E-Paper
Advertisement

కెమెరా హిస్టరీలోనే బిగ్ చేంజ్.. 68MP స్క్వేర్ సెల్ఫీ కెమెరాతో వస్తున్న కొత్త ఫోన్ ఇదే!

కెమెరా హిస్టరీలోనే బిగ్ చేంజ్.. 68MP స్క్వేర్ సెల్ఫీ కెమెరాతో వస్తున్న కొత్త ఫోన్ ఇదే!
Advertisement

OPPO Reno 18: సోషల్ మీడియా ప్రియులకు, రీల్స్ చేసేవారికి ఇక పండగే. కేవలం మెగాపిక్సెల్స్ పెంచి చేతులు దులుపుకోవడం కాకుండా.. కెమెరా డిజైన్‌నే మార్చేస్తోంది ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో. తమ కొత్త స్మార్ట్‌ఫోన్ ‘రెనో 18’లో ఊహించని విధంగా 68MP స్క్వేర్ (Square) సెల్ఫీ సెన్సార్‌ను తీసుకురాబోతున్నట్లు సమాచారం.

సాధారణంగా మనం వాడే స్మార్ట్‌ఫోన్లలో నిలువు లేదా అడ్డంగా ఉండే సాధారణ కెమెరా సెన్సార్లు ఉంటాయి. కానీ 1:1 సైజులో ఉండే ఈ స్క్వేర్ సెన్సార్ వల్ల ఫొటోలు, వీడియోలు తీసేటప్పుడు ఫ్రేమింగ్ చాలా ఈజీ అవుతుంది. ఫోన్‌ను ఎలా పట్టుకున్నా సరే, పర్ఫెక్ట్ యాంగిల్‌లో క్వాలిటీ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.

Advertisement

సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్, సెల్ఫీలు ఎక్కువగా తీసేవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ప్రతిసారి ఫోన్ పొజిషన్‌ను మార్చుకుంటూ ఫ్రేమ్ సరిచూసుకోవాల్సిన అవసరం లేకుండా.. సులభంగా కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ తరహా కెమెరా టెక్నాలజీ వల్ల ఒప్పో మిగతా పోటీదారుల కంటే ముందంజలో నిలిచే అవకాశం ఉంది.

Also Read: బ్లూటూత్ కాలింగ్, 140+ స్పోర్ట్స్ మోడ్స్.. షియోమీ నుంచి రూ.5,000కే అమోలెడ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్!

Advertisement

ప్రముఖ లీక్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ కథనం ప్రకారం.. ఈ సెన్సార్ అభివృద్ధిలో ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ ఫీచర్‌పై ఒప్పో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఉన్న నివేదికల ప్రకారం.. ఈ రెనో 18 సిరీస్ 2027 మే నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. లాంచ్‌కు ఇంకా చాలా సమయం ఉన్నందున, తుది మోడల్‌లో ఈ కెమెరా స్పెసిఫికేషన్లు మారే అవకాశం కూడా ఉంది.

ఒప్పో కంపెనీ కేవలం రెనో సిరీస్‌లోనే కాకుండా.. ఫైండ్ ఎక్స్10 అల్ట్రా వంటి ఫ్లాగ్‌షిప్ మోడళ్లలో 100 మెగాపిక్సెల్ స్క్వేర్ ఫ్రంట్ కెమెరాను కూడా తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఈ స్క్వేర్ సెల్ఫీ కెమెరా ఫీచర్ కనుక నిజమైతే, స్మార్ట్‌ఫోన్ ఫొటోగ్రఫీలో ఇది ఒక కొత్త ట్రెండ్‌గా మారడం ఖాయం.

Also Read: అద్భుతమైన AI ఫీచర్లు, కళ్లుచెదిరే డిజైన్‌తో కొత్త 5G ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Tags

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×