింది. కొందరు యువతులు తమ రంగురంగుల అండర్‌ ఆర్మ్ హెయిర్‌ ను చూపిస్తూ ఫొటోలను షేర్ చేస్తున్నారు. దీంతో ఈ అంశంపై చర్చ కూడా మొదలైంది. ఇది అందానికి సంబంధించిన మరో కొత్త ఫ్యాషన్ ట్రెండ్‌గా కొందరు చూస్తుంటే.. మరికొందరు మహిళలపై ఉన్న సామాజిక ఒత్తిడికి వ్యతిరేకంగా వ్యక్తిగత స్వేచ్ఛను ప్రకటించే విధానంగా భావిస్తున్నారు.

Advertisement

ఈ ట్రెండ్‌కు మద్దతు ఇస్తున్నవారు మహిళలకు తమ శరీరంపై పూర్తి స్వేచ్ఛ ఉండాలని అంటున్నారు. ఇతరులు ఏం అనుకుంటారనే భయంతో శరీరంలోని సహజ లక్షణాలను మార్చుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే ఈ ట్రెండ్‌పై విమర్శలు కూడా వస్తున్నాయి. సహజంగా ఉండే శరీర భాగానికి రంగులు వేయడం అవసరమా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు దీన్ని వ్యక్తిగత స్వేచ్ఛ కంటే సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షించేందుకు చేస్తున్న ఫ్యాషన్ స్టంట్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు ఫ్యాషన్ కంటే ఎక్కువగా.. మహిళల శరీర స్వేచ్ఛపై జరుగుతున్న చర్చగా భావిస్తున్నారు.

Read Also: భార్య గర్భవతిగా ఉంటే భర్త క్షౌరం చేయించుకోకూడదా? అసలు నిజం ఇదే!

Tags

Related News

అమరావతి ORR డిజైన్‌లో కీలక మార్పులు.. కొత్త రూట్ మ్యాప్ ఇదే!

మధుర మీనాక్షి ఆలయాన్ని కట్టించింది తెలుగు రాజులేనా? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 70 మలుపులు.. ఈ రోడ్డు మీద డ్రైవింగ్ అంటే మామూలు విషయం కాదు!

అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీ మనసు దోచే 5 ప్రదేశాలు ఇవే

ఎమర్జెన్సీ కోడ్ యాక్టివేట్‌తో ప్రయాణికులు బెంబేలు, ఈసారి బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ వంతు, ఏం జరిగింది?

31 అడుగుల ఒంటి స్తంభం.. 700 ఏళ్ల చరిత్రకు సాక్ష్యం.. నల్లగొండలో ఈ చారిత్రక కట్టడం ఎక్కడుందో తెలుసా?

హోం వర్క్ లేదు.. ఎగ్జామ్స్ ఉండవు.. అయినా ఎడ్యుకేషన్ లో ప్రపంచంలోనే నెంబర్ వన్ కంట్రీ!

Big Stories

Advertisement
×