Jio vs Airtel Broadband Plans: దేశీయ టెలికాం దిగ్గజాలైన భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు అద్భుతమైన ప్లాన్లు తీసుకొస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే రెండు కంపెనీలు రూ. 699ల ధరలో ఆకర్షణీయమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అందుబాటులో ఉంచాయి. ఈ ప్లాన్లు ఇంటర్నెట్ తో పాటు అనేక రకాల ప్రయోజనాలను యూజర్లకు కల్పిస్తున్నాయి. ఒకే ధర కలిగిన ఈ బ్రాండ్ బ్యాండ్ ప్లాన్ల వివరాలు, వీటిలో ఏది బెస్ట్ అన్నది ఈ కథనంలో చూద్దాం.
జియో అందిస్తున్న రూ. 699 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రధానంగా హైస్పీడ్ ఇంటర్నెట్‌పైనే దృష్టి సారించింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 100 Mbps వేగంతో ఇంటర్నెట్ ను పొందొచ్చు. అపరిమితంగా డేటాను వాడుకోవచ్చని జియో వర్గాలు చెబుతున్నాయి. అయితే నెలవారీ కమర్షియల్ పరిమితి 3.3 TB కావడం గమనార్హం. మరోవైపు ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయం కూడా ఇందులో అందుబాటులో ఉంది. అయితే ఈ ప్లాన్‌లో ఎటువంటి ల్యాండ్‌లైన్ పరికరం, అదనపు OTT ప్రయోజనాలు లభించవు.
ఎయిర్‌టెల్ రూ. 699 ప్లాన్.. ఇంటర్నెట్ తో పాటు వినోదానికి పెద్ద పీట వేస్తుంది. ఈ ప్లాన్‌లో 40 Mbps వేగంతో అపరిమిత డేటాతో పాటు అదనంగా 22కు పైగా OTT సబ్‌స్క్రిప్షన్లు ఈ ప్లాన్ లో పొందొచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్, జీ5 (ZEE5), ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం, గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్లు వంటివి ఫ్రీగా వినియోగించుకోవచ్చు. వీటితో పాటు 350కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లు, ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయం యూజర్లకు లభించనుంది. అయితే ల్యాండ్‌లైన్ ఫోన్‌ను కలిగి ఉన్న యూజర్లకే ఈ ఫ్రీ కాలింగ్ సదుపాయం లభించనుంది.
Also Read: ‘గణేష్ నిమజ్జనం అయ్యింది.. ఇక జ్ఞానేష్ నిమజ్జనమే’.. ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్!
ఈ రెండు ప్లాన్ల ధరలు సమానంగా ఉన్నప్పటికీ వినియోగదారుల వ్యక్తిగత అవసరాలపైనే ఎంపిక ఆధారపడి ఉంటుంది. మీకు వినోదం కంటే కేవలం అధిక ఇంటర్నెట్ వేగం (100 Mbps) మాత్రమే ముఖ్యమనుకుంటే రిలయన్స్ జియో ప్లాన్ సరైన ఎంపిక. అలా కాకుండా ఇంటర్నెట్ వేగం కాస్త తగ్గిన పర్లేదు.. ఫ్రీ ఓటీటీలు, లైవ్ ఛానెళ్లు కోరుకుంటే మాత్రం ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.