Big Stories

Ather electric scooters : మళ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ల మధ్య ప్రైస్ వార్.. ధర తగ్గించిన ఏథర్

- Advertisement -
Ather electric scooters

Ather electric scooters : ఎలక్ట్రిక్ స్కూటర్స్ విభాగంలో తనకంటూ ట్రేడ్ మార్క్ వేసుకున్న కంపెనీ ఏథర్. మార్కెట్లో మరింత దూసుకెళ్లడానికి మరోసారి ధరల యుద్ధానికి తెరతీసింది. ఏథర్‌ 450X మోడల్‌పై ఏకంగా 30వేల రూపాయలు తగ్గించింది. ఓవైపు అన్ని కంపెనీలు కార్లు, బైక్‌ల ధరలు పెంచుతుంటే.. ఏథర్ మాత్రం ధరలు తగ్గించి ఆశ్చర్య పరిచింది.

- Advertisement -

టెక్నికల్‌గా ఏథర్‌ 450X మోడల్‌లో కొన్ని మార్పులు చేసిన కంపెనీ… ప్రో ప్యాక్ పేరుతో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కస్టమర్లు కోరుకునే అన్ని ఫీచర్లు ఏథర్‌ 450X మోడల్‌లో ఉన్నాయని కంపెనీ చెబుతోంది.

ఎలక్ట్రిక్ బైక్స్ తీసుకోవాలనుకునే వారికి రేట్లు అందుబాటులో ఉంచడం కోసమే.. ఏథర్ 450 ఎక్స్ మోడల్ ధర 30వేలు తగ్గిస్తున్నట్టు చెప్పినప్పటికీ.. ఓలాతో కంపీట్ చేయడానికే ఇలా రేటు తగ్గించిందని చెప్పుకుంటున్నారు మార్కెట్ ఎక్స్‌పర్ట్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ విభాగంలోకి రాకముందు.. ఏథర్ కంపెనీదే హవా. మార్కెట్లో కుదురుకుంటున్న సమయంలోనే ఓలా వచ్చింది. అటు టీవీఎస్ కూడా అందుబాటు ధర అంటూ ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొచ్చింది. ఓలా, టీవీఎస్ ఈవీ బైక్స్ ధరలు ఏథర్ కంటే తక్కువగా ఉండడంతో.. దీంతో ఏథర్ ఈవీ బైక్స్‌కు డిమాండ్ అండ్ క్రేజ్ తగ్గింది. మళ్లీ ఈవీ బైక్స్ విభాగంలో సత్తా చాటాలంటే ధరల తగ్గింపు ఒక్కటే మార్గమని భావించింది. ఇందుకోసం, టెక్నికల్‌గా కొన్ని మార్పులు చేసింది. ఏథర్‌ 450 ప్లస్‌ పేరుతో ఉన్న వేరియంట్‌ను తొలగించి.. ఏథర్‌ 450X మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. రైడ్‌ మోడ్స్‌,  టచ్‌స్క్రీన్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ వంటి ఏవీ లేకుండా ఉండే 450X వేరియంట్‌ ధరను ఏకంగా రూ.30వేలు మేర తగ్గించింది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం, మ్యూజిక్‌, కాల్స్‌, మ్యాప్స్‌, మొబైల్‌ యాప్‌ కనెక్టివిటీ, పుష్‌ నోటిఫికేషన్‌ వంటి సదుపాయాలనూ ఇందులోంచి మినహాయించింది.

ఏథర్‌ 450X హైదరాబాద్‌లో రూ.1,14,636కు లభిస్తుండగా.. ప్రో ప్యాక్‌ వేరియంట్‌ రూ.1.45 లక్షలుగా ఉంది. ప్రస్తుతం ఓలా ఎస్‌ 3kWh వేరియంట్‌ రూ.1.14 లక్షలు ఉండగా.. టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎస్‌ ధర రూ.1.21 లక్షలకు వస్తోంది.

ఏథర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయోగాని.. మార్కెట్ పోటీ తట్టుకోడానికి ఓలా సహా మిగిలిన ఈవీ కంపెనీలు సైతం ధరలు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో, రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ బైక్స్ ధరలు మరింత తగ్గనున్నాయి. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News