Sony LinkBuds Clip review: వైర్ లెస్ ఇయర్ బడ్స్ మార్కెట్‌లో ప్రతి రోజూ కొత్త కొత్త డిజైన్లలో వస్తుంటాయి. కానీ కొన్ని మాత్రం తమ ప్రత్యేకమైన డిజైన్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. తాజాగా.. సోనీ విడుదల చేసిన ‘సోనీ లింక్‌బడ్స్ క్లిప్’ అలాంటి కోవకే చెందుతుంది. సాధారణ ఇయర్ బడ్స్‌లా కాకుండా ఇది చెవికి క్లిప్ లాగా తగిలించుకునే విధంగా ఉంటుంది. దీని వల్ల గంటల తరబడి వాడినా చెవుల్లో నొప్పి రాకుండా ఎంతో కంఫర్ట్‌గా ఉంటుంది. మరి ఈ కొత్త గ్యాడ్జెట్ విశేషాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఈ ఇయర్ బడ్స్ మెయిన్ హైలైట్ దీని డిజైనే. సాంప్రదాయ ఇయర్ బడ్స్ లాగా ఇవి చెవి లోపలికి.. చొప్పించాల్సిన అవసరం లేదు. చెవి బయటి భాగంలో క్లిప్ లాగా ఫిట్ అవుతాయి. దీని వల్ల మనం పాటలు వింటూనే చుట్టూ.. జరిగే శబ్దాలను కూడా స్పష్టంగా వినొచ్చు. ఆఫీసుల్లో పని చేసేటప్పుడు లేదా బయట రన్నింగ్ చేసేటప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎంత సేపు పెట్టుకున్నా చెవులకు ఎలాంటి ఇబ్బంది కలగదు.
ఓపెన్-ఇయర్ డిజైన్ అయినప్పటికీ.. సోనీ తన బ్రాండ్ వాల్యూకు తగినట్లుగా మంచి సౌండ్ క్వాలిటీని.. అందించడానికి ప్రయత్నించింది. వోకల్స్ చాలా స్పష్టంగా వినిపిస్తాయి. అయితే.. హెవీ బాస్ కోరు కునే వారికి ఇది కొంచెం నిరాశ కలిగించవచ్చు. బయట ఉండే నాయిస్ కొంతవరకు.. లోపలికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి ఇది సూపర్‌గా ఉంటుంది. కాల్స్ మాట్లాడేటప్పుడు.. మైక్ పని తీరు చాలా క్లియర్‌గా ఉంది.
బ్యాటరీ బ్యాకప్ విషయంలో.. సోనీ ఎప్పుడూ నిరాశపరచదు. ఈ లింక్ బడ్స్ క్లిప్ సింగిల్ ఛార్జ్‌తో మంచి బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి ఇది రోజంతా పని చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. అలాగే బ్లూటూత్.. కనెక్టివిటీ చాలా స్ట్రాంగ్‌గా ఉండి, ఫోన్‌తో త్వరగా పేర్ అవుతుంది. లాగ్ లేని కనెక్షన్ దీని సొంతం.
Also Read: రూ.1999లకే అదిరిపోయే స్మార్ట్‌వాచ్..ఇన్ఫినిక్స్ Xవ్యాచ్ H5 ప్రో ఫీచర్లు అదుర్స్!
ఇక ధర విషయానికి వస్తే.. సోనీ బ్రాండ్, దీని యూనిక్ డిజైన్ కారణంగా ఇది కొంచెం ఖరీదైనదే అని చెప్పాలి. సాధారణ ఇయర్ బడ్స్‌తో పోలిస్తే దీని ధర ఎక్కువగానే ఉంది. అంటే.. ఈ డివైజ్ అందించే అద్భుతమైన కంఫర్ట్ కోసం మనం ఆ మాత్రం ధర చెల్లించాల్సిందే. హెవీ బేస్ లవర్స్ , నాయిస్ క్యాన్సిలేషన్ కోరుకునే వారికి ఇది సరి పోకపోవచ్చు. కేవలం కంఫర్ట్ , ఓపెన్-ఇయర్ లిజనింగ్ ఇష్ట పడే వారికే ఇది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది.
మొత్తానికి.. సోనీ లింక్ బడ్స్ క్లిప్ అనేది అందరికీ నప్పే ప్రొడక్ట్ కాకపోయినా.. ఎంతో కంఫర్ట్‌గా ఉంటూ చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తూ మ్యూజిక్ వినే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ.. సోనీ బ్రాండ్ క్వాలిటీ , డిజైన్ పరంగా ఇది తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది!