Jio vs Airtel: దేశంలో టాప్ టెలికాం రంగ సంస్థల్లో జియో, ఎయిర్‌టెల్ తొలి రెండు స్థానాల్లో నిలుస్తాయి. ఈ సంస్థలు మధ్యతరగతి కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇందులో జియో తరపున రూ.299 ప్లాన్ బాగా పాపులర్ అయితే.. ఎయిర్ టెల్ లో రూ.349 రీఛార్జ్ మంచి ప్రజాధరణ సంపాదించింది. ఈ నేపథ్యంలో బెనిఫిట్స్ పరంగా రెండింటికి తేడా ఏంటి? దేవినల్ల యూజర్లకు లాభం ఎక్కువ? వంటి అంశాలను ఈ కథనంలో చూద్దాం.
ఎయిర్‌టెల్ ఈ ప్లాన్ ను 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద యూజర్లకు అపరిమిత కాల్స్ తో పాటు రోజుకు 100 SMSలు, 2GB డైలీ డేటా లభిస్తుంది. అర్హులైన కస్టమర్లకు 5G అపరిమిత డేటా సైతం ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది. ఇదే ప్లాన్ కింద కొన్ని అదనపు ప్రయోజనాలను సైతం ఎయిర్ టెల్ అందిస్తోంది. 6 నెలల ఆపిల్ మ్యూజిక్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్, 12 నెలల అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం యాక్సెస్ ను ఫ్రీగా పొందొచ్చు. అంతేకాకుండా హలో ట్యూన్స్ ప్రతీ నెలా మార్చుకునే వెసులుబాటు యూజర్లు పొందొచ్చు.
ఇక జియో ప్లాన్ విషయానికి వస్తే ఇది కూడా 28 రోజుల వ్యాలిడిటీనే కలిగి ఉంది. ఇందులో ప్రతిరోజూ 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఇక అడిషన్ బెనిఫిట్స్ కింద.. దాదాపు రూ.35,100 విలువైన 18 నెలల ఉచిత గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్రీగా పొందొచ్చు. దీంతో పాటు 5,000GB క్లౌడ్ స్టోరేజ్, ఇతర AI ఫీచర్లు యూజర్లకు లభించనున్నాయి.
Also Read: బిచ్చగాడి అవతారంలో.. యూట్యూబర్ ప్రయోగం.. ఆదాయం చూసి అంతా షాక్!
కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ ల విషయంలో రెండు ప్లాన్లు దాదాపుగా ఒకేలా ఉన్నప్పటికీ.. అదనపు బెనిఫిట్స్ లో మాత్రం స్పష్టమైన తేడా ఉంది. ఎక్కువ క్లౌడ్ స్టోరేజ్, AI టూల్స్ అవసరమైతే రూ.50 తక్కువ ధరలో లభించే జియో రూ.299 ప్లాన్ బెస్ట్. అలా కాకుండా ప్రతిరోజూ ఎక్కువ డేటా (2GB) కోరుకుంటే రూ.349 ప్లాన్ వైపు వెళ్లొచ్చు. ఫోటో, వీడియో ఎడిటింగ్ చేసే క్రియేటర్లకు.. ఆపిల్ మ్యూజిక్ లవర్స్ కు ఎయిర్‌టెల్ అందించే ఆఫర్లు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి.
Also Read: తిరుమలలో హైటెక్ గస్తీ.. రంగంలోకి రోబోటిక్ డాగ్.. మెట్లమార్గంలో చిరుతలకు చెక్!