E-Paper
Advertisement

పండుగ సీజన్‌ కు ముందే బజాజ్ బిగ్ ప్లాన్.. ఏకంగా 6 కొత్త బైక్‌లు రెడీ!

పండుగ సీజన్‌ కు ముందే బజాజ్ బిగ్ ప్లాన్.. ఏకంగా 6 కొత్త బైక్‌లు రెడీ!
Advertisement

Bajaj Bike Launches 2026: పండుగ సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇండియన్ మార్కెట్ లో కొత్త బైక్ ల సందడి మొదలుకాబోతోంది. ఇందులో భాగంగానే బజాజ్ ఆటో మరింత దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే ఆగస్టులో నాలుగు మోటార్‌ సైకిళ్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన సంస్థ.. ఇప్పుడు మరో ఆరు మోడళ్లను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. వీటిలో పూర్తిగా కొత్త బైక్‌లతో పాటు, ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మోడళ్లకు కొత్త వేరియంట్లు, అప్‌డేట్లు కూడా ఉండబోతున్నాయి.

ఆగస్టులోనే నాలుగు కొత్త బైక్‌లు

బజాజ్ ఆటో ఈ నెలలో ఇప్పటికే పల్సర్ 125, పల్సర్ 150కు అప్ డేట్స్ తీసుకొచ్చింది అంతేకాదు, పల్సర్ N160 S, SS లాంటి కొత్త వెర్షన్లను కూడా పరిచయం చేసింది. అయినప్పటికీ కంపెనీ కొత్త బైక్స్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. మరో ఆరు మోడళ్లను కూడా త్వరలో తీసుకురావాలని భావిస్తోంది. దీంతో ఆగస్టు నుంచి పండుగ సీజన్ వరకు బజాజ్ నుంచి మొత్తం పది మోడళ్ల వరకు కొత్తగా, అప్‌డేట్ రూపంలో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

రెండు కంప్లీట్ కొత్త పల్సర్లు

Advertisement

రాబోయే పది మోడళ్లలో రెండు పూర్తిగా కొత్త పల్సర్లు ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. మిగిలిన మోడళ్లలో కొత్త వేరియంట్లు, ఫీచర్ అప్‌ డేట్లు, ఇతర మార్పులు ఉండనున్నాయి. ఈ మేరకు బజాజ్ ఆటో మార్కెటింగ్ ప్రెసిడెంట్ సుమీత్ నారంగ్ కీలక వివరాలు వెల్లడించారు. 125, 150 సీసీ మోడళ్లలో ఇప్పటికే రెండో దశ విడుదల కొనసాగుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.

మూడు పల్సర్ ప్లాట్‌ఫారమ్‌లపై ఫోకస్

బజాజ్ ప్రస్తుతం తన 125-160 సీసీ మోటార్‌ సైకిల్ శ్రేణిని పూర్తిగా రిఫ్రెష్ చేయాలని కంపెనీ చూస్తోంది. ఇందుకోసం పల్సర్ ఫ్యామిలీని మూడు ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లుగా విభజిస్తోంది. ఒరిజినల్ పల్సర్, N సిరీస్, NS సిరీస్ ఇలా మూడు విభాగాలు వేర్వేరు రైడర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తోంది. ముందుగా ఒరిజినల్, N సిరీస్‌ లకు అప్‌డేట్లు వచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడు NS శ్రేణిపై కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది.

అమ్మకాల్లోనూ పల్సర్ దూకుడు

Advertisement

పల్సర్ బ్రాండ్‌ కు మార్కెట్‌లో మంచి డిమాండ్ కొనసాగుతోంది. 2026 జూలైలో 66,156 యూనిట్ల అమ్మకాలతో అత్యధికంగా అమ్ముడైన మోటార్‌ సైకిల్ శ్రేణుల్లో పల్సర్ మూడో స్థానంలో నిలిచింది. బజాజ్ స్పోర్ట్స్ మోటార్‌ సైకిళ్ల విభాగం కూడా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో గతేడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 50 శాతం వృద్ధిని నమోదు చేసింది. పల్సర్‌ తో పాటు అవెంజర్, డొమినార్ మోడళ్లు కూడా మంచి పనితీరు కనబరిచాయి.

డ్యూయల్ స్పోర్ట్, బోన్నెవిల్ 400 కూడా

పల్సర్‌లతో పాటు బజాజ్ నుంచి మరో క్రేజీ మోడల్ కూడా రానుంది. కంపెనీ తొలిసారిగా డ్యూయల్ స్పోర్ట్ మోటార్‌ సైకిల్‌ ను డెవలప్ చేస్తోంది. ఈ బైక్ ఇప్పటికే టెస్టింగ్‌లో కనిపించింది. ముందుగా బ్రెజిల్ మార్కెట్‌లో విడుదల చేసి, ఆ తర్వాత భారత్‌కు తీసుకురావచ్చని తెలుస్తోంది. అదే సమయంలో ట్రయంఫ్ బోన్నెవిల్ 400 కూడా త్వరలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న ట్రయంఫ్ 400 సిరీస్‌కు రెట్రో డిజైన్‌ తో కూడిన కొత్త మోడల్‌గా నిలవనుంది.

Read Also: MG డబుల్ ధమాకా.. EV, PHEVతో కొత్త టోమాహాక్ SUVలు లాంచ్!

Tags

Related News

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

హ్యుందాయ్ బేయాన్ N లైన్ వచ్చేసింది.. టర్బో పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా!

డెంజా D9 ఇండియన్ లాంచ్‌కు రెడీ.. ధర ఎంతో తెలుసా?

కవాసకి వెర్సిస్ 900 వచ్చేసింది, భారత్‌లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

భారత్‌ పై విన్‌ఫాస్ట్ ఫుల్ ఫోకస్.. తెలంగాణ, ఏపీలోనూ షోరూమ్‌లు!

కొత్త కలర్, సరికొత్త ఫీచర్లు.. MG విండ్సర్ EV కొత్త ఎడిషన్ వచ్చేసింది!

మహీంద్రా XUV 3XO CNG టీజర్ విడుదల.. అక్టోబర్ 15న ఆవిష్కరణ!

Big Stories

Advertisement
×