E-Paper
Advertisement

రేవంత్, కేసీఆర్ ఆస్తుల వివాదం.. హైకోర్టులో ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు!

రేవంత్, కేసీఆర్ ఆస్తుల వివాదం.. హైకోర్టులో ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు!
Advertisement

Raghunandan Rao: తెలంగాణలో పొలిటికల్ ఫైట్‌.. ఇప్పుడు లీగల్ టర్న్ తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ, BRS అధినేత KCR కుటుంబ ఆస్తులపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలంటూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. పత్రికల్లో వచ్చిన ఆరోపణల వివరాలను కూడా తన ఫిర్యాదుకు జత చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, KTR మధ్య.. అలాగే CM, BRS నేతల మధ్య జరుగుతున్న ఆస్తుల ఆరోపణలపై ఎవరూ న్యాయ విచారణ కోరడం లేదని రఘునందన్ రావు అన్నారు. అందుకే అక్టోబర్ 2న తాను చెప్పినట్టుగానే.. హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు రాతపూర్వక ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

ఆరోపణలేనా.. విచారణ లేదా?

Advertisement

సీఎం మీద KTR చేసిన ఆరోపణలు.. BRSపై సీఎం చేసిన ఆరోపణలు.. ఈ రెండింటినీ ఫిర్యాదులో జత చేసినట్లు చెప్పారు. అంతేకాదు.. KCR కుటుంబం లక్ష కోట్ల రూపాయలు దోచుకుందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోందని రఘునందన్ రావు అన్నారు. అదే సమయంలో రెండున్నరేళ్లలో సీఎం రేవంత్ 50 వేల కోట్లు సంపాదించారన్న ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ ఆరోపణలన్నింటిపైనా విచారణ జరిపి.. వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. అఫిడవిట్లలో చూపిన ఆస్తుల కంటే అదనంగా ఉన్న ఆస్తులను గుర్తించి విచారణ చేయాలని హైకోర్టును కోరారు.

హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు రఘునందన్ లేఖ కలకలం!

Advertisement

అయితే ఇక్కడితో తాను ఆగేది లేదన్నారు రఘునందన్ రావు. హైకోర్టుకు ఫిర్యాదు చేసిన ఆయన.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు సైతం ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మరి రాజకీయ వేదికపై మొదలైన ఈ ఆస్తుల పంచాయితీ… న్యాయస్థానంలో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Also Read: లక్ష రూపాయల లంచం.. ACB వలలో DMHO స్వర్ణకుమారి!

Tags

Related News

కల్వకుంట్ల శకం ముగిసింది.. 14 ఏళ్ల వనవాసం తప్పదు! BRS నేతలపై సాయికుమార్ ఫైర్

బీజేపీలో మహిళలకు రక్షణ లేదా.. మాజీ బీజేవైఎం జాతీయ కోశాధికారిపై కేసు నమోదు!

లక్ష రూపాయల లంచం.. ACB వలలో DMHO స్వర్ణకుమారి!

మద్యం లెక్కలు తీసిన మంత్రి జూపల్లి.. BRS హయాంలో 260% పెరిగితే, మా పాలనలో..!

ఐదు రోజలు ఉండాల్సిందే.. తేల్చి చెప్పేసిన టీఆర్ఎస్ చీఫ్ కవిత

కాంగ్రెస్ గెలిస్తే ఓకే.. ఓడిపోతే EVMల తప్పా? రాహుల్ గాంధీకి బీజేపీ సూటి ప్రశ్నలు!

ఎల్‌నినో దెబ్బకు ప్రభుత్వం కీలక నిర్ణయం.. వరి స్థానంలో ఇవి వేస్తే కాసుల వర్షమే!

Big Stories

Advertisement
×