Lava Bold N4 Pro 5G: దేశీయ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న లావా కంపెనీ మరో కొత్త ఫోన్‌ను స్వదేశంలో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్న Bold N4 సిరీస్‌లో భాగంగా ఇప్పుడు Lava Bold N4 Pro 5G ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. సాధారణ వినియోగదారుల బడ్జెట్‌లో లభించే ఈ ఫోన్ లాంచ్ డేట్‌తో పాటు కొన్ని కీలకమైన ఫీచర్లను కూడా కంపెనీ రివీల్ చేసింది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
మన దేశంలో ఈ లావా బోల్డ్ N4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా లాంచ్ కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేకమైన పేజీ కూడా ఇప్పటికే లైవ్‌లోకి వచ్చింది. ఇక ఈ ఫోన్ అమ్మకాల విషయానికి వస్తే.. లాంచ్ అయిన తర్వాత ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. తక్కువ బడ్జెట్‌లో 5G అనుభూతి కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది.
Also Read: వాట్సప్ కస్టమర్ కేర్ పేరుతో మోసాలు.. మెసేజ్ చేసేముందు ఈ నియమాలు పాటించడం బెటర్!
లావా బోల్డ్ N4 ప్రో 5G ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ సామర్థ్యమనే చెప్పాలి. లావా సంస్థ ఇందులో ఏకంగా 6,000mah బ్యాటరీని అందించింది. దీనివల్ల ఫోన్ ఛార్జింగ్ గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అలాగే ఫోన్ వెనుకభాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్‌తో రానుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్ డిజైన్‌ను ఏర్పాటు చేశారు.
డిజైన్ పరంగా చాలా సింపుల్‌గా, ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉంది. ఫోన్ వెనుక భాగం ఫ్లాట్‌గా ఉండి, టాప్ లెఫ్ట్ కార్నర్‌లో చతురస్రాకారపు కెమెరా మాడ్యూల్ ఇచ్చారు. అలాగే సైడ్స్ కూడా ఫ్లాట్ ఫ్రేమ్‌తో వస్తోంది. ఫోన్ పవర్ బటన్, వాల్యూమ్ బటన్లు కుడి వైపున ఇచ్చారు. లుక్ పరంగా ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ లావా బోల్డ్ N4 ప్రో 5G ప్రధానంగా గోల్డ్ మరియు బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో మనకు కొనుగోలు చేయడానికి లభిస్తుంది.
గత నెలలో లాంచ్ అయిన Lava Bold N4 Lite ఫోన్ రూ.8,099 ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు వస్తున్న ఈ Pro మోడల్ ధర, దీనికి వాడిన ప్రాసెసర్ వివరాలను కంపెనీ ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. రానున్న రోజుల్లో లాంచ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ కంపెనీ మిగతా వివరాలను కూడా బయటపెట్టనుంది. తక్కువ ధరలో మంచి బ్యాటరీ, కెమెరా ఉన్న 5G ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది కచ్చితంగా మంచి ఛాయిస్ అవుతుంది.
Also Read: Moto Buds 2 Fusion వచ్చేస్తోంది.. 6 మైక్రోఫోన్లు, 53 గంటల బ్యాటరీతో అదరగొట్టే ఫీచర్లు!